"ముక్కోటి ఏకాదశి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
 
ఏడాదికి 24 [[ఏకాదశులు]] వస్తాయి. [[సూర్యుడు]] [[ఉత్తరాయణం|ఉత్తరాయణానికి ]] మారే ముందు వచ్చే [[పుష్య శుద్ధ ఏకాదశి]]నే '''వైకుంఠ ఏకాదశి''' లేదా '''ముక్కోటి ఏకాదశి''' అంటారు. ఈ రోజున [[వైకుంఠం|వైకుంఠ]] వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర [[ద్వారం]] వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు [[మహావిష్ణువు]] గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు [[కోట్లు|కోట్ల]] ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
 
వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు [[బియ్యం]]లో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు [[అన్న దానం]] చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/558664" నుండి వెలికితీశారు