మందస: కూర్పుల మధ్య తేడాలు

117.203.48.204 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 582247 ను రద్దు చేసారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
==మందస ==
'''మందస''', [[శ్రీకాకుళం]] జిల్లా, [[మందస]] మండల కేంద్రము. సుమారు 15000 జనాభా కల ఈ గ్రామము మేజరు పంచాయితీ.
ఈ గ్రామానికి పూర్వ నామం మంజూష.మంజూషమంటే సంస్కృతంలో నగల పెట్టె అని అర్ధం. ఇక్కడి మందస రాజావారి కోట, 700 సంవత్సరాల పురాతన వాసుదేవ స్వామి ఆలయం, పర్యాటకపరంగా ప్రాధాన్యత ఉన్నవి.వాసుదేవ స్వామి ఆలయంలో ఉన్న నిలువెత్తు స్వామి విగ్రహం తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహాన్ని పోలివుండి చూపరులను కట్టిపడేస్తుంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో అనగా ఫిబ్రవరి నెలలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలు అరసవెల్లి, శ్రీకూర్మం,శ్రీముఖలింగం మొదలగు వాటికి సమానంగా ఈ ఆలయం కూడా క్రమేపి ప్రాధాన్యత పొందుతున్నది. జిల్లాలో వివిధ ప్రాంతాలనుంచే కాకుండా ఇతర జిల్లాలు మరియు ఒరిస్సా నుండి కూడా అనేకమంది భక్తులు వస్తుంటారు.గ్రామంలో ఇంకా బొట్టేశ్వరాలయం,జగన్నాధస్వామి ఆలయం,నరసింహస్వామి ఆలయం,చండేశ్వరాలయం,గ్రామదేవత అన్నపూర్ణ ఆలయం వంటి పురాతన ఆలయాలు 20 వరకు ఉన్నాయి.
____________________________________________________________________________________________________
'''
'''== వాసుదేవ స్వామి ఆలయ చరిత్ర''' ==
'''
సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమయినదిగా భావిస్తున్న ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు అంతగా లభ్యం కానప్పటికీ సుమారు 266 సంవత్సరాలక్రితం ఇది పునర్నిర్మితమయినట్టు ఇక్కడ లభించిన ఆధారాలబట్టి తెలియవచ్చింది. గత శతాబ్ధము చివర వరకు ఇది మంచి వేదాధ్యయన కేంద్రముగా విలసిల్లినట్లు కూడా తగిన ఆధారాలు లభించినాయి. ఆ కాలంలో మందసా రామానుజులను ప్రసిద్ధ వేదవిద్వాంసుడు ఈ ఆలయప్రాంగణంలోనే వేదవిద్యను నేర్పుతూ కాశి వరకు కూడా పర్యటించి పలువురు వేద విధ్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి పలు సన్మానపత్రములను పొంది ఉన్నారట.
________________________________________________________________________________________________________
"https://te.wikipedia.org/wiki/మందస" నుండి వెలికితీశారు