సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు

చి Thuyathadi.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jameslwoodward. కారణం: (Per commons:Commons:Deletion_requests/File:Thuyathadi.jpg).
పంక్తి 21:
బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.
 
 
[[దస్త్రం:Thuyathadi.jpg|thumb| బర్మాలో హంసవాహినియైన సరస్వతి "తూయతాడి" అన్న పేరుతో. త్రిపిటకాలను చేత ధరించినది.]]
 
వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా [[హంస]]వాహినిగా, [[వీణ|వీణా]]పాణిగా, [[పుస్తకం]] మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో [[తెలుపు]] రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా [[బమ్మెర పోతన]] తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు.
"https://te.wikipedia.org/wiki/సరస్వతి" నుండి వెలికితీశారు