బెజవాడ రాజారత్నం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Mukteshvari (చర్చ | రచనలు) |
+బొమ్మ |
||
పంక్తి 1:
[[దస్త్రం:Bezawada Rajaratnam.jpg|right|thumb|బెజవాడ రాజారత్నం]]
'''బెజవాడ రాజారత్నం''' [[తెలుగు సినిమా]] నటి మరియు తొలి నేపథ్యగాయని . బెజవాడ రాజారత్నం [[1921]] సంవత్సరంలో [[తెనాలి]] పట్టణంలో జన్మించారు. ఈమె పాటలు పాడటమే కాకుండా పలు చిత్రాలల్లో కూడా నటించారు. సంగీతాన్ని తెనాలి సరస్వతి మరియు జొన్నవిత్తుల శేషగిరిరావు గారి వద్ద నేర్చుకొన్నారు. తరువాత [[లంకా కామేశ్వరరావు]]తో కలసి పాడిన పాటలు రికార్డులుగా విడుదలయి గాయనిగా మంచి పేరు తీసుకు వచ్చాయి. రుక్మిణీ కల్యాణం, పుండరీక, రాధా కృష్ణ, మీరా వంటి నాటకాలలో నటించటమే కాక సంగీతం అందించటంలో సహాయం చేశారు. అప్పట్లో రాజరత్నం పేరుతో ఇద్దరు నటీమణులుండేవారు. ఎవరెవరని గందరగోళం రాకుండా, వాళ్లిద్దరూ వాళ్ల వూరి పేర్లు తగిలించుకున్నారు. ఒకరు బెజవాడ రాజరత్నం. ఇంకొకరు కాకినాడ రాజరత్నం. వీరిలో కాకినాడ రాజరత్నం ప్రౌఢ పాత్రలు వేస్తే, బెజవాడ రాజరత్నం యుక్త పాత్రలు ధరించేవారు. బెజవాడామె గాయని, కాకినాడామె కాదు.
|