ఘంటసాల వెంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
==బాల్యం==
ఘంటసాల [[1922]] [[డిసెంబర్ 4]] న [[గుడివాడ]] సమీపములోని [[చౌటపల్లి]] గ్రామములో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణ [[మృదంగం]] వాయిస్తూ, భజనలు చేసేవారు. ఆయన ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి ఆయనను 'బాల భరతుడు ' అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో ఆయన సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. ఆయన మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు [[ర్యాలీ పిచ్చయ్య]] చూసుకోవడం మొదలుపెట్టారు.
 
==సంగీత సాధన==