బెంథామ్-హుకర్ వర్గీకరణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
*పరిపత్రాల స్వభావాన్ని బట్టి ద్విదళ బీజాలలో [[పాలీపెటాలే]] (Polypetalae), [[గామోపెటాలే]] (Gamopetalae), [[మోనోక్లామిడే]] (Monochlamydae) అనే మూడు తరగతులను గుర్తించారు.
*పాలీపెటాలే లోని పరిపత్రాలు రెండు వలయాలలో ఉండి [[ఆకర్షణ పత్రాలు]] అసంయుక్తంగా ఉంటాయి. మొక్కలను అండాశయ స్వభావాన్ని బట్టి మరల మూడు శ్రేణులను గుర్తించారు. అవి థలామిఫ్లోరే (Thalamiflorae), డిస్కిఫ్లోరే (Disciflorae) మరియు కాలిసిఫ్లోరే (Calyciflorae).
**థలామిఫ్లోరే శ్రేణికి చెందిన మొక్కలలో అండకోశాధస్థిత పుష్పాలు ఉంటాయి. దీనిలో 6 క్రమాలను (Orders), 34 కుటుంబాలను (Families) ఉంచారు. దీనిలో మొదటి క్రమం రానేలిస్ (Ranales) గాను, చివరి క్రమం [[మాల్వేలిస్]] (Malvales) గా వర్ణించారు.
**డిస్కిఫ్లోరే శ్రేణిలో అండకోశాధస్థిత పుష్పాలు ఉంటాయి. ఈ పుష్పాలలో అండాశయము క్రింద వర్తులాకారపు లేదా పీలికలుగా తెగిన మకరంద గ్రంధి (Disc) ఉంటుమ్ది. ఈ శ్రేణిలో 4 క్రమాలను, 24 కుటుంబాలను చేర్చారు. మొదటి క్రమం జిరానియేలిస్, చివరి క్రమం సాపిండేలిస్ గా వర్ణించారు.
**కాలిసిఫ్లోరే శ్రేణిలో పర్యండకోశ (Perigynous) పుష్పాలు లేదా అండకోశోపరిక (Epigynous) పుష్పాలు ఉంటాయి. ఈ శ్రేణిలో 5 క్రమాలను, 27 కుటుంబలను చేర్చారు. ఇవి రోజేలిస్ (Rosales) క్రమంతో ప్రారంభమై, అంబెల్లేలిస్ (Umbellales) తో అంతమవుతుంది.