ఈక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
* ఉష్ణ నిరోధకము : పక్షులు ఉష్ణరక్తజీవులు. వీటి శరీర ఉష్ణోగ్రత 104 F - 112 F మధ్య ఉంటుంది. శరీరము మీదగల ఈకల తొడుగు వలన శీతాకాలములోను, వేసవికాలములోను ఉష్ణోగ్రత బయటకు పోకుండా కాపాడుతుంది.
* ఉడ్డయిక నిర్మాణము : ఈకలు చాలా తేలికగా ఉండటము వలన, అవి ఎక్కువ సంఖ్యలో శరీరము మీద ఉన్నప్పటికి వీటి శరీరము చాలా తేలికగా ఉంటుంది. రెక్కల మీద కప్పి ఉన్న క్విల్ ఈకలు రెక్కకు విస్తారతలాన్ని చేకూర్చి, ఎగరటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. తోక మీద గల ఈకలు [[చుక్కాని]] వలె పనిచేస్తూ పక్షులు ఎగిరేటప్పుడు [[దిశ]]లను మార్చటానికి సహాయపడతాయి.
* ఆత్మరక్షణ : లైపోక్రోమ్ మరియు మెలనిన్ అను వర్ణక పదార్ధాల వలన ఈకలు వివిధ రంగులలో కనిపిస్తాయి. ఈకలు పక్షులు నివసించు ప్రదేశాల రంగులో ఉండి వాటి ఉనికిని శత్రువులు తెలుసుకోకుండా చేస్తాయి. అందువలన పరభక్షకాల నుండి రక్షణ కల్పిస్తాయి.
* లింగ నిర్ణయము : ఆడజీవుల కంటే మగజీవులు ఎక్కువ ఈకలను కలిగి, వివిధ వర్ణాలలో ఉండటము వలన వాటి లైంగిక ద్విరూపకత (Sexual dimorphism) తెలుగుకోవడానికి ఈకలు ఉపయోగపడతాయి. అంతేకాక ఆడజీవులను ఆకర్షించడానికి ఈకల రంగు మగజీవులలో ఉపయోగపడుతుంది.
* గూళ్ళు నిర్మించుట : సంతానోత్పత్తి కాలములో గూళ్ళను నిర్మించుటకు ఈకలు ఉపయోగపడతాయి. వదులుగా ఉన్న ఈకలను తమ శరీరములో నుంచి తీసి గూళ్ళను నిర్మిస్తాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/ఈక" నుండి వెలికితీశారు