"ఇది మంచి సమయము రారా (పాట)" కూర్పుల మధ్య తేడాలు

'''ఇది మంచి సమయము రారా''' తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మహిళ ఇతరులకు పాడిన తొలి నేపథ్యగీతం. ఈ పాటను అలనాటి గాయని [[బెజవాడ రాజరత్నం]] [[భక్త పోతన (1942 సినిమా)|భక్త పోతన]] (1942) చిత్రంలో రాజనర్తకి భోగిని పాత్రధారిణి అయిన సామ్రాజ్యం అనే నటీమణికి పాడారు. ఈ పాటను అలనాటి ప్రముఖ రచయిత [[సముద్రాల రాఘవాచార్య]] రచించారు. దీనికి ప్రముఖ నటుడు, సంగీత దర్శకుడు అయిన [[చిత్తూరు నాగయ్య]] సంగీతం అందించారు.
 
==విశేషాలు==
ఇది వాగ్గేయకారుడైన [[సారంగపాణి]] పదము. ఈ శృంగారపదమును పల్లవిలో కాస్త మార్పు చేశారు. మూలంలో ''రారా సామి నీకు మ్రొక్కేరా'' అని మొదలవుతుంది. ''చలమేరా ఇంటికి రారా'' అన్న పంక్తిని ''చలమేల జేసేవౌరా'' అని మార్చారు. సారంగపాణి పదములోని 2, 4 చరణాలు తీసుకొన్నారు. ''మనసారా ఒక ముద్దీరా మనకిది'' అన్న చివరి పంక్తులు, పల్లవి మాత్రమే సముద్రాల కలానివి. మిగతా భాగం సారంగపాణిది. ఈ మార్పిడి పదాన్ని నాగయ్య కల్యాణి రాగంలో [[జావళీ]]గా మార్చారు. తెరపై సామ్రాజ్యం అనే నటీమణి ''భోగిని'' పాత్రలో అభినయించారు.
 
==పాట==
1,572

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/579554" నుండి వెలికితీశారు