"వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 51వ వారం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
[[దస్త్రం:Hanuman's visit to Lanka.jpg|center|200px]]
'''సుందరకాండ''' [[రామాయణం]]లో ఐదవ కాండ. సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు. సుందర కాండలో 68 సర్గలు ఉన్నాయి. [[హనుమంతుడు]] సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట ఇందులో ముఖ్యాంశాలు. [[వాల్మీకి]] మహర్షి అన్ని కాండలకు ఆ యాఆయా కధా భాగానికి సంబధించిన పేర్లు పెట్టాడు కాని సుందరకాండకు "సుందరకాండ" అని పేరు పెట్టడానికి గలపెట్టడానికిగల కారణాలను పండితులు చాలా రకములైన వివరణలు, వ్యాఖ్యానాలు ద్వారా చెబుతారు. అన్ని కాండలలో రాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడు గాకథానాయకుడుగా ఉంటాడు. కాని సుందరకాండ లోసుందరకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం ముమ్మార్లుముమ్మారు స్మరించబడుతుంది. శ్రీరాముడుశ్రీరాముడి పాత్ర ప్రత్యక్షంగా కనిపించక పోయినాకనిపించకపోయినా నామం మాత్రం ఉపాసన చేయబడుతుంది లేదా జపింపబడుతుంది.
 
రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది. సుందరకాండ పారాయణం చేస్తే కష్టాలు తీరుతాయనీ, తలపెట్టిన కార్యం విజయవంతమౌతుందనీ బహుధా విశ్వాసం ఉంది. బ్రహ్మాండపురాణం ఈ కాండమును "సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః" అని, "బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి" అని, "అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి, న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్" అని ప్రశంసించింది. అనగా ఇది రామాయణమునకు బీజకాండము. అసమానమైన మంత్రము. దీని పారాయణమున లభించని సిద్ధి మరొక విధముగా లభించదని బ్రహ్మ శాసనము. అదే బ్రహ్మాండ పురాణము రామాయణములోని ఒక్కొక్క కాండము పారాయణమునకు ఒక్కొక్క ఫలసిద్ధిని పేర్కొంటూ సుందరకాండను గురించి '''"చంద్రబింబ సమాకారం వాంఛితార్ధ ప్రదాయకం, హనూమత్సేవితం ధ్యాయేత్ సుందరే కాండ ఉత్తమమ్"''' అని పేర్కొన్నది. సుందరకాండ పారాయణా విధానం, ఒక్కొక్క భాగానికి లభించే ఫలసిద్ధి గురించి పెక్కు విశ్వాసాలు, ఆధ్యాత్మ గ్రంధాలు ఉన్నాయి. రామాయణానికి ఇది బీజకాండము. మంత్ర సంయుక్తము. దీనిలో గుప్తముగా హనుమంతుని కుండలినీ యోగసాధన నిక్షిప్తమై ఉన్నది.
 
వ్యాధులు, కారాగృహ బంధనములు, గ్రహపీడలు, అనపత్యతలు, దారిద్ర్యములోనైన సంకటములన్నియను సుందరకాండ పారాయణము వలన తొలగుటయే గాక భక్తి ముక్తులునుభక్తిముక్తులును కలుగును. అర్ధ పంచక జ్ఞానము ఆచార్యుల వలననే కలుగునని హనుమంతుని చర్య వలన బోధింపబడినది. [[ద్వయ మంత్రము]]లోని రహస్యములు ఇందులో వివరింపబడినవి. గాయత్రీ మంత్రములోని "దేవ" శబ్దార్ధము ఇందు శ్రీరామ దివ్య మంగళ విగ్రహదివ్యమంగళవిగ్రహ వర్ణనచే వర్ణింపబడినది. సంసారసంసారసాగర సాగర తరణము కోరుతరణముకోరు యోగులకు తగిన అభ్యాస విధిఅభ్యాసవిధి ఇందలి హనుమంతుని చర్యల వలన తెలియుచున్నవితెలియుచున్నది.
 
''ఇంకా''....[[సుందర కాండ|పూర్తివ్యాసం]] [[వికీపీడియా:విశేష వ్యాసాలు|పాతవి]]<noinclude>[[వర్గం:ఈ వారపు వ్యాసాలు 2010]]</noinclude>
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/568931" నుండి వెలికితీశారు