"పొదుపు" కూర్పుల మధ్య తేడాలు

72 bytes added ,  10 సంవత్సరాల క్రితం
చి
r2.5.2) (యంత్రము కలుపుతున్నది: my:ငွေကြေးစုဆောင်းခြင်း; cosmetic changes
చి (యంత్రము కలుపుతున్నది: eu:Aurrezki)
చి (r2.5.2) (యంత్రము కలుపుతున్నది: my:ငွေကြေးစုဆောင်းခြင်း; cosmetic changes)
సాధారణ వాడుకలో '''పొదుపు''' అంటే తమ ఆదాయంలో [[డబ్బు]]ను ఖర్చు పెట్టకుండా అట్టేపెట్టుకోవడం. ఉదాహరణకు బీరువాలో దాచుకోవడం, బ్యాంకు ఖాతాలో వేసుకోవడం వంటివి. <ref>"Random House Unabridged Dictionary." Random House, 2006</ref>. [[ఆర్ధిక శాస్త్రం]] పరిభాషలో [[ఆదాయం]]లో [[వినియోగం]] చేయగా మిగిలిందే పొదుపు. <!-- పొదుపులో రకాలు, పొదుపును నిర్ణయించే కారకాలు. పొదుపు సిద్ధాంతాలు, ఆర్థిక వ్యవస్థపై పొదుపు ప్రభావము తదితర అంశాలు కూడా --> మరింత విస్తృతమైన అర్ధంలో "పొదుపు" అంటే ఖర్చును తగ్గించుకోవడం. పెట్టుబడిలో నష్టభయం (రిస్క్) ఉంటుంది కనుక ధనాన్ని ఖర్చుపెట్టకుండా ఉంచుకోవడమే పొదుపుకు సరైన అర్ధం. వ్యావహారికంగా '''పొదుపు''' ఒక విధమైన ఆలోచనా విధానం, జీవన విధానం కూడాను. (ఉదాహరణకు - "పొదుపుగా బ్రతుకు గడపడం, దుబారాను వ్యతిరేకించడం" వంటి అర్ధాలలో)
 
 
== వ్యక్తిగతమైన పొదుపు ==
భవిష్యత్తు అవసరాల కొరకు ప్రస్తుత ఆదాయం నుంచి కొంత భాగం ఖర్చుచేయకుండా దాచిపెట్టడమే పొదుపు అయినప్పటికీ ద్రవ్యోల్బణం వలన దాని విలువ క్రమక్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి సాధారణంగా వడ్డీ లభించే డిపాజిట్ రూపంలో భవిష్యత్తు వినియోగాలకై బ్యాంకులలో నిల్వ చేస్తుంటారు. కొందరు వ్యక్తులు తమ ఆదాయంలో పెట్టుబడి పథకాలైన షేర్లు కొనడానికి డబ్బు వినియోగిస్తారు. కాని అందులో పెట్టుబడి నష్టభయం ఉంటుంది. నగగుగా పొదుపుచేయడానికి, షేర్లలో పెట్టుబడి రూపంలో పొదుపు చేయడానికి ఈ కారణమే వ్యక్తులను నిర్దేశిస్తుంది. తక్కువ ఆదాయం కలవారు నగదు రూపంలోనే పొదుపు చేస్తుంటారు. కాని ద్రవ్యోల్బణం సమయంలో వడ్డీరేటు కంటే ద్రవ్యోల్బణం రేటు అధికంగా ఉంటే వారి పొదుపు నికర విలువ తగ్గుతుంది లేదా బ్యాంకు సంక్షోభం వచ్చినప్పుడు కూడా వారు నష్టపోవలసి వస్తుంది. చాలా సంధర్బాలలో పొదుపు మరియు పెట్టుబడి పదాలను ఒకదానికొకటి ప్రత్యామ్నాయంగా వాడడానికి ఇలాంటి స్థితే కారణం. ఉదాహరణకు: చాలా డిపాజిట్ అక్కౌంట్లు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం చేయడానికి పెట్టుబడి అక్కౌంట్లుగా ఉపయోగపడుతున్నాయి. వ్యక్తులు చేసిన పొదుపు ఆర్థిక సంస్థల ద్వారా పెట్టుబడి రూపంలో ఆర్థికవ్యవస్థలో ప్రవేశిస్తుంది.
== ఒక్కరే చాలు లేదా అసలే వద్దు ==
ఓవైపు ఆర్థికమాంద్యం..మరోవైపు పెరుగుతున్న ధరలు...సంతానం విషయంలోనూ ‘పొదుపు’ పాటించేలా చేస్తున్నాయి. ఖర్చు తగ్గాలంటే ఒక్క సంతానం చాలని కొత్త దంపతులు భావిస్తున్నారు. పెళ్లైన కొత్తలోనే పిల్లలు కావాలనుకునే వారు సైతం మూడేళ్ల తర్వాత చూద్దాంలే అన్న అభిప్రాయానికి వచ్చేశారు.మరికొందరు ఖర్చులకు భయపడి అసలు పిల్లలే లేకున్నా ఫర్వాలేదన్నట్లుగా ఉన్నారు. పిల్లల ఆలన, పాలన కష్టమన్న భావనతో ఒక్కరితో సరి పెట్టుకుంటున్నారు.ఒకరికంటే ఎక్కువ పిల్లలు పుడితే వారి పెంపకం కష్టమవడంతో పాటు.. వారికోసం ఎక్కువ సెలవులు పెడితే జీతంలో కోత పడుతుందన్న భయంతో చాలామంది ముందుచూపుతో వ్యవహరి స్తున్నారు.ఆర్థికమాంద్యం, ఉద్యోగాల్లో కోత, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఇంటి అద్దెల మోత, స్కూలు ఫీజులు ఇతర కారణాలు ప్రతి ఒక్కరి జీవితంపైనా ప్రభావం చూపుతున్నాయి.సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు పోయి అప్పుల బాధపడలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘ టనలూ ఇటీవలికాలంలో పెరుగుతున్నాయి.ఒక సంతానం ఉంటేనే భారంగా ఇల్లు గడుస్తున్న తరుణంలో రెండో సంతానం వద్దంటే వద్దన్న భావనతో చాలామంది ఉన్నారు. కుటుంబ నియంత్రణపై ప్రజల్లో చైతన్యం వస్తోంది.గతంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు కావాలనుకునేవారు సైతం ప్రస్తుతం ఆడైనా, మగైనా ఒక్కరు చాలన్న భావనకు వచ్చేశారు. చిన్నకుటుంబం నినాదం గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తోంది.బాలికల సంఖ్య తగ్గుముఖం పడుతోందని గగ్గోలు పెడుతున్నా స్ర్తీలు సైతం మగపిల్లలే కావాలని కోరుకుంటున్నారు. సమాజంలో మహిళలపై పెరుగుతున్న, జరుగుతున్న దారుణాల నేపథ్యంలో చాలామంది తమకు ఆడపిల్లలు వద్దని స్పష్టంగా చెబుతున్నారు. ఆడ శిశువు అని తెలిసిన క్షణాల్లోనే తమకు అబార్షన్‌ చేయమని వైద్యులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.అద్దె ఎక్కువ చెల్లిస్తేనే ఇళ్లు దొరికే పరిస్థితి ఉంది. దీంతో ఎక్కువ సంతానం ఉంటే ఖర్చులు పెరుగుతాయన్న ఆలోచనతో ఒకరితో సరిపెట్టుకుంటున్నారు.http://www.suryaa.com/showStateNews.asp?ContentId=14953
 
వాస్తవ వడ్డీరేటు అనగా పన్ను మినహాయింపులు మరియు ద్రవ్యోల్బణ రేటు తగ్గింపులు. కొన్ని సందర్భాలలో వాస్తవ వడ్డీరేటు శూన్యం కంటే తక్కువ ఉండవచ్చు దాన్నే ద్రవ్యోల్బణ నష్ట ప్రభావంగా పేర్కొనవచ్చు.
 
== పొదుపును నిర్ణయించే కారకాలు ==
అర్థశాస్త్రం ప్రకారం పొదుపును నిర్ణయించే కారకాలను క్రిందివిధంగా విభజించవచ్చు:
;ఆదాయం:
ఆర్థిక వ్యవస్థలో పొదుపు అవసరమైనప్పుడు ప్రభుత్వం పొదుపునకు ప్రాత్సాహం కల్పించడానికి వడ్డీరేట్లను పెంచుతుంది. ఇవి సాధారణంగా ద్రవ్యోల్బణ సమయంలో ప్రభుత్వాలు తీసుకొనే సాధారణ చర్యలు. ప్రభుత్వాలు కల్పించే అనేక సబ్సిడీ పథకాలు కూడా వ్యక్తుల వినియోగ ఖర్చులను తగ్గించి పొదుపును పెంచుతాయి.
 
== పొదుపు వైపరీత్యం ==
సాధారణంగా పొదుపు ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది. పొదుపు వలన పెట్టుబడి పెరుగుతుంది. పెట్టుబడి పెరగడం వలన పరిశ్రమలు అధికంగా స్థాపించబడి కార్మికులను ఉపాధి అవకాశాలు అధికమౌతాయి. కాని ఇవి నాణేనికి ఒకవైపు మాత్రమే. స్వల్పకాలంలో పొదుపు లాభకరమైనప్పటికీ దీర్ఘకాలికంగా చూస్తే అర్థిక వ్యవస్థకు పొదుపు ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. దీర్ఘకాలంలో అధిక పొదుపు వలన వస్తుసేవల యొక్క డిమాండు పడిపోయి సంస్థలు ఉత్పత్తి తగ్గించే దశ రావచ్చు. అదే జరిగితే పరిశ్రమలలో కార్మికుల సంఖ్య తగ్గి నిరుద్యోగాలు పెరగవచ్చు. స్థూలంగా ఆర్థిక వ్యవస్థ సంక్ష్యోభంలోకి కూరుకుపోతుంది. దీన్నేఆర్థికవేత్తలు పొదుపు వైపరీత్యంగా పిలుస్తారు.
 
దీన్ని మరోరకంగా చెప్పవచ్చు. ఒకరి ఖర్చు మరొకరి ఆదాయం. ఒక వ్యక్తి పొదుపు చేస్తునాడంటే వినిమయం ఆ మేరకు తగ్గించినట్లే. వినిమయం తగ్గడం వలన ఇతరుల ఆదాయం కూడా తగ్గినట్లు. కాబట్టి పొదుపు అనేది ఒక వ్యక్తి దృష్ట్యా చూస్తే ప్రయోజనకరమేమో కాని ఆర్థిక వ్యవస్థ మొత్తం దృష్ట్యా చూస్తే నష్టమే అధికం. అంతేకాకుండా ఒక వ్యక్తి ఖర్చు ఇతరులకు ఎన్నో రెట్ల ఆదాయాన్ని కల్పిస్తుంది. ఆర్థిక పరిభాషలో ఇది వినిమయ గుణకంగా పిలువబడుతుంది. ఉదాహరణకు A వ్యక్తి ఖర్చు B వ్యక్తికి ఆదాయం, B తనకు ఆదాయంగా లభించిన మొత్తంలో నుంచి ఖర్చు చేస్తే C వ్యక్తికి ఆదాయంగా లభిస్తుంది. ఇలా వినిమయం చేసిన డబ్బు గుణకం రూపంలో అనేకులకు ఆదాయంగా వస్తుంది. పొదుపు చేయడం వలన ఆ మేరకు డబ్బు ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడదు.
 
== ఇవి కూడా చూడండి ==
* [[పెట్టుబడి]]
 
[[it:Risparmio]]
[[ja:節約]]
[[my:ငွေကြေးစုဆောင်းခြင်း]]
[[nl:Sparen]]
[[pt:Poupança]]
21,068

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/565003" నుండి వెలికితీశారు