ప్రోటిస్టా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: lt:Protistai
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''ప్రోటిస్టా''' ([[లాటిన్]] Protista) జీవుల రాజ్యంలో ఏకకణ నిజకేంద్రక [[జీవులు]] ఉన్నాయి. వీనిలో కశాభయుత జీవులు, డయాటమ్ లు, డైనోఫ్లాజెల్లేట్ లు, జిగురు బూజులు, జుఫ్లాజెల్లేట్ లు, సార్కోడైన్ లు, సీలియేట్ లు, స్పోరోజోవన్ లు, ప్రోటోజోవన్ లు, ప్రాథమిక వృక్షాలు, ప్రాథమిక శిలీంద్రాలు చేరి వున్నాయి.
 
జీవావరణ వ్యవస్థలో జలచరాలుగా నివసించే ఈ జీవులు వృక్ష ప్లవకాలుగా (ఉత్పత్తిదారులు), జంతు ప్లవకాలుగా (ప్రాథమిక వినియోగదారులు) ఉంటాయి. జిగురు బూజులు కణకుడ్య రహిత, కణకుడ్య సహిత జీవులకు మధ్యస్థంగా ఉంటాయి. శాఖీయ దశ కుడ్యరహితంగాను, ప్రత్యుత్పత్తి దశలు కుడ్యసహితంగాను ఉంటాయి. పోషణ పూతికాహార భక్షణ, జాంతవ భక్షణ పద్ధతులలో జరుగుతుంది. కాంతి లభించే సమయంలో పాదపీయ భక్షణ, కాంతి లేనప్పుడు పూతికాహార భక్షణ జరుపుకొనే యూగ్లీనా వంటి జీవులను మిశ్రమ పోషకాలు అంటారు. సహజీవనం గడిపే ప్రోటిస్ట్ లు చెదపురుగుల వంటి కీటకాల ఆంత్రనాళంలో ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రోటిస్టా" నుండి వెలికితీశారు