హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి''' అలనాటి ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగ...
(తేడా లేదు)

15:05, 26 ఫిబ్రవరి 2011 నాటి కూర్పు

హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి అలనాటి ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. తొలుత ఈయన ఒక ప్రముఖ హార్మోనియం వాద్యకారుడు మరియు రంగస్థల సంగీతదర్శకుడు. ఆయన మొట్టమొదటి తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. తెలుగులో మొట్టమొదటి టాకీ భక్త ప్రహ్లాద (1931)కు ఈయనే సంగీతదర్శకుడు. తెలుగే కాక ఇతర దక్షిణభారతీయ భాషా చిత్రాలకు కూడా ఈయన పనిచేశారు. ప్రముఖ కన్నడ రంగస్థల, చలనచిత్ర నటుడు ఆర్.నాగేంద్రరావు తొలి కన్నడ టాకీ సతీ సులోచన (1934) కి పద్మనాభశాస్త్రిని సంగీతం సమకూర్చడానికి కుదుర్చుకున్నారు, కానీ తర్వాత నాగేంద్రరావే ఆ పనిని చేశాడు, పద్మనాభశాస్త్రి అయనకు సహాయకునిగా పనిచేశాడు. తమిళ చిత్రం కంకణమ్ (1947) తో గాయని పి.లీలను చలనచిత్ర రంగానికి పరిచయం చేశారు. శ్రీకృష్ణ తులాభారం (1955) చిత్రంలో సత్యభామ వేషం ధరించిన నటగాయని ఎస్.వరలక్ష్మి ఈయన సంగీతదర్శకత్వంలో స్థానం నరసింహరావు రచించిన సుప్రసిద్ధమైన మీరజాలగలడా నాయానతి పాట ఆలాపించింది.

చిత్రసమాహారం