వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 289:
 
* అర్థనారీస్వరుడు అంటే శివుడు అని అర్థం. ఆ పదాన్ని ఒకసారి సరిగా గమనించి ఉపయోగించి ఉండాల్సింది. నారి, ఈస్వరుడు(శివుడు)..... అలాంటి పదాన్ని మీరు ఒక బూతుగా ప్రయోగించడం కేవలం తెలియనితనం అని భావించి ఆ వాక్యాలను ఖండిస్తున్నాను. తెలుగు సాహిత్యంలో ఎప్పుడూ, ఎక్కడా ఆ పదాన్ని బూతుగా వాడలేదు. స్త్రీ పురుషల సమానత్వాన్ని సూచించడానికి శివుడు తన శరీరంలో అర్థ భాగాన్ని తన భార్యకు ఇస్తాడని ఏదో పురాణగాధ(నాకూ సరిగా తెలీదు). మీరు ఆ పదం బదులు నపుంసకులు అన్న పదం వాడాల్సింది. కాకపోతే అటువంటి పరుషపదజాలం వాడకుండా ఉంటే మంచిది. ఇహ అసలు విషయానికి వస్తే , నేను నిర్వాహకుడిని కాదు కానీ మన తెలుగువారికి ఇప్పుడిప్పుడే కాస్త భాషాభిమానం, ఆత్మాభిమానం అలవడుతోంది. నెమ్మదిగా వాడుకరుల సంఖ్య పెరిగి మరింత మంచి వ్యాసాలు రూపొందుతాయని ఆశిద్దాం. వాడుకరుల సంఖ్య తక్కువున్నా చాలా మంచి వ్యాసాలు రూపొందాయి [[వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా]] చూడండి. యాంత్రిక అనువాదాల గురించి ఇదివరకు కూడా చర్చ జరిగిందనుకుంట. వాటన్నిటినీ ఒక ప్రత్యేక వర్గంలో చేరుస్తున్నారు. వీలున్నప్పుడు నెమ్మదిగా వాటిని కూడా సంస్కరిస్తారు. మీరు బహుశా కొత్త వాడుకరి అనుకుంట. కొత్తలో ఇలాగే అన్నీ తప్పులే కనపడతాయి. సంస్కరించే పని మొదలుపెడితే దాని లోతు మీకు కూడా తెలుస్తుంది. ఏమీ పర్లేదు. మనలాంటి భాషాభిమానులు తోడ్పాటు అందిస్తూ ఉంటే తప్పక అభివృద్ధి కనపడుతుంది. ఇహ మీరు కూడా రంగంలోకి దిగండి. శుభమస్తు. --[[వాడుకరి:శశికాంత్|శశికాంత్]] 11:49, 3 నవంబర్ 2010 (UTC)
** నేను తెలుగు కాలెండర్ ప్రకారం ప్రతి రోజుకు ఒక పేజీ తయారుచేస్తున్నాను. ఇది స్వచ్ఛమైన తెలుగుతనానికి ఉదాహరణ. ఈ కాలెండర్ ప్రకారం ప్రతి రోజు వచ్చే పండగలను చేరుస్తాను. అందుకు కావలసిన పుస్తకాలు నా వద్ద ఉన్నాయి. ప్రముఖుల జీవితచరిత్రలు మీరెవరి దగ్గరైనా ఉంటే వారి పుట్టిన మరియు మరణించిన తిథుల్ని వీటిలో చేర్చమని మనవి. 1947కు ముందు బ్రిటిష్ వారు రాకపూర్వం తేదీలంటే ఈ తెలుగు కాలెండర్ ప్రకారం మాత్రమే చూసుకొనేవారు. ఇప్పుడు అవేమిటో కొందరికి తెలియదు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 14:15, 3 నవంబర్ 2010 (UTC)