రామోజీ ఫిల్మ్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
+ వర్గాలు, + అంతర్వికీలు
పంక్తి 6:
=== ప్రదర్శనలు ===
సందర్శకుల కొరకు నిర్వహిస్తున్న రామోజీ ఫిల్మ్ సిటీ ప్రదర్శనలన్నీ ఫిల్మీ మ్యాజిక్ వద్దే నిర్వహిస్తున్నారు. ఇక్కడ సందర్శకులకు విశ్రాంతి తీకునడానికి అనువుగా ఎర్పాట్లు చేసి ఉన్నారు. బహిరంగంగా కొందరు అప్పుడప్పుడూ ఉత్సాహభరితమైన నృత్య ప్రదర్శనలు ఇస్తుంటారు. సందర్శకులు ఆ ప్రదర్శనలను చూసి ఆనందిస్తుంటారు. తరువాత రియల్ స్టంట్, స్పిరిట్ ఆఫ్ రామోజీ ఫిల్మ్ సిటీ లాంటి షోలను క్యూలో వెళ్ళి చూడవచ్చు. రియల్ స్టంటు కళాకారులు కృత్రిమ స్టంట్ ప్రదర్శనను ఇస్తూంటారు. ఈ ప్రదర్శన సందర్శకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. దృశ్యచిత్రీకరణ ప్రదర్శనలో ముందుగా సందర్శకులను ఒక చిన్న హాలులో గుమి కూడేలా చేస్తారు. అక్కడ సందర్శకులలో నుండి ఒక జంటను పిలిచి వారిని హీరో హీరోయిన్లగా ప్రకటిస్తారు. తరువాత అక్కడ నుండి సందర్శకులను కొన్ని ద్వారాలను తెరిచి వాటి ద్వారా వేరొక ప్రదరాశన శాలకు తీసుకు వెడతారు. అక్కడ ఔట్ డోర్ దృశ్యాలను చిత్రీకరించడానికి కొన్ని ఏర్పాట్లు చేసి ఉంటాయి. జరగబోయే కార్యక్రమాలను నిర్వాహకులు సందర్శకులకు వివరించి ముందుగా ఎన్నుకున్న జంట చేత ఒక లఘు దృశ్యంలో నటింపచేస్తారు. ఆదృశ్యాలను తెర మీద చూపుతారు. తరువాత అక్కడ నుండి సందర్శకులను వేరొక ప్రదర్శన శాలకు తీసుకు వెడతారు. అక్కడ ముందుగా చిత్రించిన దృశ్యాలకు డబ్బింగ్ జత చేస్తారు. డబ్బింగ్ సహాయం ప్రేక్షకుల నుండి ఉత్సాహ వంతులైన వారిని తీసుకుని చేస్తారు. తరువాత ఆదృశ్యాలను ప్రేక్షకులకు చూపి సందర్శకులను వేరొక ప్రదర్శన శాలకు తీసుకు వెడతారు. అక్కడ ప్రేక్షకులకు చిత్రీకరించిన దృశ్యానికి వేరొక చోట చిత్రీకరించిన ఔట్ డోర్ దృస్యాలను మరి కొన్నింటిని అవసరమైన మేరకు జత చేర్చి చూపుతారు. ఇలా సందర్శకులకు చిత్రీకరణ దహస్యాలను ప్రత్యక్షంగా చూపడమే కాక వాటిలో ఉన్న శ్రమను కొంత హాశ్యాన్ని జత చేసి అవగాహన కలుగచేస్తారు. ఇంతటితో ఈ ప్రదర్శన పూర్తి అయినట్లే. సందర్శకులు రామోజీ టవర్స్ భవనంలో నిర్వహించే ప్రదర్శన కొరకు సందర్శకులు క్యూలో నిలిచి వచ్చి చేరుకుంటారు. అక్కడ నుండి సందర్శకులను చిన్న ట్రాలీ వంటి వాహనాలలో ఎక్కించి తరువాత సీటు నుండి కదలకుండా ఏర్పాటు చేసి రైడ్‌కు తీసుకు వెడతారు. సందర్శకులు ట్రాలీలో కూర్చుని ప్రయాణం చేస్తూ ఇరువైపులా బొమ్మల కదలికతో ఏర్పాటు చేసిన చక్కని దృశ్యాలను చూడ వచ్చు. ఈ ప్రదర్సనలో ఏర్పాటు చేసిన మందమైన కాంతిలో కదిలే బొమ్మలు వివిధ దృశ్యాల రూపంలో సందర్శకులను ఆకర్షిస్తాయి. భూకంప దృశ్యాన్ని ప్రదర్శించే షో కొరకు సందర్శకులు వేరొక క్యూలో నిలిచి చేరుకుంటారు. మినీ దియేటర్ లాగా ఉండే ఈ ప్రదర్శన శాలలో సందర్శకులు చేరగానే వారిని ఆశీనులను చేసి స్పెషల్ ఎఫెక్ట్ సాయంతో ప్రేక్షకులను ఎత్తుకు తీసుకు వెళ్ళిన అనుభూతిని ఉన్న చోటు నుండే కలిగిస్తారు. రామోజీ ఫిల్మ్ సిటీ అంతా పై నుండి విహంగ వీక్షణంలా చూస్తున్న సమయంలో ఉన్నట్లుండి అతి చక్కటి నైపుణ్యంతో ప్రేక్షకులను వర్షం కురిసే అనుభూతికి లోను చేస్తారు. ఆ దృశ్యంలో ప్రేక్షకుల మీద నిజంగా నీటిని చల్లే ఏర్పాటు చేసి దృశ్యంలో ప్రేక్షకులను ఒక భాగమైన అనుభూతిని కలుగ చేస్తారు. చివరగా భూకంపం వచ్చినట్లు నిర్మాణాలు కూలి పోయినట్లు దృశ్యాలు చూడ వచ్చు. ఈ మొత్తం సన్ని వేశంలో ప్రేక్షకులను ఒక భాగంయినట్లు అనుభూతిని కలిగించడం ఈ ప్రదర్శనలో ప్రత్యేకత. ఈ ప్రదర్శన చూసి బయటకు వచ్చే దారిలో సందర్శకులు తమకు కావలసిన వస్తువులను కొనుక్కునే షాపింగ్ మాలుకు చేరుకుంటారు. అక్కడ కావలసిన వారు ఫిల్మ్ సిటీ సందర్శన జ్ఞాపకాలను గుర్తుంచుకునేలా వస్తువులను కొనుగోలు చేయ వచ్చు. ఆ హాలు లోపలి నిర్మాణం ఆ ప్రదఋసనకు తగిన విధంగా భూకంపానికి గురి అయినట్లు నిర్మించడము ఒక ప్రత్యేకత. కనుక అక్కడ నుండి బయటకు వచ్చే వరకు సందర్శకులు భూకంప అనుభూతిని పొందుతూ ఉంటారు.
 
[[వర్గం:హైదరాబాదు]]
[[వర్గం:హైదరాబాదు పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:1996 స్థాపితాలు]]
 
 
[[en:Ramoji Film City]]
[[de:Ramoji Film City]]
[[kn:ರಾಮೋಜಿ ಚಿತ್ರ ನಗರಿ(ರಾಮೋಜಿ ಫಿಲ್ಮ್‌ಸಿಟಿ)]]
[[ml:റാമോജി ഫിലിം സിറ്റി]]
"https://te.wikipedia.org/wiki/రామోజీ_ఫిల్మ్_సిటీ" నుండి వెలికితీశారు