వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 246:
[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] 02:15, 20 అక్టోబర్ 2010 (UTC)
: ఇంగ్లీషు వికీపీడియా లో మూస చూసి అదే ప్రకారం తెలుగులో చేయవచ్చు. మూసలు తయారుచేయటం, మార్చటానికి కొంత సాంకేతిక నిపుణత కావాలి. నేర్చుకొని ఎవరైనా చేయవచ్చు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 09:09, 20 అక్టోబర్ 2010 (UTC)
 
== వీకీ పీడియా తెలుగు నిర్వాహకులారా... మీకు రోషం ఉందా... ==
 
వీకీపీడియా తెలుగు నిర్వాహకులారా.. మీక రోషం ఉందా అని ప్రశ్నిస్తున్నాను.
మీరు వీకీపీడియా తెలుగు నిర్వాహకులు కావడానికి మీకున్న అర్హతల గురించి నేను ప్రశ్నిస్తున్నాను.
రోజూ వీకీపీడియాలోకి ప్రవేశించడమా...???
లేక.. రోజువారీగా పనీపాట లేని ఉబుసుపోక చర్చల్లో మరింత చురుగ్గా పాల్గనడమా..?????
అన్నాను అని కాదు... ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి.
తరతరాలకు ఉండేవిధంగా చక్కటి తెలుగు విజ్ఞానబాండాగరంగా వీకీపీడియాను తీర్చిదిద్దాలని.. మా ఆశ( కచ్చితంగా మీ ఆశ మాత్రం కాదు.. )
సంఖ్యాపరంగా పరిగెడుతున్నాం.. అని మీరు బాగా చంకలు కొట్టుకుంటున్నారు.
తప్ప...
ఒక్కసారి కళ్లు తెరిచి చూడండి
ఒకడు.. బూతు భొమ్మలతో ఆర్టికల్స్‌ మీద ఇంగ్లిష్‌ టెక్ట్స్‌ ఆర్టికల్స్‌ మన మీదకు డంప్‌ చేస్తాడు.
మరొకడు.. రోజూ మరే పనిలేనందంటూ తిథి పేర్లతో వందల సంఖ్యలో ఏకవాక్య ఆర్టికల్స్‌ సృష్టిస్తాడు. ఇక సినిమా విభాగానికి చెందిన కొంతమంది ప్రముఖలు ఇదే వర్గం కిందకు వస్తారు. సినిమా పేరు, నటీనటుల పేర్లతో ఆర్టికల్‌ పూర్తవుతుంది.
 
ఇక గూగుల్‌ వారి సంగతి చెప్పనక్కరలేదు.
స్వకార్యం, స్వామి కార్యం రెండూ నెరవేరినట్లు.. ఛారిటీ పేరిట.. గూగుల్‌ వికీపీడియా తెనుగీకరణ అంటూ.. అమెరికా సామాజ్య్రవాద భావజాలాన్ని భారతదేశం దశదిశలా వ్యాప్తి చెందేలా.. యాంత్రిక అనువాదాలు జరుపుకుంటే...
గౌరవనీయులైన తెలుగు వీకీపీడియా నిర్వాహకులారా...
గూగుల్‌ తెలుగు సంస్కతిపై సాగుతున్న దండయాత్ర కనపడలేదా...????
''''''ఇక గూగుల్‌ గోల ఒక్కటైతే.. యాంత్రిక అనువాదాలు చేసేవారి గోల మరొకటి.''''''
 
అస్సలు అది తెలుగేనా...????
మీరు ఒప్పుకుంటారో లేదో.. కానీ.. పట్టుమని పదోక్లాసు పాసుకాని వ్యక్తి కూడా.. అది తెలుగు కాదు.. తెలుగుకు పట్టిన తెగులు అని ఢంకా భజాయించి మరీ చెబుతాడు.
ఈ విధంగా అప్రతిహాతంగా వీకీపీడియా తెలుగు తల్లిని దినమొక పరి వివస్త్రను చేస్తుంటే.. అవేమీ మీకు పట్టవు.
గంధం తోటలో కలుపు మొక్క ఉండవచ్చు.. కానీ కలుపు తోటలో గంధం చెట్టు ఉందంటే కృతకంగా ఉంటుంది.
చేవలుడిన వారుమాత్రమే తమ తోటలో కలుపును దట్టంగా పెరగనిస్తారు.
మన తెలుగు వీకీపీడియా పరిస్థితి అలానే ఉంది. తెలుగు వీకీపీడియా ఇప్పుడు ఒక పెద్ద కలుపుతోట.
ఏం. తెలుగువారిమైన మనకు బెంగాలీలకు ఉన్న పౌరుషం లేదా.. తమిళలకున్న రోషం లేదా...?
మనమేమైనా అర్థనారీశ్వరులమా... ?
మనభాషను మనం కాపాడుకోలేమా..??
మన సంస్కృతిని మనం కాపాడుకోమాలేమా..????
 
కాపాడుకోగలం..
ఎందుకంటే మనం అర్థనారీశ్వరులమో.. మరొకటో కాదు...
తమ భాషపై జరుగుతున్న దాడిని బెంగాలీ వీకీపీడియన్లు ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నారు. అసలకు తమ భాష స్థాయికి లేవంటూ.. బెంగాలీ వీకీపీడియా నిర్వాహకులు గూగుల్‌ వారు అనువదించిన వార్తలను మొత్తాన్ని పీకిపారేశారు. వారు మొనగాళ్లు.. వారిని అభినందించవలసిందే. మన పొరుగున ఉండే తమిళ సోదరులు సైతం.. గూగుల్‌ మెడలు వంచారు.
ఏమంటారు..
మనం బెంగాలీల బాట ఒక్క వారం రోజులు పడితే చాలు.. యాంత్రిక అనువాదాల పేరిట వచ్చే కథనాలను డిలీట్‌ చేస్తే.. అప్పుడు గూగుల్‌వారికి బుద్ధి వస్తుంది. అలాగే సింగిల్‌ లైన్‌ వార్తలనూ డిలీట్‌ చేస్తాం అని చెప్పి.. నాలుగు రోజులు సమయం ఇవ్వండి.
మూసలు పోస్తాం. లంకెలు పెడతాం... అనే పనులకు కాస్త విరామం ఇవ్వండి. ప్రపంచంలో ఎక్కడా లేని షోడశ కన్యల గురించి, జలసూత్రం వారి వంశవృక్షం గురించి.. మరో చెత్త గురించో ప్రతిపాదనలు ఆపండి..
లేదు మీరంతా బిజీగా ఉన్నామని చెబితే.. మాకు తోచిన విధంగా తెలుగువీకీపీడియాను సంస్కరిస్తాం..