ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
==విశేషాలు==
ఈ పాటను [[పి.సుశీల]] నటి [[జయసుధ]] కొరకు పాడారు. దర్శకుడు [[దాసరి నారాయణరావు]] ఈ పాటను [[జయసుధ]] మరియు [[అక్కినేని నాగేశ్వరరావు]] మీద చిత్రీకరించారు. ఈ పాట [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]] రాసిన అనేక కవితలలో ఒకటి, ఆయన మరణాంతరం ఆయన రాసిన కొన్ని కవితలను ఈ చిత్రంలో పాటలుగా ఉపయోగించారు, వాటిలో ఈ పాట కూడా ఒకటి. [[రమేష్ నాయుడు]] సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయనకి ఈ చిత్రం వలన జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా బహుమతి లభించింది.
ఈ పాటను శ్రీ కృష్ణశాస్త్రి గారు ఒకసారి విజయవాడ(ఒకప్పటి బెజవాడ)నుండి బళ్ళారికి రయిల్ లో వెళ్లునప్పుడు గిద్దలూరు-నంద్యాల మద్యనున్న నల్లమల్ల ఆడవి గుండ వెళ్లునప్పుడు,అచ్చటి ఆడవి అందం చూసి నప్పుడు ఆయన గుండెలోతులనుండి అశువుగా గంగ ప్రవహంలా పుట్తిన అందమయిన గేయం అది.కలకాలం సాహిత్య ప్రియుల గుండెలో నిలిచే పాట.
 
==అవార్డులు==