బి.ఎస్.రంగా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
సినిమా పరిశ్రమలో ఒక శాఖలో అనుభవం సంపాదించినవారు ఇంకో శాఖని చేపట్టడం ఆనవాయితీగా వస్తూనేవుంది. ఎడిటర్లుగా పేరు తెచ్చుకున్నవారు దర్శకులయ్యారు (సంజీవి, టి.కృష్ణ, ఆదుర్తి సుబ్బారావు), నటులుగా ప్రవేశించి దర్శకులైనవారున్నారు (భానుమతి, యన్.టి.రామారావు, విజయనిర్మల, యస్.వి.రంగారావు, పద్మనాభం మొదలైనవారు), నిర్మాతలుగా చిత్రాలు తీసి దర్శకులు కూడా అయినవారు కొందరైతే, దర్శకులుగా పేరు తెచ్చూని నిర్మాతలు ఐనవాళ్ళూ ఉన్నారు. ఈ కోవలో ఛాయాగ్రాహకులు కూడా దర్శకులైనవారిలో కె.రామ్‌నాథ్, రవికాంత్‌ నగాయిచ్‌, కమల్‌ ఘోష్‌, యస్.యస్.లాల్, లక్ష్మణ్‌గోరే, బి.యస్.రంగా వంటివారు కనిపిస్తారు.
 
లైలామజ్నూ (1949), దేవదాసు (1953) వంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడైన రంగా దర్శకుడై, నిర్మాత కూడా అయి, స్టూడియో కూడా నిర్మించారు. ముఖ్యంగా క్లాసిక్స్ అనబడే కళాత్మక చిత్రాలు తీశారు రంగాగారు. తెలుగులో తెనాలి రామకృష్ణ (1956), అమరశిల్పి జక్కన్న (1964), వసంతసేన (1967) వంటి చిత్రాల్ని, కన్నడంలో మహిషాసుర మర్దిని తీశారు. మహిషాసుర మర్దినిలో రాజ్‌కుమార్ నాయకుడు. రంగాగారు తెలుగులో గుమ్మడి గారితో నిర్మించాలనుకుని ఆయనని అడిగితే, ఆయన తెలుగులోకి డబ్బింగు చేయమని సలహా ఇచ్చారు. ఆ సలహా ప్రకారం తెలుగులోకి డబ్ చేశారు. రాజ్‌కుమార్‌కి తెలుగులో గుమ్మడి గత్రం ఇచ్చారు.
 
ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్ని తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో తీసిన రంగాగారి పూర్తి పేరు బిందిన గనవివే శ్రీనివాస అయ్యంగార్ రంగా. ఆయన కర్ణాటకలో 1917, నవంబరు 11న జన్మించారు. ఆయన మాతృభాష కన్నడం. చదువుకుంటూనే ఫోటోగ్రఫీ మీద శ్రద్ధ చూపించి ఆ కళలో కృషి చేశారు. 17వ ఏటనే ఆయన తీసిన ఛాయాచిత్రాలు రాయల్ సెలూన్ ఆఫ్ లండన్‌లో ప్రదర్శితమయ్యాయి. ఫెలో ఆఫ్ ది రాయల్ ఫోటోగ్రఫిక్ సొసైటీగా ఎన్నికయ్యారాయన. దేశాలు పర్యటీంచి, ఛాయాచిత్రాల నాణ్యతను పరిశీలించి, బొంబాయి చెరి సినిమాటోగ్రఫిలో చేరారు. ఆ సమయంలోనే స్క్రిప్ట్ రయిటింగ్ మీద అధ్యయనం చేశారు. కొన్ని కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలకు ఛాయాగ్రాహకుడుగా పనిచేసి, దర్శకనిర్మాతగా, స్టూడియో అధిపతిగా మారారు. [[విక్రమ్‌ ప్రొడక్షన్స్‌]] పేరిట మాగోపి (1954), భక్త మార్కండేయ (1955), తెనాలి రామకృష్ణ (1956), కుటుంబ గౌరవం (1957), పెళ్ళి తాంబూలం (1961), అమరశిల్పి జక్కన్న (1964), వసంతసేన (1967) వంటి చిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలలో కొన్నింటిని కన్నడంలోనూ, తమిళంలోనూ తీశారు. అసలు 1940లోనే ఆయన పరదేశి, ప్యాస్, ప్రకాష్ అనే హిందీ చిత్రాలు డైరెక్టు చేశారు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.రంగా" నుండి వెలికితీశారు