తెలుగు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 97:
;ప్రధాన వ్యాసము '''[[తెలుగు లిపి]]'''<br />
 
తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన [[బ్రాహ్మీ లిపి]]నుండి ఉద్భవించింది. [[అశోకుడు|అశోకుని]] కాలములో [[మౌర్య సామ్రాజ్యము|మౌర్య సామ్రాజ్యానికి]] సామంతులుగా ఉన్న [[శాతవాహనులు]] బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు [[మూల ద్రావిడ భాష]]నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన [[భట్టిప్రోలు లిపి]] నుంచి తెలుగు లిపి ఉద్భవించింది<ref>The Dravidian Languages, Bhadriraju Krishnamurti, 2003, Cambridge University Press, pp.78-79, ISBN 0-521-77111-0</ref>.

తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలనే కనిపిస్తుంది.
 
[[దస్త్రం:Telugulipi evolution.jpg|thumb|center|700px|తెలుగు లిపి పరిణామము మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా]]
"https://te.wikipedia.org/wiki/తెలుగు" నుండి వెలికితీశారు