బి.ఎస్.రంగా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
 
ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్ని తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో తీసిన రంగాగారి పూర్తి పేరు బిందిన గనవివే శ్రీనివాస అయ్యంగార్ రంగా. ఆయన కర్ణాటకలో 1917, నవంబరు 11న జన్మించారు. ఆయన మాతృభాష కన్నడం. చదువుకుంటూనే ఫోటోగ్రఫీ మీద శ్రద్ధ చూపించి ఆ కళలో కృషి చేశారు. 17వ ఏటనే ఆయన తీసిన ఛాయాచిత్రాలు రాయల్ సెలూన్ ఆఫ్ లండన్‌లో ప్రదర్శితమయ్యాయి. ఫెలో ఆఫ్ ది రాయల్ ఫోటోగ్రఫిక్ సొసైటీగా ఎన్నికయ్యారాయన. దేశాలు పర్యటీంచి, ఛాయాచిత్రాల నాణ్యతను పరిశీలించి, బొంబాయి చెరి సినిమాటోగ్రఫిలో చేరారు. ఆ సమయంలోనే స్క్రిప్ట్ రయిటింగ్ మీద అధ్యయనం చేశారు. కొన్ని కన్నడ, తెలుగు, తమిళ చిత్రాలకు ఛాయాగ్రాహకుడుగా పనిచేసి, దర్శకనిర్మాతగా, స్టూడియో అధిపతిగా మారారు. [[విక్రమ్‌ ప్రొడక్షన్స్‌]] పేరిట మాగోపి (1954), భక్త మార్కండేయ (1955), తెనాలి రామకృష్ణ (1956), కుటుంబ గౌరవం (1957), పెళ్ళి తాంబూలం (1961), అమరశిల్పి జక్కన్న (1964), వసంతసేన (1967) వంటి చిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాలలో కొన్నింటిని కన్నడంలోనూ, తమిళంలోనూ తీశారు. అసలు 1940లోనే ఆయన పరదేశి, ప్యాస్, ప్రకాష్ అనే హిందీ చిత్రాలు డైరెక్టు చేశారు.
 
మొదట్లో జెమిని స్టూడియోలో కొంతకాల్మ్ పని చేసి, తరువాత విక్రమ్ స్టూడియో ఆరంభించారు. అక్కినేని నాగేశ్వరావు, ఎన్.టి.రామారావు, శివాజీ గణేశన్, రజ్‌కుమార్, ఎమ్.జి.రామచంద్రన్, కల్యాణ్ కుమార్ మొదలైన నటులందరితోనూ రంగా చిత్రాలు తీశారు. రంగా దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ఆటోమెటిచ్ కలర్ లాబొరేటరీని నెలకొల్పారు. ఈ లాబొరేటరీ బెంగళూరు సమీపంలోని నయనదహళ్లి అనే ఊర్లో ఉండేది. వాహినీ స్టూడియోలోని లాబొరేటరీ అధిపతిగా పనిచేసిన సేన్‌గుప్తాప్త మొదట్లో అక్కడే పనిచేసేవారు. బి.యన్.రెడ్డి గారి సలహాతో రంగాగారు లాబొరేటరీని మద్రసుకు మార్చారు. అప్పుడే సేన్‌గుప్తా వాహినీలో చేరారు. కానడంలో తొలి వర్ణ చిత్రం మహిషాసుర మర్దిని, అది నిర్మించిన ఘనత కూడా రంగాగారిదే. అప్పట్లో ఆ చిత్ర నిర్మాణానికి కేవలం 11 లక్షల రూపాయిలు మాత్రమే వ్యయమయ్యాయి.
 
ఛాయాగ్రాహకుడిగా ఆయన తీసిన తొలి చిత్రం భక్త నారదర్. భక్త మార్కండేయని మూడు భాషలలో ఏకకాలంలో నిర్మించిన ఘనత కూడ ఆయనకి ఉంది. పుష్పవల్లి గారి పుత్రుడు బాబ్జీ (మాయాబజార్‌లో విన్నావా యశోదమ్మా పాటలో బాలకృష్ణుడు) మార్కండేయుడిగా, తల్లి పుష్పవల్లి మార్కండేయుడి తల్లి మరుద్వతిగా మూడు భాషలలోనూ నటించారు.
 
"రంగాగారికి కథాగమనం మీద మంచి అవగాహన ఉంది. తానే దర్శకుడు, నిర్మాత గనక, పొదుపుగా తియయ్యడం గురించి కూడా ఆలోచించేవారు. కథే సినిమాకి ప్రాణం అని, కథ నిర్ణయమైన తరువాత నిర్మాణ వ్యయాన్ని వృధా కాకుండా, సినిమా తియ్యడం క్షేమదాయకం అనీ చెప్పేవారని" తెనాలి రామకృష్ణ చిత్రానికి రచయితగా పనిచేసిన సముద్రాల రాఘవాచార్యులుగారు చెప్పేవారు.
 
మంచిమనసులు (1962) చిత్రంలో అహో ఆంధ్రభోజా పాట ఉంది. ఆ పాటలో కృష్ణదేవరాయలు కనిపిస్తారు. "ఆ షాట్స్ రంగాగారి తెనాలి రామకృష్ణలోవి. రంగాగారు ఎంత సహృదయుడంటే పాటలో కొన్ని షాట్స్ సూపర్ ఇంపోజ్ చేసుకోడానికి అనుమతి ఇమ్మని అడగ్గానే, తప్పకుండా అని తానే ఆ షాట్స్ ప్రింట్ చేయించారు. ఎందుకైనా మంచిది, రామారావు గారితో కూడా ఓ మాట చెప్పండి అన్నారు. త
చెబుతే"
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.రంగా" నుండి వెలికితీశారు