రామోజీ ఫిల్మ్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Ramoji bus stop.jpg|thumb|left|రామోజీ ఫిల్మ్ సిటీ బస్సు నిలయము]]
రామోజీ ఫిల్మ్ సిటీకి చేరడానికి రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణీయమైన బస్సులున్నాయి. ఈ బస్సులు నగరంలోని పలు ప్రాంతాల ప్రజలను తీసుకుని నగరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుస్తుంటారు. ఈ బస్సులు ఇందు కొరకు రుసుము వసూలు చేస్తారు. ఈ బస్సులద్వారా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకునే సమయంలో వారు ఏర్పాటు చేసిన గైడు తరువాత సందర్శలుకు ఏమి చేయాలి ఎక్కడ నిలవాలి అన్నసూచనలను అంద చేస్తాడు. ఈ బస్సులు సందర్శకులను రామోజీ ఫిల్మ్ సిటీ ముఖద్వారం వరకు తీసుకు వెళ్ళి నిలుపుతాయి. ఆ తరువాత సందర్శకులు అక్కడ టిక్కట్టు కొనవచ్చు. టిక్కట్లు కొన్ని ప్యాకేజీలతో, మరికొన్ని ఒక్క రోజు మాత్రమే చూడడానికి అనుమతిచ్చేవి లభ్యమౌతాయి. సందర్శకులు టిక్కట్టు కొన్న తరువాత వారిని అవే బస్సులు అక్కడ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ సమీపానికి తీసుకు వెళ్ళి వదులుతాయి. సందర్శకులు తిరిగి వచ్చే వరకు ఆబస్సులు అక్కడే ఉండి సందర్శకులను తిరిగి వారు బయలుదేరిన ప్రదేశాలకు చేరుస్తాయి. ఇతర వాహనాల మీద వచ్చే సందర్శకులు టిక్కట్టు ఇచ్చే ప్రదేశంలో ఆగ వలసి ఉంటుంది. అక్కడి నుండి రామోజీ ఫిల్మ్ సిటీ బస్సులు వారిని ఎనిమిది కిలోమీటర్ల సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీ చేరుస్తాయి. కనుక టిక్కట్టు ఇచ్చే ప్రదేశం నుండి ప్రైవేటు వాహనాలు సంస్థ అనుమతి లేని వాహనాలు లోపల ప్రవేశించడానికి వీలు ఉండదు. అలా రెండు విధములైన బస్సులలో రామోజీ ఫిల్మ్ సిటీ సమీపానికి చేరిన తరువాత సందర్శకులు లోనికి ప్రవేశించి అక్కడ ఉన్న బస్సు స్టాండు లలో నిలిచి రామోజీ ఫిల్మ్ సిటీ లోపల తిరిగే బస్సులలో స్టూడిడియో టూరుకు వెళ్ళ వచ్చు. బస్సులు ఎక్కే సమయంలో సందర్శకులు క్యూలలో క్రమ పద్ధతిలో ఎక్కాలి. ఈ బస్సులు, బస్సుస్టాండ్‌‌లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ బస్సులో ఎక్కిన తరువాత గైడు అక్కడ విశేషాలను సందర్శకులకు వివరిస్తూ ఉంటాడు. ఈ బస్సులు సందర్శకులను స్టూడియోలలో తిప్పుతూ వాటి విశేషాలను సందర్శకులకు వర్ణించి చెప్తుంటారు. వీరు సందర్శకులను ఒక్క ప్రదేశంలో మాత్రమే ఆపి అక్కడ కొన్ని నిముషాల సమయం ఆకర్షణీయమైన రాజమహల్ సెట్‌లను చూసే అవకాశం కల్పిస్తారు. సమయంలో సందర్శకులు బస్సు నంబరు గుర్తించి తాము ఎక్కిన బస్సులోనే తిరిగి ఎక్కవలసి ఉంటుంది. తీసుకు వెళ్ళి హవా మహల్ అనే ప్రదేశంలో విడిచి పెడతారు. ఈ బస్సులు సందర్శకులను మరి కొంత దూరం తీసుకు వెళ్ళి హవా మహల్ వద్ద విడి పెడతాయి. అక్కడ సందర్శకులు అక్కడ ఉన్న రెస్టారెంటలలో చిరుతిండి, పానీయాలు, మినరల్ వాటర్ వంటివి కొనుక్కునే ఏర్పాట్లు ఉన్నాయి. సందర్శకులు అక్కడ కొంత విశృఆంతి తీసుకుని అక్కడ ఉన్న హవా మహల్ చూసి దిగువకు దిగి వేరొక బస్సులో ఎక్కి వేరొక ప్రదేశానికి చేర వచ్చు. అప్పుడు సందర్శకులు ఏ బస్సు అయినా ఎక్కే అవకాశం ఉంది. ఆ బస్సులలో సందర్శకులు ఎల్లోరా గుహల సెట్టింగులకు చేరుకో వచ్చు. ఈ బస్సులు సందర్శకులను గుహల వద్ద వదిలి వెడతాయి. అక్కడ నుండి సందర్శకులు ఎల్లోరా గుహల సెట్టింగులను చూడ వచ్చు. తరువ సందర్శకులు అక్కడ ఉన్న బస్సు నిలయానికి చేరుకుని అక్కడ ఉన్న బస్సు ఎక్కి ఫిల్మీ మ్యాజిక్ ఉన్న ప్రదేశానికి చేర వచ్చు. ఈ బస్సులు వేటికి ప్రత్యేక రుసుము ఏమీ చెల్లించనవసరం లేదు. ఫిల్మీ మ్యాజిక్ చేరుకునే సమయానికి దాదాపు భోజన సమయం ఔతుంది. ఫిల్మీ మ్యాజిక్ వద్ద ఖరీదైన అంతర్జాతీయ శైలి రెస్టారెంట్లలో అహారం తిని కొంత విశ్రాంతి తీసుకున్న సందర్శకులు ఫిల్మీ మ్యాజిక్ వద్ద నిర్వహిస్తున్న షోలను సందర్శించ వచ్చు.
[[దస్త్రం:Ramoji bus.jpg|thumb|left|రామోజీ ఫిల్మ్ సిటీ బస్సు]]
 
=== ప్రదర్శనలు ===
సందర్శకుల కొరకు నిర్వహిస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీ ప్రదర్శనలన్నీ ఫిల్మీ మ్యాజిక్ వద్దే నిర్వహిస్తున్నారు. ఇక్కడ సందర్శకులకు విశ్రాంతి తీకునడానికి అనువుగా ఎర్పాట్లు చేసి ఉన్నారు. బహిరంగంగా కొందరు అప్పుడప్పుడూ ప్రదర్శనలు ఇస్తుంటారు.
"https://te.wikipedia.org/wiki/రామోజీ_ఫిల్మ్_సిటీ" నుండి వెలికితీశారు