చక్రవర్తి రాజగోపాలాచారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
==భారత స్వాతంత్ర్యోదమం==
రాజకీయాల్లో రాజాజీ ప్రస్థానం సేలం పట్టణానికి ప్రతినిథిగాప్రతినిధిగా ఎన్నికవడంతో ప్రారంభమైంది. 1900 మొదటి దశాబ్దంలో ప్రముఖ జాతీయవాది [[బాలగంగాధర తిలక్]] పట్ల ఆకర్షితుడయ్యాడు. 1917 లో సేలం పట్టణ మునిసిపాలిటీకి చైర్మన్ గా ఎన్నికయ్యాడు<ref name="pillarsp88">{{cite book|title=Pillars of Modern India, 1757-1947|first=Syed Jafar|last=Mahmud|page=88|year=1994|publisher=APH Publishing|isbn=8170245869, ISBN 9788170245865}}</ref>. సేలం ప్రభుత్వంలో మొట్టమొదటి దళిత ప్రతినిథిప్రతినిధి కూడా ఆయన చొరవతోనే ఎన్నికయ్యాడు. తరువాత ఆయన [[భారత జాతీయ కాంగ్రెస్]] లో చేరి స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం ప్రారంభించాడు. 1908 లో వరదరాజులు నాయుడు అనే స్వాతంత్ర్య పోరాట యోధుడి తరపున ప్రభుత్వ ధిక్కారం కేసుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో వాదించాడు. 1919లో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాడు. ప్రముఖ జాతీయవాది వీఓ చిదంబరం పిళ్ళై ఈయనకు మంచి స్నేహితుడు. [[అనీబిసెంట్]] కూడా రాజాజీని అభిమానించేది.
 
1919 లో [[మహాత్మా గాంధీ]] స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించినపుడు రాజాజీ కూడా ఆయన్ను అనుసరించాడు. [[సహాయ నిరాకణోద్యమం]]లో పాల్గొన్నాడు. న్యాయవాదిగా ప్రాక్టీసు కూడా మానేశాడు. 1921 లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికయ్యాడు. ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా కూడా వ్యవహరించాడు.<ref name="pillarsp88" />