ఒమన్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: ckb:عومان
చి r2.5.2) (యంత్రము కలుపుతున్నది: ss:IMani; cosmetic changes
పంక్తి 84:
 
== చరిత్ర ==
[[ఫైలుదస్త్రం:Oman 1996 CIA map.jpg|right|200px|thumb|ఒమన్]]
ఒకప్పుడు ఒమన్ సుమేరియన్ భాషాపదమైన '''మాగన్''' అనే పేరుతో పిలువబడేది. తూర్పు [[పర్షియా]] సామ్రాజ్యంలో ఒక అనుబంధ రాజ్యంగా ఇది ఉండేది. సుమారు క్రీ.పూ.563లో ఈ ప్రాంతం పర్షియా సామ్రాజ్యంలో కలుపబడింది. తదనంతరం క్రీ.శ. 3వ శతాబ్దంనుండి [[సస్సానియన్ సామ్రాజ్యం]]లో భాగంగా ఉంది. క్రీ.శ. 1వ శతాబ్దంనుండి [[అరబ్బులు]] ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. క్రీ.శ.632లో సస్సానిడ్‌లు అధికారం కోల్పోయారు. అప్పటినుండి ఒమన్ అరబ్బుల అధీనంలో ఉంది.
 
పంక్తి 108:
 
== పాలనా విభాగాలు ==
[[ఫైలుదస్త్రం:Oman subdivisions-te.png|right|200px|thumb|ఒమన్‌లో వివిధ ప్రాంతాలను చూపే పటం. (స్కేలు ప్రకారం లేదు)]]
పాలనాపరంగాను, కొంతవరకు భౌగోళికంగాను ఒమన్ను 5 ప్రాంతాలు ("మింతకా"లు) గాను, మూడు గవర్నరేట్‌లు గాను విభజించారు. ఒక్కో ప్రాంతం మరికొన్ని "విలాయత్"లు (జిల్లాల వంటివి)గా విభజింపబడింది.
=== గవర్నరేట్‌లు ===
==== [[మస్కట్]] ====
దేశ రాజధాని నగరము, దాని చుట్టుప్రక్క ప్రాంతాలు కలిపి మస్కట్ గవర్నరేట్. ఇందులో ఉన్న జిల్లాలు:
[[ఫైలుదస్త్రం:Oman Muscat Muttrah.jpg|thumb|right|200px|ముత్రా ఓడరేవు]]
* '''మస్కట్-ముత్రా''': మస్కాట్-ముత్రా ప్రాంతము చాలాకాలంనుండి రాజ్యపాలనా కేంద్రము. రాజనివాసము. పాత బస్తీ అంటారు. ఇప్పటికీ దివాన్, తదితర ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి. నౌకాశ్రయం కూడా ముత్రాలో ఉంది. మస్కట్ ఒక దుర్బేద్యమైన కోటలాంటి బస్తీ. అన్నిప్రక్కలా కొండలతో సురక్షితమై ఉంటుంది. ఒకటే గేటు.
* '''రువి''': రువి, వాడి-కబీర్‌లు ప్రధానమైన వ్యాపార కేంద్రాలు. వాడి కబీర్‌లో వర్క్ షాపులు ఎక్కువ ఉన్నాయి.
పంక్తి 125:
 
ధోఫార్ ప్రాంతం గురించి చెప్పుకోదగిన మరొక ముఖ్యమైన విషయం 'సాంబ్రాణి చెట్టు' - దీనిని ఆంగ్లంలో Frankincense tree అంటారు. ఇవి ధోఫార్ ఉత్తరాన 'జబల్ అల్‌కరా' అనే పీఠభూమిలో పెరుగుతాయి. తుమ్మచెట్టు లాగానే ఉండే ఈ చెట్టు కాండంనుండి కారే జిగురును 'సాంబ్రాణి' అంటారు. సాంబ్రాణి ఉత్పత్తిలో ఒమన్ ప్రపంచంలోనే ఒక ప్రధాన కేంద్రం.
[[ఫైలుదస్త్రం:Oman Dhofar Frankincense.jpg|200px|thumb|right| ధోఫార్ ప్రాంతంలో సాంబ్రాణి చెట్టు]]
ధోఫార్ గవర్నరేట్‌లో జిల్లాలు.
* సలాలా
పంక్తి 153:
==== [[అద్ దఖలియా]] ====
"దఖిలియా" అంటే లోపలి ప్రాంతము అని అర్ధం. ఇది ఎక్కువగా పర్వతమయమైన ప్రాంతము. ఇక్కడి ప్రదేశాలలో [[నిజ్వా]] ముఖ్యమైన పట్టణము. ఒకప్పుడు ఒమన్ దేశానికి నిజ్వా రాజధానిగా ఉండేది. ఈ ప్రాంతం రకరకాలైన ఖర్జూరాల పంటకు ప్రసిద్ధం.
[[ఫైలుదస్త్రం:Waadi_near_BidBid-Oman.JPG|thumb|200px|right|బిద్ బిద్ దగ్గర 'వాడి'. దూరంగా ఖర్జూరం చెట్లు]]
దఖిలియాలోని విలాయత్‌లు
* నిజ్వా
పంక్తి 316:
 
== సంస్కృతి ==
[[ఫైలుదస్త్రం:Oman-khanjar.jpg|thumb|200px|right|ఒమన్ ఖంజర్. చురకత్తి లాంటి దీనిని నడుము పటకాలో ధరిస్తారు.]]
ఒమన్ సంస్కృతిలో ప్రధానంగా కనిపించే అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
 
పంక్తి 327:
 
== ఆర్ధిక రంగం ==
[[ఫైలుదస్త్రం:Nakhalfarms.jpg|thumb|right|250px| నఖల్ కోటనుండి కనిపించే ఖర్జూరం తోటలు.]]
ఒమన్ ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా పెట్రోలియమ్ ఉత్పత్తులపై ఆధారపడింది. అయితే చారిత్రకంగా ఒమన్ ఆర్ధిక వ్యవస్థలో ప్రధాన అంశాలైన చేపలు పట్టడం, ఖర్జూర సాగు, వ్యాపారం, గొర్రెలు, ఒంటెల పెంపకం వంటివాటిని ప్రజలు ఏ మాత్రం విడనాడలేదు. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ ఈ వృత్తులను నిర్వహిస్తున్నారు. అయితే పెట్రోలియమ్ పరిశ్రమ ఇతోధికంగా వృద్ధి చెందడం వలన గ్రామీణ ఉత్పత్తుల శాతం బాగా తగ్గింది.
 
పంక్తి 335:
 
== ఫలాజ్, ఆఫ్లాజ్, వాడి ==
[[ఫైలుదస్త్రం:Wadi Shab (13).jpg|thumb|200px|left|వాడి షాబ్]]
ఒమన్ నీటివనరులలో ''ఫలాజ్'', ''వాడి'' అనేవి ముఖ్యమైన పదాలు. (బురేమీ తప్పించి మిగిలిన ప్రాంతాలలో ఒయాసిస్‌లు లేవు). పరిమితమైన నీటి వనరులున్నందున నీటిని జాగ్రత్తగా వాడుకోవలసిన అవుసరాన్ని ఒమని జనులు పూర్వంనుండి గుర్తించారు. అక్కడక్కడా ఉన్న నీటి వూటలను సన్నని కాలువలతో చిలవలు పలవలుగా జనావాస ప్రాంతాలకూ, సంబంధిత వ్యవసాయ క్షేత్రాలకూ మళ్ళిస్తారు. ఇలాంటి ఒక పిల్లకాలువను 'ఫలాజ్' అంటారు. ఈ పదానికి బహువచనం 'అఫ్లాజ్'.
 
పంక్తి 491:
[[sq:Omani]]
[[sr:Оман]]
[[ss:IMani]]
[[sv:Oman]]
[[sw:Omani]]
"https://te.wikipedia.org/wiki/ఒమన్" నుండి వెలికితీశారు