"ఘంటసాల వెంకటేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

[[1944]] [[మార్చి 4]]న ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్ళిచేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం తనపెళ్ళికి తానే కచేరీచేసి అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తాడు. కొన్నాళ్ళకు దగ్గరివూరికి [[సముద్రాల రాఘవాచార్యులు]] వచ్చినపుడు ఆయనను కలిసాడు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను [[మద్రాసు]]కు వచ్చి కలుసుకోమన్నాడు. ఘంటసాల రెండునెలలు కష్టపడి కచేరీలుచేసి, కొంత అప్పుచేసి మద్రాసు వెళ్ళాడు. సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిలింస్ కు తీసుకెళ్ళి [[చిత్తూరు నాగయ్య]], [[బి.ఎన్.రెడ్డి]]ల ముందు పాటకచేరీ చేయించాడు. వారిరువురు ఘంటసాల పాటవిని అవకాశాలు ఉన్నపుడు ఇస్తామన్నారు.
 
సముద్రాలవారి ఇల్లు చాలాచిన్నది కావడంతో ఆయనకు ఇబ్బంది కలిగించడం ఇష్టంలేక ఘంటసాల తనమకాంను పానగల్ పార్కు వాచ్‌మన్‌కు నెలకు రెండురూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశలకోసంఅవకాశాలకోసం వెతికి రాత్రిరాత్రికి ఆపార్కులోపార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల అప్పటి మద్రాసు రేడియో కేంద్రంలో లలితగీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించాడు. ఇలాపాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసేవాడు. మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీరంగ ప్రముఖుల గుర్తింపుపొందాడు. ఘంటసాలచేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే [[చిత్తూరు నాగయ్య]], [[బి.ఎన్.రెడ్డి]]లు తమ సినిమా అయిన [[స్వర్గసీమ]] లో మొదటిసారి నేపథ్యగాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. [[భానుమతి]] పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే [[భానుమతి]], [[నాగయ్య]]లు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది.
 
తర్వాత [[భానుమతి]], రామకృష్ణలు తీసిన [[రత్నమాల]] చిత్రానికి సహాయ సంగీతదర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత [[బాలరాజు]], [[మనదేశం]] వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించాడు.
250

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/572728" నుండి వెలికితీశారు