ఎడారి మొక్కలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: nn:Xerofyttar
చి r2.5.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: simple:Xerophyte; cosmetic changes
పంక్తి 1:
'''ఎడారి మొక్కలు''' (Xerophytes) [[నీరు]] లోపించిన జలాభావ పరిస్థితులు లేదా క్రియాత్మకంగా పొడిగా ఉండే మృత్తికలో పెరిగే [[మొక్కలు]].
 
== వర్గీకరణ ==
=== అల్పకాలిక మొక్కలు ===
అల్పకాలిక మొక్కలు (Ephemeral plants) జలాభావాన్ని తప్పించుకొనే మొక్కలు. ఇవి శుష్క ప్రాంతాలలో పెరుగుతాయి. ఈ మొక్కలు 6-8 వారాలలో జీవిత చరిత్రను ముగించుకొనే ఏకవార్షికాలు. ఉదా: [[ట్రిబ్యులస్]].
 
=== రసభరితమైన మొక్కలు ===
రసభరితమైన మొక్కలు (Succulent plants) జలాభావాన్ని నివారించే మొక్కలు. ఇవి వర్షాకాలంలో చాలా నీటిని శోషించి, ఈ నీటిని జిగురు పదార్ధం (మ్యుసిలేజ్) రూపంలో మొక్క భాగాలలో నిలువచేస్తాయి. దీని ఫలితంగా వీటి కాండం, పత్రాలు, వేళ్ళు కండయుతంగా, రసభరితంగా ఉంటాయి. ఈ విధంగా నిలువచేసిన నీటిని, నీరు దొరకని సమయంలో చాలా పొదుపుగా వినియోగిస్తాయి.
* రసభరిత కాండాలు గల మొక్కలు : [[ఒపన్షియా]], [[యుఫర్బియా తిరుకల్లై]]
పంక్తి 11:
* రసభరిత వేళ్ళు గల మొక్కలు : [[ఆస్పరాగస్]], [[సీబా పార్విఫ్లోరా]]
 
=== రసభరితం కాని మొక్కలు ===
రసభరితం కాని మొక్కలు (Non-succulent plants)
ఇవి నిజమైన ఎడారి మొక్కలు. ఇవి దీర్ఘకాలిక జలాభావ పరిస్థితులను తట్టుకోగల, బహువార్షిక మొక్కలు. ఉదా: [[కాజురైనా]], [[నీరియమ్]], [[జిజిఫస్]], [[కెలోట్రోపిస్]].
 
== ఎడారిమొక్కలలో అనుకూలనాలు ==
=== బాహ్యస్వరూప లక్షణాలు ===
* '''వేళ్ళు''' బాగా విస్తరించి కొన్ని మొక్కలలో కాండం కంటే ఎక్కువ రెట్లు పొడవుగా ఉంటాయి. మూలకేశాలు, వేరు తొడుగులు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
* '''కాండాలు''' చాలా వరకు పొట్టిగా, దృఢంగా, చేవదేరి, మందమైన బెరడుతో కప్పబడి ఉంటాయి. కొన్ని మొక్కలలో కాండం భూగర్భంగా ఉంటుంది. కాని ఒపన్షియా, యుఫర్బియా లలో రసభరితంగా హరితం కలిగి ఉంటాయి. కాండాలు సాధారణంగా కేశాలు, జిగురు పొరచే కప్పబడి ఉంటాయి.
* '''పత్రాలు''' బాగా క్షీణించి, పరిమాణంలో చిన్నవిగా, పొలుసాకులవలె కొద్దికాలం మాత్రమే ఉంటాయి. కొన్ని సార్లు కంటకాలుగా రూపాంతరం చెందుతాయి. పత్రదళం సన్నగా, పొడవుగా, సూదులవలె గాని లేదా అకేసియాలో అనేక పత్రకాలుగా చీలిగాని ఉంటుంది. సాధారణ హరితపత్రాలుంటే, అవి మందంగా, రసభరితంగా లేదా గట్టిగా చర్మంలాగా ఉంటాయి. ఉదా: అలో. పత్ర ఉపరితలం మెరుస్తూ, సన్నగా ఉండి, కాంతిని, వేడిని పరావర్తనం చెందిస్తాయి. ఉదా: కెలోట్రోపిస్. అమ్మోఫిలా వంటి ఏకదళబీజ మొక్కలలో పత్రాలు మడతబడి, చుట్టుకొని ఉంటాయి. తద్వారా పత్రరంధ్రాలు దాగిఉండి భాష్పోత్సేకాన్ని తగ్గిస్తాయి. యుఫోర్బియా, జిజిపస్ జుజుబా వంటి మొక్కలలో పత్రపుచ్ఛాలు కంటకాలుగా రూపాంతరం చెంది ఉంటాయి.
 
=== అంతర్నిర్మాణ లక్షణాలు ===
* '''వేళ్ళు''' సాధారణంగా బాగా అభివృద్ధి చెందిన దారువు, పోషక కణజాలాలను కల్గి ఉంటాయి. ఆస్పరాగస్ వంటి నిల్వచేసే వేళ్ళలో వల్కలం పెద్దదిగా ఉండి, వాటి కణాలు పరిమాణంలో పెరిగి నీటితో నిండి ఉంటాయి. కెలోట్రోపిస్‌లో వేళ్ళు గట్టిగా, మందమైన కుడ్యాలను కలిగి ఉంటాయి.
* '''కాండాలు''' రసభరిత మొక్కలలో నీటిని నిల్వచేసే ప్రాంతాలను కలిగి ఉంటాయి. రసభరితంకాని మొక్కలలో చాలా మందమైన అవభాసిని ఉంటుంది. బాహ్యచర్మం చాలా మందమైన కణ కవచాలను కలిగి ఉంటుంది. దివబడిన పత్రరంధ్రాలు ఉంటాయి. బాగా అభివృద్ధి చెందిన, విభేదన చూపే నాళికా కణజాలం ఉంటుంది. మందమైన లిగ్నిన్‌తో ఏర్పడి ఉంటాయి. బాగా అభివృద్ధి చెందిన అనేక పొరలతో ఏర్పడిన నాళికా పుంజపు ఒరలు ఉంటాయి. యాంత్రిక కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
* '''పత్రాలు''' పెపెరోమియా వంటి రసభరిత మొక్కలలో పత్ర బాహ్యచర్మ కణాలు నీటిని నిలువచేస్తాయి. అలో నందు పత్రాంతర కణాలు నీటిని నులువచేసే ప్రాంతాలను కలిగిఉంటాయి. రసభరితంకాని మొక్కలలో అభివృద్ధిచెందిన మందమైన అవభాసిని ఉంటుంది. నీరియంలో బహుళ బాహ్యచర్మం, పైనస్ లో దృఢకణజాల నిర్మిత, బహుశ్రేణియుత అధఃశ్చర్మం ఉంటాయి. దిగబడిన పత్రరంధ్రాలు అధో బాహ్యచర్మానికిపరిమితమై ఉంటాయి. నాళికా కణజాలాలు బాగా అభివృద్ధి చెంది దారువు, పోషక కణజాలాలుగా విభేదనం చెంది ఉంటాయి.
 
 
[[వర్గం:మొక్కలు]]
Line 49 ⟶ 48:
[[pt:Xerófito]]
[[ru:Ксерофиты]]
[[simple:XerophyticXerophyte]]
[[sv:Xerofyt]]
[[uk:Ксерофіти]]
"https://te.wikipedia.org/wiki/ఎడారి_మొక్కలు" నుండి వెలికితీశారు