రామోజీ ఫిల్మ్ సిటీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[దస్త్రం:Ramoji 1.jpg|thumb|left|రామోజీ ఫిల్మ్ సిటీ ప్రవేశానికి ముందున్న వాహనాల నిలయము]]
 
రామోజీ ఫిల్మ్ సిటీకి చేరడానికి రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆకర్షణీయమైన బస్సులున్నాయి. ఈ బస్సులు నగరంలోని పలు ప్రాంతాల ప్రజలను తీసుకుని నగరానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుస్తుంటారు. ఈ బస్సులు ఇందు కొరకు రుసుము వసూలు చేస్తారు. ఈ బస్సులద్వారా రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకునే సమయంలో వారు ఏర్పాటు చేసిన గైడు తరువాత సందర్శలుకు ఏమి చేయాలి ఎక్కడ నిలవాలి అన్నసూచనలను అంద చేస్తాడు. ఈ బస్సులు సందర్శకులను రామోజీ ఫిల్మ్ సిటీ ముఖద్వారం వరకు తీసుకు వెళ్ళి నిలుపుతాయి. ఆ తరువాత సందర్శకులు అక్కడ టిక్కట్టు కొనవచ్చు. టిక్కట్లు కొన్ని ప్యాకేజీలతో, మరికొన్ని ఒక్క రోజు మాత్రమే చూడడానికి అనుమతిచ్చేవి లభ్యమౌతాయి. సందర్శకులు టిక్కట్టు కొన్న తరువాత వారిని అవే బస్సులు అక్కడ నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ సమీపానికి తీసుకు వెళ్ళి వదులుతాయి. సందర్శకులు తిరిగి వచ్చే వరకు ఆ బస్సులు అక్కడే ఉండి సందర్శకులను తిరిగి వారు బయలుదేరిన ప్రదేశాలకు చేరుస్తాయి. ఇతర వాహనాల మీద వచ్చే సందర్శకులు టిక్కట్టు ఇచ్చే ప్రదేశంలో ఆగ వలసి ఉంటుంది.
[[దస్త్రం:ramoji 91.jpg|thumb|right| రామోజీ ఫిల్మ్ సిటీ టిక్కెట్త్తు]]
[[దస్త్రం:ramoji 92.jpg|thumb|left| రామోజీ ఫిల్మ్ సిటీ టిక్కెట్టు]]
అక్కడి నుండి రామోజీ ఫిల్మ్ సిటీ బస్సులు వారిని ఎనిమిది కిలోమీటర్ల సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుస్తాయి. కనుక టిక్కట్టు ఇచ్చే ప్రదేశం నుండి ప్రైవేటు వాహనాలు సంస్థ అనుమతి లేని వాహనాలు లోపల ప్రవేశించడానికి వీలు ఉండదు. రామోజీ ఫిల్మ్ సిటీ లోనికి ఎటువంటి ఆహార పదార్ధాలు తీసుకు వెళ్ళ కూడదు. సందఎర్శకులు వారికి కావలసిన ఆహార పానీయాలను లోపల ఉన్న స్టాల్స్ వద్ద ఖరీదు చేయాలి. రామోజీ ఫిల్మ్ సిటీ లోపలకు కెమేరా, సెల్‌ఫోన్ ఇతర విద్యుత్ పరికరాలను తీసుకు వెళ్ళడానికి అభ్యంతరం లేదు. సందర్శకులకు లోనికి ప్రవేశించే ముందు తనిఖీలను నిర్వహిస్తారు. చేతి సంచి, హ్యాండ్ బ్యాగులను మాత్రమే వెంట తీసుకుని వెళ్ళ వచ్చు. సందర్శకులు తమ ఇతర లగేజులను భద్రపరచడానికి కావలసిన సదుపాయము ఉంది. కనుక సందర్శకులు తమ సామానులను వెలుపలి వాహన నిలయము వద్ద భద్రపరచుకుని తిరిగి వెలుపలకు రాగానే తీసుకొన వచ్చు. గైడ్ ఇందుకు తగిన సహాయ సహకారలను అందిస్తాడు.
 
=== చూడదగిన విశేషాలు ===
"https://te.wikipedia.org/wiki/రామోజీ_ఫిల్మ్_సిటీ" నుండి వెలికితీశారు