ఉత్తరేణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
==పురాణ కథ==
[[ఇంద్రుడు]] వృత్తాసురుని చంపిన తరువాత [[నముచి]] అనే రాక్షసుని చంపడానికి అతనితో కపట స్నేహం చేస్తాడు.<ref>పవిత్రవృక్షాలు, అనువాదం: పి.ఎస్. శంకరరెడ్డి, తమ్మన్న, గోపీకృష్ణ, తిరుమల తిరుపతి దేవస్థానాలు, తిరుపతి, 2006, పేజీలు: 67-8.</ref> నముచి విశ్రాంతి తీసుకొంటుండగా ఇంద్రుడు అతని తలను నరికివేస్తాడు. ఆ తెగిన తల ''మిత్రద్రోహి'' అని అరుస్తూ ఇంద్రుని తరుముకొస్తుంది. దానితో భయపడిన ఇంద్రుడు బృహస్పతిని సంప్రదించి ఒక యాగము చేసి నముచి తల బారినుండి తప్పించుకుంటాడు. ఆ యాగమే రాజసూయ యాగంలోని ఒక భాగం. ఇందులో ఉత్తరేణి ధాన్యం వాడారు. ఈ ధాన్యం వాడి యాగం చేసిన ఇంద్రుడు, నముచికి కనబడడు. అలా అపమార్గం పట్టించింది కాబట్టి ఈ మొక్కకు అపామార్గం సార్ధకనామం అయింది.
 
==ఉపయోగాలు==
ఉత్తరేణి ఆకుల రసం [[కడుపునొప్పి]]కి, [[అజీర్తి]]కి, మొలలకు, ఉడుకు గడ్డలకు, చర్మపు పొంగుకు మంచి మందుగా ఉపయోగపడుతుంది. దీని వేరులతో పళ్లు తోమితే చిగుళ్లు, పళ్లు గట్టిపడతాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉత్తరేణి" నుండి వెలికితీశారు