కర్ణాటక సంగీతం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:കർണ്ണാടകസംഗീതം
చి యంత్రము కలుపుతున్నది: de:Karnatische Musik; cosmetic changes
పంక్తి 2:
'''కర్ణాటక సంగీతము''' (ఆంగ్లం : '''Carnatic music''' ([[సంస్కృతం]]: '''Karnāṭaka saṃgītaṃ''') భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక శైలి. హిందుస్తానీ సంగీతం ఉత్తర భారతదేశం లో కానవస్తే ఈ సంగీతం భారత ఉపఖండంలో ముఖ్యంగా ద్రవిడ రాష్ట్రాలు లేదా దక్షిణ భారత రాష్ట్రాలైన [[ఆంధ్రప్రదేశ్]], [[కర్ణాటక]], [[కేరళ]] మరియు [[తమిళనాడు]]లో కానవస్తుంది. హిందుస్థానీ సంగీతం పర్షియన్ మరియు ఇస్లామిక్ ప్రభావం వలన తనదైన ప్రత్యేకమైన శైలి సంతరించుకోగా, కర్నాటక సంగీతం మాత్రం సాంప్రదాయ మూలాలను పరిరక్షించుకుంటూ వస్తోంది. కానీ రెండింటిలోనూ సాధారణంగా గాత్ర సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
 
== చరిత్ర ==
[[Imageదస్త్రం:Saraswati.jpg|thumb|right|200px|[[సరస్వతి]], సంగీతపు దేవి, ఈమె చేతిలో [[వీణ]].]]
భారతీయ సంప్రదాయంలోని అన్ని [[కళ]]లలాగే కర్నాటక సంగీతానికి కూడా దేవతలకు సంబంధించిన మూలాలు ఉన్నాయి <ref>[[#Moorthy2001|Moorthy (2 p1001)]],7</ref> <ref>[http://www.hindu.com/seta/2005/01/13/stories/2005011300111500.htm The Hindu : Sci Tech / Speaking Of Science : The music of we primates: Nada Brahmam]</ref>. ఈ సంగీతాన్ని నాదబ్రహ్మకు చిహ్నంగా భావిస్తారు. ప్రకృతిలోని జంతువుల మరియు పక్షుల స్వరాలను నిశిత పరిశీలన ద్వారా అనుకరించడం ద్వారానే స్వరాలు ఏర్పడ్డాయని హిందూ గ్రంధాలు తెలియజేస్తున్నాయి. వైదిక యజ్ఞాల్లో,ఋగ్వేద సామవేద మంత్రాల్లో ఉచ్చరింపబడే కొన్ని సంగీత స్వరాలు ,భారతీయ శాస్త్రీయ సంగీతానికి పునాదిరాళ్ళ వంటివని చెబుతారు. వీణ గాత్రానికి పక్క వాయిద్యమని, [[యజుర్వేదం]]లో చెప్పబడింది. రామాయణ,భారతాల్లో కూడా శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి.
[[యాజ్ఞవల్క్య స్మృతి]] లో చెప్పబడినట్లు, " తాళశృతి పరిజ్ఞానము కలిగిన వీణావాదకుడు నిస్సందేహంగా మోక్షమార్గాన్ని పొందుతాడు."
పంక్తి 16:
ప్రస్తుతం ఈ సంగీతం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఇంకా ప్రపంచంలో ఎక్కడైనా చెప్పుకోదగ్గ స్థాయిలో దక్షిణ భారతీయులు నివసిస్తూ ఉంటే అక్కడ కూడా ఇది తప్పక వారి జీవనంలో భాగంగా ఉంటుంది. ప్రతీ యేటా చెన్నై లో డిసెంబరు మరియు జనవరి మధ్యలో జరిగే కర్ణాటక సంగీత ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలకు దేశం నలుమూలలనుంచీ కళాకారులు విశేషంగా హాజరవుతారు.
 
== ప్రధాన అంశాలు ==
=== శృతి ===
శ్రుతి అంటే [[ధ్వని]] విశేషం. గీతానికి పనికి వచ్చే శ్రుతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం)కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది. శృతి అనగా స్థాయిని సూచిస్తుంది. ఈ సంగీతంలో ఇతర అంశాలకు ఇది ప్రాథమిక భావన లాంటిది. <ref >[http://www.karnatik.com/glosss.shtml Royal Carpet: Glossary of Carnatic Terms]</ref>. ఇది పాశ్చాత్య సంగీతంలో ''టానిక్'' లేదా ''కీ'' కి దగ్గరగా ఉంటుంది. అష్టమ స్వరాల్లో స్థాయీ భేధాన్ని సూచించడానికి కూడా దీనిని వాడుతుంటారు. ఒక రాగంలో ఎన్నిరకాలైన స్థాయి భేదాలైనా ఉండవచ్చు కానీ సాధారణ మానవుని చెవి కేవలం ఇరవై రెండింటిని మాత్రమే గుర్తించగలదు. ఒక్కోసారి శ్రోత దృష్టిలో ఇది భావాన్ని కూడా సూచిస్తుంది.<ref>http://www.soundofindia.com/showarticle.asp?in_article_id=952096767 Sound of India</ref>
 
=== స్వరం ===
{{main|స్వరాలు}}
ఈ సంగీతంలో '''స''', '''రి''', '''గ''', '''మ''', '''ప''', '''ద''', '''ని''' అని సప్త స్వరాలు (ఏడు స్వరాలు) ఉంటాయి. ఇవి '''షడ్జమ''', '''రిషభ''', '''గాంధార''', '''మధ్యమ''', '''పంచమ''', '''ధైవత''', '''నిషధ''' అనే పొడవైన పేర్లకు సంక్షిప్త రూపాలు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు తప్పని మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉండాలన్న నియమం లేదు.ఇతర సంగీత ప్రక్రియల్లాగా కాకుండా ఈ ఏడింటిలో షడ్జమానికీ, పంచమానికీ, మధ్యమానికీ తప్ప మిగతా స్వరానికీ మూడు ఉప రీతులు ఉంటాయి. షడ్జమానికీ, పంచమానికీ ఒకే రీతి, మధ్యమానికీ రెండు ఉపరీతులూ ఉంటాయి.
 
=== రాగం ===
{{main|రాగాలు}}
కర్ణాటక సంగీతంలో '''రాగం''' అంటే ఏదైనా ఒక మాధుర్యాన్ని పలికించడానికి ఏర్పరిచిన కొన్ని నిబంధనల సమాహారం.ఇది పాశ్చాత్య సంగీతంలో మోడ్ (mode) కు దగ్గరగా ఉంటుంది. ఆరోహణ, అవరోహణలు ఎలా సాగాలి అన్నదానికి కూడా నిభందనలు ఉన్నాయి. సప్త స్వరాలయిన స, రి, గ, మ, ప, ద, ని రాగం యొక్క ఆరోహణా అవరోహణల్లో ఖచ్చితంగా వున్న రాగాలని మేళ కర్త రాగాలంటారు. వీటి సంఖ్య 72. వీటినే జనక రాగాలని కూడా అంటారు. ఈ మేళ కర్త రాగాలనుండి పుట్టిన రాగాలని జన్య రాగాలంటారు. అంటే ఆరోహణా, అవరోహణల్లో ఒకటీ లేదా రెండు స్వరాలు వర్జితం కావచ్చు, కొన్ని అదనంగా ఉండచ్చు. ఈ జన్య రాగాలకీ అనేక విభజనలున్నాయి.
 
=== తాళం ===
{{main|తాళం}}
సంగీతంలో వినిపించే మరోధ్వని విశేషం తాళం. దీనినే లయ అని కూడా అంటారు. తాళం అంటే నిర్ణీత కాలవ్యవధిలో క్రమబద్ధమైన, లయబద్ధమైన రీతిలో వచ్చే ఒక దరువు. శ్రుతి లయలు సంగీత మాధుర్యానికి ఆధారాలు. అట్టి తాళంలో కూడా రకాలున్నాయి. ఆది తాళం 8 మాత్రలతో కూడింది. చుతాళ లేక ఏక తాళం 12 మాత్రలతో కూడింది. జపతాళ 10 మాత్రలతో, రూపక్ తాళ 7 మాత్రలతోను, తీన్ తాళ 16 మాత్రలతో కూడినది.
పంక్తి 42:
# ఏక తాళం ( 1 )
 
== మనోధర్మ సంగీతం ==
;రాగాలాపన
ఆలాపన అంటే లయతో సంబంధం లేకుండా రాగాన్ని ఆలపించడం.సాధారణంగా మనోధర్మ సంగీతంలో దీనిని సులభమైన ప్రక్రియగా పరిగణిస్తారు. ఎందుకంటే మిగతా ప్రక్రియలతో పోలిస్తే ఇందులో నియమ నిబంధనలు తక్కువగా ఉండటమే. కానీ వీనులవిందైన ఒక సంపూర్ణమైన రాగాలాపన చేయడం మాత్రం కష్టమైన విషయమే. ఇందుకు చాలా నైపుణ్యం అవసరమౌతుంది.
పంక్తి 54:
ఇది సుధీర్ఘమైన ప్రదర్శనల్లో ముఖ్య అంశంగా ఉంటుంది.
 
== కూర్పులు ==
గీతాలు, మరియు స్వరజతులు ముఖ్యంగా కర్ణాటక సంగీత సాధనలో ప్రాథమిక అంశాలు.
=== వర్ణం ===
రాగ సంచారాన్ని "వర్ణం" వివరిస్తుంది. స్వర ఉచ్ఛారనణ ను, రాగ లక్షణాన్ని, రాగ అవరోహణ, ఆరోహణ క్రమాన్ని కూడా వర్ణం వివరిస్తుంది. వర్ణాల్లో చాలా రకములు ఉన్నాయి. పల్లవి, అను పల్లవి, ముక్థాయి స్వరాలు, చరణం, మరియు చిత్త స్వరాలు వర్ణానికి సర్వ సాధారణం. వివిధ గతుల్లో అభ్యాసం చేయటానికి వీలుగా వీటిని రచించారు.సాధారణంగా గాత్ర కచేరీల్లో శ్రోతలను మురిపించటానికి వర్ణ ఆలాపనతో గాయకులు కార్యక్రమాన్ని ఆరంభిస్తారు.
 
=== కృతి ===
కృతిలో మూడు ప్రధాన భాగాలుంటాయి.
* పల్లవి
* అనుపల్లవి
* చరణం
 
== ప్రముఖ విద్వాంసులు ==
[[Fileదస్త్రం:Purandara.jpg|thumb|right|200px|కర్ణాటక సంగీత పితామహునిగా భావించే [[పురందర దాసు]].]]
కర్ణాటక సంగీతంలో అనేకమంది పేరెన్నిక గన్న విద్వాంసులున్నారు. [[పురందర దాసు]] (1480-1564) సల్పిన విశేష కృషి వల్ల ఆయన్ను ఈ సంగీతానికి ఆద్యుడిగా భావిస్తారు. ఈ సంగీతంలో ప్రాథమిక అంశాలని ఈయనే సూత్రీకరించాడు.
 
సమకాలికుల్లో [[త్యాగరాజు]], [[ముత్తుస్వామి దీక్షితులు]], [[శ్యామశాస్త్రి]] లను కర్ణాటక సంగీతానికి త్రిమూర్తులుగా భావిస్తారు. వీరి కంటే ముందు అరుణాచల కవి, [[అన్నమయ్య|అన్నమాచార్య]], నారాయణ తీర్థులు, విజయదాసు, [[రామదాసు]], సదాశివ బ్రహ్మేంద్ర, ఊటుకూరి వెంకటకవి, మొదలైన వారు ఇందులో ప్రముఖులు. ఇంకా [[స్వాతి తిరునాళ్]], గోపాలకృష్ణ భారతి, నీలకంఠ శివన్, పట్నం సుబ్రమణి అయ్యర్, మైసూరు వాసుదేవాచారి, ముత్తయ్య భాగవతార్, కోటీశ్వర అయ్యర్, [[సుబ్రమణ్య భారతీయార్]], పాపనాశం శివన్ మొదలైన వారు కూడా ప్రసిద్ధిగాంచారు. వీరి కీర్తనలు ప్రస్తుతం అనేకమంది కళాకారులు వేదికలపై గానం చేస్తుంటారు.
 
== నేర్చుకోవడం ==
ఈ సంగీతాన్ని బోధించడానికి పురందరదాసు కొన్ని పద్దతులు ఏర్పరచాడు. దీని ప్రకారం ముందుగా '''వరుసలు''' నేర్పిస్తారు. తరువాత '''అలంకారాలు''', '''గీతాలు''' (సులభమైన పాటలు), '''స్వరజతులు''' నేర్పించబడతాయి. విద్యార్థి ఒక దశ చేరుకున్న తర్వాత '''వర్ణాలు''', '''కృతులు''' బోధిస్తారు. సాధారణంగా వేదిక మీద ప్రదర్శన ఇవ్వడానికి ఒక విద్యార్థికి కొన్ని ఏళ్ళ కాలం అవసరమౌతుంది. ఈ సంగీతాన్ని మొదటి సారిగా నేర్చుకునే వారికి '''మాయా మాళవ గౌళ రాగాన్ని''' నేర్పిస్తారు. ఇదిసంగీతంలో తొలి అడుగులు వేసేవారికి అనుకూలంగా ఉంటుందని పురంధర దాసు ప్రకటించాడు.
 
బోధనా పద్దతులు, ఉపకరణాలు దాదాపు అన్ని దక్షిణాది రాష్ట్రాలలోనూ ఒకే విధంగా ఉంటాయి. అభ్యాసం సరళీ వరుసలతో ప్రారంభమై, క్రమంగా క్లిష్టమైన అంశాలకు మళ్ళుతుంది. సాంప్రదాయకంగా ఈ సంగీతాన్ని [[గురుకుల విద్యా విధానం]] లోనే బోధించే వారు. కానీ 20వ శతాబ్దం మలి భాగం నుంచీ ప్రజల జీవనశైలిలో గణనీయమైన మార్పులు సంభవించడంతో, ఈ సంగీతాన్ని నేర్చుకోదలచిన పిల్లలు, దీనికి సమాంతరంగా మరో విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగించాల్సి రావడంతో గురుకుల విధానం ప్రాచుర్యాన్ని కోల్పోయింది.
 
== ప్రదర్శన ==
ప్రదర్శనలో ఎత్తైన వేదికపై కూర్చున్న కొద్దిమంది గాయకుల బృందం గానం చేస్తారు. వీరిలో ఒకరు ప్రధాన గాయకులుగా ఉంటారు. ఈయనకు శృతి, లయ, తాళంలో సహకారంగా కొంత మంది కళాకారులు ఉంటారు. [[తంబుర]] సాంప్రదాయకంగా వస్తున్న శృతి వాద్యం. కానీ ఇప్పుడిప్పుడు శృతి పెట్టెలు వాడుతున్నారు.
=== ముఖ్యాంశాలు ===
ఈ ప్రదర్శననే ''కచేరీ'' అని కూడా వ్యవహరిస్తారు. ఇది సుమారు మూడు గంటల పాటు కొనసాగుతుంది. ప్రదర్శన వర్ణంతో ప్రారంభమౌతుంది. దీనిలో ఎక్కువగా స్వరాలకు ప్రాధాన్యత ఇవ్వబడి ఉంటుంది. కానీ కొద్దిపాటి సాహిత్యం కూడా సమ్మిళితమై ఉంటుంది. వర్ణాల తరువాత కీర్తనలను ఆలపించడం జరుగుతుంది. ఇవి సాధారణంగా వర్ణాలకంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి. సాధారణంగా ఒక కృతి ఒక్క రాగంలోనే స్వరపరచబడి ఉంటుంది. కానీ ఒకే కృతిలో ఒకదానికంటే ఎక్కువ రాగాలు కూడా ఇమిడియుండవచ్చు. ఇటువంటి వాటిని ''రాగమాలికలని'' వ్యవహరిస్తారు.
=== శ్రోతలు ===
సాధారణంగా ఈ ప్రదర్శనలకు హాజరయ్యేవారు కనీసం కొద్దిపాటి సంగీత పరిజ్ఞానం కలిగినవారు అయి ఉంటారు. వీరు గాయకులు గానం చేస్తున్నపుడు తమ చేతులను పైకి, క్రిందకు కదుపుతూ తాళాన్ని అనుసరిస్తుండటాన్ని గమనించవచ్చు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== బయటి లింకులు ==
* [http://www.worldmusiccentral.org/article.php/2006052911335276 Simple Introduction to South Indian Classical Music - Part 1]Published by World Music Central
* [http://www.worldmusiccentral.org/article.php/20060701174708376 Simple Introduction to South Indian Classical Music - Part 2]Published by World Music Central
* [http://dmoz.org/Arts/Music/Styles/C/Classical_Indian/Carnatic/ DMOZ directory links on Carnatic music]
 
[[వర్గం:సంగీతం]]
పంక్తి 102:
[[ml:കർണ്ണാടകസംഗീതം]]
[[ca:Música carnàtica]]
[[de:Karnatische Musik]]
[[eo:Karnatika muziko]]
[[es:Música carnática]]
"https://te.wikipedia.org/wiki/కర్ణాటక_సంగీతం" నుండి వెలికితీశారు