వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

చి
మన తెలుగు వీకీపీడియా పరిస్థితి అలానే ఉంది. తెలుగు వీకీపీడియా ఇప్పుడు ఒక పెద్ద కలుపుతోట.
ఏం. తెలుగువారిమైన మనకు బెంగాలీలకు ఉన్న పౌరుషం లేదా.. తమిళలకున్న రోషం లేదా...?
మనమేమైనా <s>అర్థనారీశ్వరులమా</s>... ?
మనభాషను మనం కాపాడుకోలేమా..??
మన సంస్కృతిని మనం కాపాడుకోమాలేమా..????
 
కాపాడుకోగలం..
ఎందుకంటే మనం <s>అర్థనారీశ్వరులమో</s>.. మరొకటో కాదు...
 
తమ భాషపై జరుగుతున్న దాడిని బెంగాలీ వీకీపీడియన్లు ఎంతో సమర్థంగా ఎదుర్కొన్నారు. అసలకు తమ భాష స్థాయికి లేవంటూ.. బెంగాలీ వీకీపీడియా నిర్వాహకులు గూగుల్‌ వారు అనువదించిన వార్తలను మొత్తాన్ని పీకిపారేశారు. వారు మొనగాళ్లు.. వారిని అభినందించవలసిందే. మన పొరుగున ఉండే తమిళ సోదరులు సైతం.. గూగుల్‌ మెడలు వంచారు.
మూసలు పోస్తాం. లంకెలు పెడతాం... అనే పనులకు కాస్త విరామం ఇవ్వండి. ప్రపంచంలో ఎక్కడా లేని షోడశ కన్యల గురించి, జలసూత్రం వారి వంశవృక్షం గురించి.. మరో చెత్త గురించో ప్రతిపాదనలు ఆపండి..
లేదు మీరంతా బిజీగా ఉన్నామని చెబితే.. మాకు తోచిన విధంగా తెలుగువీకీపీడియాను సంస్కరిస్తాం..
 
* అర్థనారీస్వరుడు అంటే శివుడు అని అర్థం. ఆ పదాన్ని ఒకసారి సరిగా గమనించి ఉపయోగించి ఉండాల్సింది. నారి, ఈస్వరుడు(శివుడు)..... అలాంటి పదాన్ని మీరు ఒక బూతుగా ప్రయోగించడం కేవలం తెలియనితనం అని భావించి ఆ వాక్యాలను ఖండిస్తున్నాను. తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ, ఎక్కడా ఆ పదాన్ని బూతుగా వాడలేదు. స్త్రీ పురుషల సమానత్వాన్ని సూచించడానికి శివుడు తన శరీరంలో అర్థ భాగాన్ని తన భార్యకు ఇస్తాడని ఏదో పురాణగాధ(నాకూ సరిగా తెలీదు). మీరు ఆ పదం బదులు నపుంసకులు అన్న పదం వాడాల్సింది. కాకపోతే అటువంటి పరుషపదజాలం వాడకుండా ఉంటే మంచిది. ఇహ అసలు విషయానికి వస్తే , నేను నిర్వాహకుడిని కాదు కానీ మన తెలుగువారికి ఇప్పుడిప్పుడే కాస్త భాషాభిమానం, ఆత్మాభిమానం అలవడుతోంది. నెమ్మదిగా వాడుకరుల సంఖ్య పెరిగి మరింత మంచి వ్యాసాలు రూపొందుతాయని ఆశిద్దాం. వాడుకరుల సంఖ్య తక్కువున్నా చాలా మంచి వ్యాసాలు రూపొందాయి [[వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా]] చూడండి. యాంత్రిక అనువాదాల గురించి ఇదివరకు కూడా చర్చ జరిగిందనుకుంట. వాటన్నిటినీ ఒక ప్రత్యేక వర్గంలో చేరుస్తున్నారు. వీలున్నప్పుడు నెమ్మదిగా వాటిని కూడా సంస్కరిస్తారు. మీరు బహుశా కొత్త వాడుకరి అనుకుంట. కొత్తలో ఇలాగే అన్నీ తప్పులే కనపడతాయి. సంస్కరించే పని మొదలుపెడితే దాని లోతు మీకు కూడా తెలుస్తుంది. ఏమీ పర్లేదు. మనలాంటి భాషాభిమానులు తోడ్పాటు అందిస్తూ ఉంటే తప్పక అభివృద్ధి కనపడుతుంది. ఇహ మీరు కూడా రంగంలోకి దిగండి. శుభమస్తు. --[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 11:49, 3 నవంబర్ 2010 (UTC)
577

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/554794" నుండి వెలికితీశారు