జోసెఫ్ డాల్టన్ హుకర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 32:
జార్జి బెంథామ్ (George Bentham) మరియు జోసెఫ్ డాల్టన్ హుకర్ (Joseph Dalton Hooker) లు ఇంగ్లండ్ దేశానికి చెందిన వర్గీకరణ శాస్త్రవేత్తలు. వీరు సంయుక్తంగా [[పుష్పించే మొక్క]]లకు ఒక సహజ వర్గీకరణ విధానాన్ని 1862-1983 సంవత్సరాలలో తమ 'జెనీరా ప్లాంటారమ్' (Genera plantarum) అనే లాటిన్ గ్రంధంలో వివరించారు. అన్ని జాతులు మార్పు చెందకుండా స్థిరమైన లక్షణాలతో ఉంటాయనే నమ్మకంపై (Doctrine of constancy of species) ఆధారపడి తమ వర్గీకరణను ప్రతిపాదించారు.
హుకర్ సఫోక్ లో ప్రముఖ వృక్ష శాస్త్రజ్ఞుడైన సర్ [[విలియం జాక్సన్ హుకర్]] (Sir William Jackson Hooker) కు రెండవ కుమారునిగా జన్మించాడు. చిన్ననాటి నుండి గ్లాస్గో విశ్వవిద్యాలయంలో తండ్రి యొక్క ఉపన్యాసాలను విని మొక్కల మీద మరియు [[జేమ్స్ కుక్]] జరిపిన సముద్ర యాత్రల మీద అభిరుచి పెంచుకున్నాడు.<ref name ="ODB">Endersby, J. 2004. Hooker, Sir Joseph Dalton (1817–1911). ''Oxford Dictionary of National Biography'', Oxford University Press</ref> తర్వాత గ్లాస్గో విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను 1939లో పూర్తిచేశాడు. అనంతరం నావల్ మెడికల్ సర్వీసు ఉద్యోగంలో చేరి ప్రముఖ సముద్ర యాత్రికుడైన [[జేమ్స్ క్లార్క్ రాస్]] (James Clark Ross) తో అంటార్కిటికా లోని అయస్కాంత దక్షిణ ధృవానికి ప్రయాణమయ్యాడు.
పంక్తి 47:
* Joseph Symonds Hooker (1877–1940)
* Richard Symonds Hooker (1885–1950).
హుకర్ 10 డిసెంబరు 1911 తేదీన స్వగృహంలో అర్ధరాత్రి నిద్రలోనే మరణించాడు. అతని వీలునామా ప్రకారం ఇతన్ని సెంట్ అన్నె చర్చి ఆవరణలో తండ్రి ప్రక్కనే పూడ్చబడ్డాడు.
==బిబ్లియోగ్రఫీ==
|