వీణ: కూర్పుల మధ్య తేడాలు

కొంత సమాచారం చేర్పు
విస్తరణ
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:Saraswati.jpg|thumb|right|200px|[[సరస్వతి]], సంగీతపు దేవి, ఈమె చేతిలో [[వీణ]].]]
'''వీణ''' ([[కన్నడ]]:ವೀಣೆ [[తమిళం]]:வீணா) తీగలు మీటుతూ [[సప్తస్వరాలు]] అందించే [[సంగీత వాయిద్యము]]. వీణ [[సరస్వతి]] హస్త భూషణం> కాబట్టి దీనినే సరస్వతీ వీణ అని కూడా అంటారు. వీణ ప్రముఖంగా [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత కచేరీ]]లలో వినియోగిస్తారు. వీణ ఏడు తంత్రులు గల తంత్ర వాయిద్యము. అనుమందరం, మందరం, మందర పంచకం, షడ్జమం అనే నాలుగు తంత్రులపై వీణకు బిగిస్తారు. ప్రక్కన శృతితాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అనే మూడు తంత్రులను బిగిస్తారు.
 
వీణ వాయించేటప్పుడు కుడిచేత్తో మీటుతూ, దానికి అమర్చి ఉన్న 24 మెట్లు (రెండు స్థాయిలు) దానిలోని స్వరాలకు అనుగుణంగా ఎడమ చేతి వేళ్లతో మెట్టుమీద అదిమిపట్టి ఆయా స్వరాల్ని పలికించాల్సి ఉంటుంది.
 
వీణలో ముఖ్యంగా కుండ, దండి, యాళి (పౌరాణిక జంతువు మెడ ఆకారం), సొరకాయ బుర్ర అనే భాగాలుంటాయి.
 
ఆంధ్ర ప్రదేశ్‌లోని [[విజయనగరం]] జిల్లా [[బొబ్బిలి]] వీణలను తయారుచేయడంలో ప్రసిద్ధిచెందింది. వీణలలో చాలా రకాలు ఉన్నాయి. తంజావూరు వీణలను పనస కర్రతో తయారుచేస్తారు. మైసూరులో నల్లకర్రతో తయారుచేస్తారు. కేరళ లోని త్రివేండ్రం లో కూడా వీణలు తయారు చేస్తారు.<ref>http://www.thehindu.com/life-and-style/kids/article1454342.ece</ref>
 
బొబ్బిలి సంస్థానాన్ని పెదరాయుడు 17వ శతాబ్దంలో స్థాపించాడు. అందరి ప్రభువుల్లాగే ఆయనకీ కళలంటే ఆసక్తి. మొదట్లో ఖాళీ సమయాల్లో వీణ వాయించేవారు. కానీ అతని కాలంలో రాచకార్యాల్లో వీణ వాయించడం విడదీయరాని భాగమైపోయింది. వీణను గొల్లపల్లి కి చెందిన సర్వసిద్ధి వర్గానికి చెందిన కళాకారులు తయారు చేస్తే సంస్థానంలోని మహిళలు వీటిని వాయించేవారు. రాజులు వీటిని ఆంగ్లేయ సందర్శకులకు బహుమానంగా ఇచ్చేవాళ్ళు. కళాకారులను ఘనంగా సత్కరించేవాళ్ళు.
వీణలు తయారు చేయడం తర తరాలుగా వీరు వృత్తిగా కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ కేవలం నలభై మంది కళాకారులు మాత్రమే ఇక్కడ ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. పనస చెట్టు నుంచి సంగ్రహించిన వీణసారె వీణ తయారీలో ప్రధానమైన భాగం. ఇది తేలికగా ఉండటమే కాకుండా మంచి ప్రతిధ్వని ని కూడా పలికిస్తుంది. మంచి ధృడత్వం, మన్నిక, తేమని తట్టుకోగలగడం మొదలైన లక్షణాలు కలిగి ఉండటం వల్ల దీన్ని విరివిగా వాడతారు. వీణను సాధారణంగా ఒకే కొయ్యతో తయారు చేస్తారు.
 
<ref>http://www.thehindu.com/life-and-style/kids/article1454342.ece</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వీణ" నుండి వెలికితీశారు