వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు)/పాత చర్చ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 293:
* రాజశేఖర్ గారూ మీకృషి ప్రశంశనీయమైనది. నాకు తెలిసిన విషయాలు నేనూ చేరుస్తాను. --[[వాడుకరి:T.sujatha|t.sujatha]] 16:42, 3 నవంబర్ 2010 (UTC)
::యాంత్రిక అనువాద వ్యాసాలపై ఇది వరకు చాలా సార్లు చర్చ జరిగింది. ఆ వ్యాసాలు చాలా సభ్యులకు రుచించడం లేదు కూడా, కాని ఇంతవరకు వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి అలాంటి వ్యాసాల సంఖ్య వృద్ధి అవుతూనే ఉంది. కొత్త వ్యాసాలే కాదు ఎంతో కష్టపడి, ఎందరో సభ్యుల కృషి వల్ల చక్కగానే వృద్ధి చెందిన వ్యాసాలపై కూడా యాంత్రిక వ్యాసాలు ఓవర్‌టేక్ చేశారు. ఇదే విషయం నేను ఇదివరకు తెలియజేశాను. సభ్యులు ప్రతిస్పందించకపోవడంతో నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. తెవికీలో నిర్వాహకులు స్వయంగా ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోరు, ఏది చేసిననూ పాలసీలు, సంప్రదాయాల ప్రకారము కాని, ప్రజాస్వామ్య పద్దతిలో సభ్యుల అంగీకారం ప్రకారం కాని చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది నిర్వాహకుల తప్పిదం అని చెప్పడం సరికాదు, సభ్యులందరూ దీనిలో భాగస్వామ్యులే. నిర్వాహకులకు మామూలు సభ్యుల కంటె అనుభవం ఉంటుంది, ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వడంతో కొత్తసభ్యులకు తోడ్పడతారు. కొత్తగా చేరిన సభ్యుడైననూ, సంవత్సరాల అనుభవం ఉన్న నిర్వాహకుడైననూ ప్రస్తుతమున్న పాలసీల ప్రకారం ఓటింగ్ నిర్ణాయకంలో ఇద్దరూ సమానమే. కొత్త సభ్యులైననూ నిస్సందేహంగా ప్రస్తుత లోపాలను సరిదిద్దడానికి చర్చలు లేవదీయవచ్చు. మీరు యాంత్రిక వ్యాసాలు తదితర విషయాలపై చర్చ తీస్తే మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం నిర్వాహకులు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#020103;color:white;"> సి. చంద్ర కాంత రావు </font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"> - చర్చ </font>]] 20:00, 3 నవంబర్ 2010 (UTC)
 
 
 
'''ముందుగా శశికాంత్‌ గారికి ధన్యవాదాలు. '''
నా ప్రతిపాదనపై చర్చ లేవదీసినందుకు... అయితే శశికాంత్‌ గారు మూల విషయాన్ని పక్కనబెట్టి.. అర్థనారీశ్వరులన్న పదంపై దృష్టి సారించి మీరు ప్రత్యుత్తరం ఇవ్వడం కోడిగ్డుపై ఈకలు పీకడం..లాంటిదే. మీరన్నట్లు.. మీరు సూచించిన పదాన్ని ఉపయోగిద్దాం. నో ప్రాబ్లమ్‌...
అర్థనారీశ్వరుడున్నదన్ని బూతు అర్థం ధ్వనించే విధంగా నేను ఉపయోగించలేదు. ఇది పూర్తిగా మీ తెలియనితనం. అక్కడ చేతగాని వారు, లేదా ఏ పనిని పూర్తిగా చేయలేనివారని తెలియజెప్పే వ్యంగ్యప్రయోగం. ఇక ఆ పదం గురించి చర్చ కొనసాగిస్తే.. పుంఖానుపుంఖాలు రాయాల్సి ఉంటుంది.
శశికాంత్‌గారు... మొత్తం నా ప్రతిపాదనలో భావం మీకు అర్థం అయి ఉంటుందని భావిస్తున్నాను. అపరిపక్వ అనువాద వ్యాసాలు, గూగుల్‌ చేస్తున్న సాంస్కృతిక దాడిని, అల్లరి చిల్లరగా ఒక్కొక్క వాక్యం రాసే వారిని ఏరిపారేయాలనేది నా ప్రతిపాదన.
 
ఇక వీకీపీడియాకు కొత్త వాడకరిని మీరు నా గురించి ప్రస్తావించారు.
దీనికి కొలమానం ఏమిటండి..? వీకీపీడియలో రోజూ లాగిన్‌ అయితే పాత లేక పోతే కొత్తా... ??? లేక మరేదయినా ఉందా...?
 
ఇక చంద్రకాంతరావుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చంద్రకాంతరావు గారు.. మీరన్న విషయాలను కొన్నింటిని ఏకీభవిస్తాను. మరికొన్నింటితో విబేధిస్తాను.
అనువాద వ్యాసాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీరు పేర్కొన్నారు.
గూగుల్‌ వారి అనువాద వ్యాసాలు ప్రారంభమై.. ఇప్పటికి 18 మాసాలు కావొస్తోంది. ఒక పక్క సాంస్కృతి దాడి.. మరో పక్క వ్యాపార దృక్పథంతో..అక్షరం అంటే తెలియని బీపీవోలు... కోట్ల రూపాయలు అర్జిస్తూ... (నిజంగానే ఈ అనువాదాలపేరిట కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి) తెలుగు వీకీపీడియాను కలుషితం చేస్తుంటే.. నిర్ణయం తీసుకోలేదంటున్నారు.. ఈ అలసత్వానికి కారణాలు ఏమిటో..???
సభ్యులు ప్రతిపాదించకపోవడంతో...నిర్ణయాలు తీసుకోవడం ఇబ్బందిగా మారుతోందన్నారు. నేనూ సభ్యుడినే...( కాదంటారా.. దానికేమైనా ప్రమాణాలున్నాయా)
ఇప్పుడు నేను ప్రతిపాదిస్తున్నాను. అనువాద వ్యాసాలు, ఏక వాక్య వ్యాసాలపై కఠిన నిర్ణయం తీసుకోవాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నాను.
చంద్రకాంతరావుగారు.. దీనిపై చర్చను ముందుకు తీసుకెళ్లాల్సినదిగా అభ్యర్థిస్తున్నాను. అయితే రావుగారు.. మరో విషయం..
 
తెవికి నిర్వాహకుల నుంచి వచ్చే పడికట్టు సమాధానాన్ని ముందుగానే ఇక్కడ పొందుపరుస్తున్నాను. గతంలోనూ ఇదే విధమైన సమాధానాలు రావడంతో... వారికి ఆ సమాధానం ఇచ్చే అవకాశం లేకుండా.. దానిపై మరో ప్రశ్నను సైతం లేవనెత్తుతున్నాను.
వారి సమాధానం( ఊహించి...)
అలాంటి అనువాద వ్యాసాలన్నింటిని.. యాంత్రిక అనువాదాల కింద పెడుతున్నాం. ఆసక్తికరమైన వారు వీటిని శుద్ధి చేసి.. వాటిపైన ఉన్న యాంత్రిక అనువాదాల మూసను తొలగించమని కోరుతున్నాం. వీలైనంత వరకు మాకు మట్టుకు మేము.. కొన్నింటిని సంస్కరిస్తున్నాం.
ఎంత సిగ్గు చేటు...
అవి యాంత్రిక అనువాదాలా...????
ఎవరైనా కొత్త వ్యక్తి చూస్తే.. నిజంగానే యంత్రాల ద్వారా వాటిని అనువదించారేమో అని అనుకుంటున్నారు.
భావదారిద్య్రానికి పరాకాష్ట.. అది యాంత్రిక అనువాదం కాదు..
గూగుల్‌ వారు..కేవలం కాసులకు ఆశపడి.. నిర్లక్ష్యంగా.. తెంపరితనంతో.. వచ్చీరానీ తెలుగులో.... అడ్డూ అదుపు లేకుండా చేసిన అనువాదాలు.. అని పెట్టలేమా...?
ఇక మనం ఎందుకు వాటిని శుద్ధి చేయాలండి.. చంద్రకాంతరావు గారు.. రుసుము తీసుకొని అనువదించే వారు మనలాంటి ఔత్సాహికులకన్నా.. మరింత బాధ్యతతో వాటిని అనువదించాలి. వారు పని జవాబుదారీగా ఉండేవిధంగా.. తెవికి నిర్వాహకులు వ్యవహరించాలి కదా..
ఆ బాధ్యత నెరవేర్చనప్పుడు నిర్వాహకులనే పదానికి అర్థం ఏమిటో..????