మాంసకృత్తులు: కూర్పుల మధ్య తేడాలు

చి r2.6.5) (యంత్రము కలుపుతున్నది: hif:Protein
చి యంత్రము మార్పులు చేస్తున్నది: stq:Oaiwiete; cosmetic changes
పంక్తి 1:
[[ఫైలుదస్త్రం:Myoglobin.png|thumb|200px|[[మయోగ్లోబిన్]] యొక్క 3D నిర్మాణం. ఇందులో [[ఆల్ఫా హెలిక్స్]] రంగులతో అద్దబడింది. ఇది [[X-రే క్రిస్టల్లోగ్రఫి]] ద్వారా నిర్మాణం కనుగొనబడిన మొట్టమొదటి ప్రోటీన్.]]
 
'''మాంసకృత్తులు''' జీవుల శరీర నిర్మాణంలో ముఖ్యమైన పదార్ధాలు. మాంసకృత్తులని '''ప్రాణ్యములు''' అనీ, లేదా '''ప్రోటీన్‌లు''' (Proteins) అనీ కూడ పిలుస్తారు. గ్రీకు భాషలో protos అంటే 'ముఖ్యమైనది' అనే అర్ధం వస్తుంది. సంస్కృతంలోనూ, తెలుగులోనూ ప్రాణ్యాక్షరాలు అంటే ముఖ్యమైన అక్షరాలు - లేదా - అచ్చులు అనే వాడుక ఉంది. భాష కట్టడికి అచ్చులు ఎంత ముఖ్యమో శరీర నిర్మాణానికి అంతే ముఖ్యమయిన ఈ రసాయనాలని 'ప్రాణ్యములు' అనటం సముచితం. పోషక పదార్ధాలయిన ఈ ప్రాణ్యములు మాంసంలో ఉంటాయి, పప్పులలో ఉంటాయి, పాలల్లో ఉంటాయి - ఆఖరికి చిన్న చిన్న మోతాదులలో బియ్యంలోనూ, గోధుమలలోనూ కూడ ఉంటాయి.
పంక్తి 5:
== చరిత్ర ==
కర్బన రసాయనం (organic chemistry), జీవ రసాయనం (biochemistry) దరిదాపుగా ఒకే సారి పుట్టేయనవచ్చు. సర్వసాధారణంగా వేడి చేసినప్పుడు ఘన పదార్ధాలు కరిగి ద్రవ రూపం చెందుతాయి. మంచు కరిగి నీరు అవుతుంది. వెన్న కాచితే నెయ్యి అవుతుంది. కాని కోడి గుడ్డుని కొట్టి సొనని పెనం మీద వేస్తే గట్టిపడుతుంది. రక్తాన్ని వేడి చేస్తే గడ్డ కడుతుంది. పాలని ఇగరబెడితే కోవా అవుతుంది. అంటే కొన్ని పదార్ధాలు వేడి చేస్తే కరుగుతాయి, కొన్ని వేడి చేస్తే పేరుకుంటాయి. ఇలా వేడి చేస్తే పేరుకునే పదార్ధాలకి [[సొనలు]] (albumins) అని పేరు పెట్టేరు. సొనల మీద పరిశోధన సాగిన కొత్తలో సొనలలో ఒక కొత్త రకం రసాయనం పదే పదే కనిపించటం మొదలయింది. దానిని విశ్లేషించి చూడగా దాని సాంఖ్యక్రమం (empirical formula) C<sub>40</sub>H<sub>62</sub>O<sub>12</sub>N<sub>10</sub> అని తేలింది. అంటే ఒక బణువు (molecule)లో 40 కర్బనపు అణువులు, 62 ఉదజని అణువులు, 12 ఆమ్లజని అణువులు, 10 నత్రజని అణువులు ఉన్నాయన్న మాట. సొనలన్నిటిలోనూ తారసపడుతూన్న ఈ పదార్ధం కర్బనోదకం (carbohydrate) కాదు, కొవ్వు (fat) కాదు - ఎందుకంటే కర్బనోదకాలలోనూ, కొవ్వులలోనూ నత్రజని (nitrogen) ఉండదు. ఈ సొనలలో నత్రజని కనిపిస్తోంది. అంతే కాదు. ఈ కొత్త రకం బణువులు చాల పెద్దవిగా కూడ కనిపిస్తున్నాయి. ఇదేదో ముఖ్యమైన పదార్ధం అయి ఉండాలనిన్నీ, జీవి యొక్క జన్మ రహశ్యం మూడొంతులు ఇందులో ఇమిడి ఉండొచనిన్నీ ఊహించి బెర్‌జీలియస్‌ (Berzelius) దీనికి ప్రోటీన్‌ (అంటే, ముఖ్యమైనది) అని నామకరణం చేసేరు. బెర్‌జీలియస్‌ ఊహించినట్లుగా ఈ ప్రాణ్యం మన మనుగడకి చాల ముఖ్యమయిన పదార్ధం అని తేలింది. కాని, బెర్‌జీలియస్‌ అనుకున్నట్లు జీవి యొక్క రహశ్యం ఈ బణువులో లేదని కూడ తేలింది. ఆ గౌరవం DNA అనబడే మరొక బృహత్‌ బణువుకి దక్కింది.
== మూలకణాలతో మాంసం తయారీ ==
హా లండ్‌ దేశ పరిశోధకులు పంది మూలకణాలతో మాంసం తయారు చేశారు.అంటే ఓ నగ రానికి సరిపడా మాంసం ఉత్పత్తి చేసేందుకు వందలకొద్దీ జంతువు లను పెంచాల్సిన అవసరం లేదు.ప్రయోగశాలలో పదో,ఇరవయ్యో పెంచితే చాలు.అయితే.. ప్రస్తుతం ఈ విధానంలో సెంటీమీటరు పొడవై న మాంసం ముక్కలను మాత్రమే తయారుచేయగలిగారు.ఒక మనిషికి సరిపడినంత తయా రుకావడానికి 30 రోజులైనా పడుతుందని మార్క్‌ వివరించారు. త క్కువ వ్యవధిలో ఎక్కువ మాం సం ఉత్పత్తి చేసేలా ఈ విధానా న్ని అభివృద్ధి చేస్తున్నామని పోస్ట్‌ చెప్పారు.మాంసం కోసం జంతువులను పెద్ద సంఖ్యలో పెం చడంకూడా పర్యావరణానికి తీవ్ర హాని చేస్తోందట.(ఆంధ్రజ్యోతి 18.1.2010)
 
పంక్తి 11:
ప్రాణ్యం అనే పదార్ధం ఉందని తెలియగానే దాని రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలన్న ఆవేదనతో వేట మొదలయింది. అప్పటికే కర్బనోదకాల అధ్యయనంలో నేర్చుకున్న ఒక పద్దతి ఈ వేటలో ఉపయోగపడింది. కణోజు లేదా [[సెల్యులోజు]] (cellulose) ని ఆమ్లంలో వేసి వేడి చేసినప్పుడు [[గ్లూకోజు]] (glucose) వచ్చింది కనుక కణోజు బణువుని గ్లూకోజు బణువులతో కట్టిన దండలా ఊహించుకున్నారు. అదే విధంగా జెలటిన్‌ (gelatin) అనే ప్రాణ్యపు పదార్ధాన్ని ఆమ్లంలో వేసి వేడి చెయ్యగా తెల్లని, తియ్యనయిన స్పటికాలు వచ్చేయి. రుచికి కొంచెం తియ్యగా ఉన్నా ఈ స్పటికాలు చక్కెర జాతి కర్బనోదకాలు కాదని తేలిపోయింది. ఎందుకంటే ఈ స్పటికాలని తరచి తరచి పరిశోధించి చూడగా వాటినుండి నవజని (ammonia, NH<sub>3</sub>) అనే వాయువు వచ్చింది. చక్కెరలలో C, H, O లు మాత్రమే ఉంటాయి, నత్రజని (N) ఉండదు. కనుక ఈ కొత్త రకం స్పటికాలకి కొత్త పేరు పెట్టవలసి వచ్చింది.
 
[[ఫైలుదస్త్రం:AminoAcidball.svg|thumbnail|300px|అన్ని నవామ్లాలకి ఉమ్మడిగా ఉండే నిర్మాణక్రమం. ఇక్కడ ఎడం చివర ఉన్నది నవాంశ (amine group), కుడి చివర ఉన్నది కార్బాక్సిల్‌ గుంపు (carboxyl group). R ని పక్క గొలుసు అంటారు. ఈ పక్క గొలుసు మారినప్పుడల్లా మరొక నవామ్లం వస్తుంది.]]
 
 
పంక్తి 32:
మనుష్యులందరికి ఒక తల, రెండు చెవులు, రెండు కళ్ళు, వగైరా జాతి పోలికలు ఉన్నప్పటికీ ప్రతి మనిషికి పోల్తి పట్టటానికి ప్రత్యేకమైన గుర్తులు ఉన్నట్లే నవామ్లాలన్నీటికి కొన్ని ఉమ్మడి లక్షణాలు, కొన్ని ప్రత్యేక లక్షణాలు ఊన్నాయి. బొమ్మలో చూపిన విధంగా ప్రతి నవామ్లం కీ ఒక చివర ఎమైన్‌ గుంపు, ఒక చివర కార్బాక్సిల్‌ గుంపు ఉంటాయి. ఇది ఉమ్మడి లక్షణం. ప్రతీ నవామ్లపు బణువులోనూ ఎమైన్‌ గుంపు వైపు ఉన్న కర్బనపు అణువుని అంటిపెట్టుకుని ఒక పక్క గొలుసు (side chain) ఉంటుంది. బొమ్మలో ఈ పక్క గొలుసుని R అనే అక్షరంతో చూపడమయింది. ఈ పక్కగొలుసు రకరకాలుగా ఉంటుంది. ఇది మారినప్పుడల్లా నవామ్లం పేరు, లక్షణాలు మారుతూ ఉంటాయి.
 
[[ఫైలుదస్త్రం:Protein-primary-structure.png|thumb|300px|right|A [[బహుజీర్ణమాల]] అనేది నవామ్లాల గొలుసు.]]
 
 
పంక్తి 298:
[[sq:Proteina]]
[[sr:Протеин]]
[[stq:ProteineOaiwiete]]
[[su:Protéin]]
[[sv:Protein]]
"https://te.wikipedia.org/wiki/మాంసకృత్తులు" నుండి వెలికితీశారు