గిఫెన్ వస్తువులు: కూర్పుల మధ్య తేడాలు

55 బైట్లు చేర్చారు ,  11 సంవత్సరాల క్రితం
చి
[r2.5.2] యంత్రము కలుపుతున్నది: ka:გიფენის საქონელი; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: vi:Hàng hóa Giffen)
చి ([r2.5.2] యంత్రము కలుపుతున్నది: ka:გიფენის საქონელი; cosmetic changes)
ఆర్థిక శాస్త్రములో '''గిఫెన్ వస్తువులు''' (Giffen good) అనగా తక్కువస్థాయి వస్తువులు. వీటి ధర పెరిగిననూ [[ఆదాయ ప్రభావం]] మరియు [[ధర ప్రభావం]] వల్ల కొనుగోలు కూడా పెరుగుతుంది. గిఫెన్ వస్తువులకు ఆధారము చూపడానికి పరిమిత అవకాశం ఉన్ననూ [[ఆర్థిక శాస్త్రము|ఆర్థిక]] నమూనా ప్రకారం ఇటువంటి వస్తువుల ఉనికి ఉందని చెప్పవచ్చు. రాబర్ట్ గిఫెన్ (Sir Robert Giffen) పేరు మీదుగా ఈ వస్తువులకు గిఫెన్ వస్తువులు అని పేరు పెట్టబడిననూ ప్రముఖ ఆర్థిక వేత్త [[ఆల్‌ఫ్రెడ్ మార్షల్]] యొక్క [[ప్రిన్సిపుల్ ఆఫ్ ఎకనామిక్స్]] గ్రంథంలో గిఫెన్ గురించి పేర్కొనినందుకే ఈ పదం ప్రసిద్ధిచెందింది.
 
అన్ని వస్తు ఉత్పత్తులకు [[ధర డిమాండ్ వ్యాకోచత్వం]] రుణాత్మకంగా ఉంటుంది. అనగా ధరకు మరియు డిమాండుకు విలోమ నిష్పత్తి ఉటుంది. ధర పెరిగితే డిమాండు తగ్గడం, ధర తగ్గితే డిమాండు పెర్గడం జర్గుతుంది. గిఫెన్ వస్తువులు దీనికి మినహాయింపు. ఈ వస్తువులకు ధర డిమాండు వ్యాకోచత్వం ఒకటి కంటే ఎక్కువ. ధర పెరిగిననూ ఈ వస్తువుల డిమాండు కూడా పెరుగుతుంది మరియు ధర తగ్గితే డిమాండు కూడా తగ్గుతుంది. నిజమైన గిఫెన్ వస్తువులకు డిమాండు పరిమాణంలో మార్పులు రావడానికి ధర ఒక్కటే ఏకైక కారణం. [[వెబ్లెన్ వస్తువులు|వెబ్లెన్ వస్తువుల]]వలె వినియోగంతో సంబంధం ఉండదు.
 
ఆర్థికవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్ ఇచ్చిన సాంప్రదాయిక ఉదాహరణ ప్రకారం చెప్పాలంటే ఈ వస్తువులకు డిమాండ్ [[పేదరికం]] వల్ల ఏర్పడుతుంది. ధరలు పెరగడంతో పేదవారు ఎక్కువ నాణ్యత గల వస్తువులను కొనుగోలు శక్తి ఉండదు కాబట్టి ఆ వస్తువుల వాడకాన్ని తగ్గించి తక్కువస్థాయి వస్తువులనే అధికంగా కొనుగోలు చేస్తారు. కాబట్టి ధర పెర్గినప్పుడు ఈ వస్తువుల డిమాండ్ పెర్గుతుంది.
 
[[1895]]లో ఆల్ఫ్రెడ్ మార్షల్ రచించిన "ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్" గ్రంథంలో ఈ విధంగా తెలిపినాడు -
:: ''గిఫెన్ తెలిపినట్లు రొట్టె ధర పెరిగినప్పుడు వారి ద్రవ్య ఉపాంత వినియోగం పెంచుకొనుటకు మాంసం మరియు ఇతర అధిక ధరల వస్తువులను వినియోగానికి తగ్గించి తక్కువ ధర ఉన రొట్టెపై మునుపటి కంటే అధికంగా ఖర్చు చేస్తారు కాని తక్కువ చేయరు.''
== గిఫెన్ వస్తువుల విశ్లేషణ ==
వినియోగ వస్తువులకు ఈ పరిస్థ్తి రావడానికి 3 ప్రమేయాలు అవసరం-
# అవి తక్కువ స్థాయి వస్తువులై ఉండవలెను.
ఒక నియమిత ధర వద్ద ఒక వినియోగదారుడు ఒక నియమిత పరిమాణంలో ఒక వస్తువును కొనుగోలు చేస్తుంటాడు. [[ఉదాసీనత వక్రరేఖ]] పై [[బడ్జెట్ రేఖ]] ఖండిమ్చే బిందువు వద్ద సమతౌల్యంలో ఉంటాడు. ఆ వస్తువు ధర తగ్గితే ప్రత్యమ్నాయ ప్రభావం వల్ల ఆ వస్తుబు మునుపటి కంటే అధిక పరిమాణంలో కొనుగోలు చేస్తాడు. కాని అదే సమయంలో ఆదాయ ప్రభావం వల్ల వినియోగదారుడి బడ్జెట్ రేఖ కూడా ముందుకు జరుగుతుంది. కాబట్టి వాస్తవ ఆదాయం పెర్గినట్లు భావించి వినియోగదారుడు అంతకంటే నాణ్యమైన వస్తువులను అధికంగా వినియోగించి నాసిరకం వస్తువులను తక్కువగా వాడుతాడు. కాబట్టి ధర తగ్గిననూ నాసిరకం లేదా చౌకబారు వస్తువుల డిమాండు తగ్గుతుంది.
 
== ఇవి కూడా చూడండి ==
* [[సప్లయ్ మరియు డిమాండ్]]
* [[ధర డిమాండ్ వ్యాకోచత్వం]]
[[it:Beni di Giffen]]
[[ja:ギッフェン財]]
[[ka:გიფენის საქონელი]]
[[ko:기펜재]]
[[lt:Gifeno prekės]]
21,447

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/561692" నుండి వెలికితీశారు