"మణిపూర్" కూర్పుల మధ్య తేడాలు

చి
r2.5.2) (యంత్రము కలుపుతున్నది: hif:Manipur; cosmetic changes
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: fa:مانیپور)
చి (r2.5.2) (యంత్రము కలుపుతున్నది: hif:Manipur; cosmetic changes)
districts=9 |
website=manipur.nic.in |
seal=[[బొమ్మదస్త్రం:Manipurseal.png|center]] |
footnotes = |
}}
 
'''మణిపూర్''' (মনিপুরমনিপুর, Manipur) [[భారతదేశం]] ఈశాన్యభాగాన ఉన్న ఒక రాష్ట్రము. దీని రాజధాని [[ఇంఫాల్]]. మణిపూర్ రాష్ట్రానికి ఉత్తరాన [[నాగాలాండ్]], దక్షిణాన [[మిజోరామ్]], పశ్చిమాన [[అసోం]] రాష్ట్రాలున్నాయి. తూర్పున [[మయన్మార్]] దేశంతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.
 
మణిపూర్‌లో [[మెయితీ]] తెగకు చెందినవారు అధిక సంఖ్యాకులు. వారి భాష [[మెయితీ భాష]]. దీనినే మెయితిలాన్ అనీ, [[మణిపురీ భాష|మణిపురీ]] అనీ అంటారు. 1992లో దీనిని [[భారత జాతీయ భాషలు|జాతీయ భాషలలో]] ఒకటిగా గుర్తించారు,
మణిపూర్ ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్రంగా పరిగణింపబడుతున్నది. కనుక దేశం మిగిలిన ప్రాంతాలలో లేని కొన్ని నిబంధనలు ఇక్కడ అమలులో ఉన్నాయి. మణిపూర్‌కు వచ్చే విదేశీయులు (మణిపూర్‌లో జన్మించిన విదేశీయులు కూడా) "నియంత్రిత ప్రాంత అనుమతి" (Restricted Area Permit) కలిగి ఉండాలి. ఈ అనుమతులు 10రోజులకు మాత్రమే చెల్లుతాయి. యాత్రికులు అనుమతింపబడిన ట్రావెల్ ఏజంట్ల ద్వారా ఏర్పాటు చేయబడిన టూర్లలో, అదీ 4 వ్యక్తుల గ్రూపులలో, మాత్రమే పర్యటించవలెను. ఇంకా వారు ఇంఫాల్ నగరానికి విమాన ప్రయాణం ద్వారానే అనుమతింపబడుతారు.
 
== చరిత్ర ==
ఒకప్పుడు [[థాయ్‌లాండ్]], [[బర్మా]]ల మధ్య తగవులలో మణిపూర్, అస్సాంలు ఇరుక్కున్నాయి. బర్మావారు థాయ్‌లాండ్‌ను ఆక్రమించిన తరుణాన్ని అవకాశంగా తీసుకొని మణిపూర్ బర్మా భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళింది. ఆ కారణంగా బర్మావారు మణిపూర్, అస్సాంలపై దండెత్తారు. దీనితో ప్రక్కనున్న బెంగాల్‌ను పరిపాలిస్తున్న బ్రిటిష్‌వారు కలుగజేసుకొనవలసి వచ్చింది. తమ ఆధిపత్యాన్ని నిలుపకోవడానికి, బర్మాను నిరోధించడానికీ బ్రిటిష్‌వారు 1891లో అస్సాంను, మణిపూర్‌ను బర్మానుండి జయించి, తమ సామ్రాజ్యంలో కలుపుకొన్నారు.
 
1972లో మణిపూర్‌ను ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
 
== జిల్లాలు ==
{{:భారతదేశ జిల్లాల జాబితా/మణిపూర్}}
 
== మణిపూర్ ఎదుర్కొంటున్న సమస్యలు ==
 
=== మాదక ద్రవ్యాలు ===
మణిపూర్ ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలలో ఒకటి [[మాదక ద్రవ్యాల అలవాటు]] (drug addiction). మాదక ద్రవ్యాల వ్యాపారంలో ముఖ్యస్థానమైన [[బంగారు త్రికోణం]] (Golden Triangle) దగ్గరలో ఉండటం ఈ సమస్య పెరగడానికి ఒక కారణం. ఇందువల్ల వేలాది యువజనులు నిర్వీర్యులై పోతున్నారు. [[ఎయిడ్స్]] వ్యాధి వ్యాప్తికి కూడా ఇది కారణమైనది. భారతదేశంలో ఎయిడ్స్ వ్యాధి ప్రబలంగా ఉన్నప్రాంతాలలో మణిపూర్ ఒకటి అయ్యింది.
 
=== జాతి వైషమ్యాలు ===
వివిధ జాతుల మధ్య ప్రబలుతున్న వైరుధ్యాలు మణిపురి సమాజానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నాయి. ఎన్నో తరాలుగా మెయితి జాతి ప్రజలు ఇరుగు పొరుగుతో సామరస్యంగా ఉంటూ వచ్చారు. కాని ఆర్ధిక అసమానతలూ, తరుగుతున్న వనరులు, పెరుగుతున్న పోటీ, జనాభాకు సరిపడా పెరగని ఉద్యోగావకాశాలూ వివిధజాతుల మధ్య వైషమ్యాలకు ఆస్కారమిస్తున్నాయి. [[హిందూ]] [[ముస్లిము]] విభేదాలతో ఈ వైషమ్యాలు ఆగటంలేదు. కొండలలోని తెగలకూ విస్తరించాయి. ముఖ్యజాతులైన [[నాగా జాతి|నాగా]], [[కుకీ జాతి|కుకీ]] తెగల మధ్య దారుణ మారణకాండలు ప్రజ్వరిల్లాయి.
 
=== సాయుధ వేర్పాటువాదం ===
అయితే [[సాయుధ వేర్పాటువాదం]] మణిపూర్‌లో అన్నింటికంటే తీవ్రమైన సమస్య. [[నేతాజీ సుభాష్‌చంద్ర బోస్]] నేతృత్వంలో [[భారత జాతీయ సేన]] (INA) [[త్రివర్ణ పతాకం]] మొదటిసారిగా ఎగురవేసిన భారతభూభాగమైన ఈ నేల ఇప్పుడు వేర్పాటువాదంతో కకావికలవుతున్నది. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ప్రారంభమైన ఈ వేర్పాటువాదం ఎన్నో వర్గాలు, జాతులతో విస్తరించింది. మణిపూర్ జీవనంలో పోరాటాలు, మరణాలు, ఆందోళనలు అనుదిన సంఘటనలైపోయాయి. నెలనెలా ఉగ్రవాదుల దళాలకు ధనం ముట్టజెప్పడం సర్వ సాధారణమైపోయింది.
 
* ZRV Zomi Revolutionary Volunteers
 
=== సరిహద్దు తగవులు ===
 
చాలాకాలంనుండి మణిపూర్‌కు మయన్మార్‌తో సరిహద్దువిషయంలో తగవులున్నవి. ఇంకా మణిపూర్, నాగాలాండ్‌ల మధ్య కూడా సరిహద్దు విభేదాలున్నాయి.
 
=== నివారణా చర్యలు ===
 
మణిపూర్ వాసుల అసంతృప్తిని పోగొట్టేందుకు కేంద్రప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చర్యలు తీసికొంది. 1992లో రాజ్యాంగం 71వ సవరణ ద్వారా [[మణిపురి భాష]]ను 8వ షెద్యూలులో చేర్చారు. ఇప్పుడు మణిపూర్‌కు స్వంత టెలివిజన్ స్టేషను ఉంది.
 
 
== అవీ-ఇవీ ==
* [[పోలో]] ఆట మణిపూర్‌లో మొదలయ్యింది. తరువాత బ్రిటిష్‌వారు ఆ ఆటను, కొంత మార్పులతో, ఇంగ్లాండులోను, ఆపై ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది.
 
* మణిపూర్‌కు లోక్‌సభలో 2 స్థానాలు, రాజ్యసభలో 1 స్థానం ఉన్నాయి.
 
== బయటి లింకులు ==
* [http://manipur.nic.in/ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటు]
* [http://manipurinfo.tripod.com/ మణిపూర్ కు సంబంధించిన వెబ్‌సైటు]
 
{{భారతదేశం}}
 
[[వర్గం:భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు]]
[[వర్గం:ఏడు సోదర రాష్ట్రాలు|మణిపూర్]]
[[gu:મણિપુર]]
[[he:מאניפור]]
[[hif:Manipur]]
[[hr:Manipur]]
[[hu:Manipur]]
20,585

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/564327" నుండి వెలికితీశారు