"గౌతమ బుద్ధుడు" కూర్పుల మధ్య తేడాలు

చి (యంత్రము కలుపుతున్నది: rue:Будга Ґаутама)
[[దస్త్రం:SiddhartaBirth.jpg|thumb|200px|left|(2-3వ శతాబ్ధం) సిద్ధార్థుని జననం.]]
 
బుద్ధుడు మరియు అతని శిష్యులు, ప్రతి సంవత్సరం నాలుగు నెలలు బుద్ధుని బోధనలను చర్చించి ఆచరించేవారు. ఈ బోధనలను భద్రపరచి ప్రచారం చెయ్యడానికి బుద్ధుని నిర్యాణం తర్వాత ఒక సంఘం ఏర్పడింది. ఒక శతాబ్దం తర్వాత ఇంకో సంఘం ఏర్పడింది. ఈ రెండు సంఘాలు బుద్ధుని బోధనలను ప్రచారం చేయసాగాయి. ఈ సంఘాలు బుద్ధుని బోధనలను, వేర్వేరు భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో బౌద్ధ భిక్షువుకు అప్పగించాయి. అప్పటి నుంచి బుద్దుని బోధనలు ముఖస్థంగా ప్రచారం కాసాగాయి. చరిత్ర ప్రకారం బుద్ధుని బోధనలను, రెండవ సంఘం ఏర్పడినప్పుడు గానీ, లేదా తర్వాత కొద్ది కాలానికి గానీ ప్రస్తుత రూపాన్ని సంతరించుకున్నాయి. కానీ, ఈ బోధనలు బుద్ధుని నిర్యాణానంతరం, మూడు, నాలుగు శతాబ్దాల వరకు ఎక్కడా గ్రంధస్థం చెయ్యబడలేదు. ఈ సమయంలో బౌద్ధ బిక్షువులు, గౌతమ బుద్ధుని జీవితాన్ని మరింత గొప్పగా మలచడానికి, అతని చరిత్రను, బోధనలను, మార్చడం గానీ, లేదా కొత్త విషయాలను జోడించడం గానీ చేసారుచేసిఉండవచ్చునని కొందరి అభిప్రాయం.
 
ప్రాచీన భారతీయులు కాలక్రమము కన్నా తత్వశాస్త్రమునకే ప్రాముఖ్యతనిచ్చేవారు. అందువల్ల బౌద్ధ మత గ్రంధాలలో కూడా, శాక్యముని జీవిత చరిత్ర కన్నా అతిఆయన బోధనలకే ప్రాముఖ్యం ఉంటుంది. ఈ గ్రంధాలలో ప్రాచీన భారతీయ నాగరికత మరియు జీవన విధానం వివరించబడింది.
 
=== బుద్ధుని జననం ===
 
సిద్ధార్ధుడు కపిలవస్తు దేశానికీ చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. భౌగొళికంగా ఈ ప్రాంతం ప్రస్తుత [[నేపాల్]] దేశంలో ఉంది. కానీ చారిత్రకంగా ఈ ప్రాంతం ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది. గౌతమ అనునది సిద్ధార్ధుని ఇంటి పేరు కాదు సిద్ధార్ధుని పెన్ఛినపెంచిన తల్లి గౌతమి. అన్దుకుఅందుకు గాను అతనికి ఆ పెరుపేరు వఛిన్దివచ్చింది. తండ్రి శుద్దోధనుడు, తల్లి మహామాయతల్లిమహామాయ (మాయాదేవి, కోళియన్ దేశపు రాకుమారి). సిద్దార్డుడు గర్భమందున్నప్పుడు, మాయాదేవి, ఒక ఆరు దంతముల [[ఏనుగు]] తన గర్భములోకి కుడి వైపు నుండి ప్రవేశించినట్లుగా ఒక స్వప్నమందు దర్శించినది. అది జరిగిన పది చంద్ర మాసముల తర్వాత సిద్ధార్డుడు జన్మించెను. శాక్యవంశాచారము ప్రకారం, గర్భావతిగానున్న మాయాదేవి, ప్రసవానికి తన తండ్రిగారింటికి బయలుదేరింది. కానీ మార్గమధ్యంలో, లుంబిని అనే ప్రాంతంలో ఒక సాలవృక్షం క్రింద ఒక మగ బిడ్డను ప్రసవించినది.
 
అనేక ఆధారాలను బట్టి, ప్రసవ సమయంలోగాని లేదా మగబిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత గానీ మాయాదేవి మరణించినదని తెలుస్తుంది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధర్దుడనే నామకరణం చేశారు. సిద్ధార్దుడనగా అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్ధం. సిద్దార్దుడు జన్మించిన ఐదవ దినము నాడు, అతనికి నామకరణం చేసి, అతని భవిష్యత్తుని చెప్పమని, ఎనిమిది మంది జ్యోతిష్కులని శుద్దోధనుడు ఆహ్వానించెను. వారిలో కౌండిన్యుడనే పండితుడు, సిద్దార్దుడు భవిష్యత్తులో, బుద్ధుడవుతాడని జ్యోస్యం చెప్పెను. అప్పటి చరిత్ర, ఆచారాలను బట్టి చూస్తే, శుద్దోధనుడు, సూర్య వంశపు రాజైన [[ఇక్ష్వాకులు|ఇక్ష్వాకుని]] వారసుడని తెలియుచున్నది. కానీ కొందరు చరిత్ర కారుల ప్రకారం శుద్దోధనుడు ఒక ఆటవిక తెగ నాయకుడు.
[[దస్త్రం:Great_Departure.JPG|thumb|left|ఈ చిత్రంలొ సిద్దార్దుడు తన అంత్తపురాని మరియు రాజ భోగాల వద్దలి పరివ్రాజక జీవితం గడపడానికి బయలుదేరాడు. అతనితొపాటు రాజభటులు, మీతుణా ప్రేమజంటలు, దేవతలను కుడ కనబడతారు]]
 
సిద్దార్డునకు ఐహిక ప్రపంచపు కష్ట్టసుఖాలు తెలియకూడదని శుద్దోధనుడు ఎంత ప్రయత్నించినా, తన ౨౯వ ఏట, ఒక రోజు సిద్ధర్డుడు, ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగ పిడితుడ్ని, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. అప్పుడు తన రధ సారధి ఛన్న(చెన్నుడు) ద్వారా, ప్రతి మానవుడూ ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలిసి తీవ్రంగా కలత చెంది, ముసలితనాన్నీ, రోగాన్నీ, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడప నిశ్చయించాడు.
 
అప్పుడు సిద్ధార్దుడు పరివ్రాజక జీవితం గడపడానికి, తన రధ సారధి ఛన్న సహాయంతో, ఒకనాడు రాజభవనం నుంచి కంతక అనే గుర్రంపై తప్పించుకున్నాడు. ఈ విధంగా ఒక బోధిసత్వుని నిష్క్రమణ అతని భటులకు తెలియకుండా ఉండడానికి, అతని గుర్రపు డెక్కల చప్పుడు దేవతలచే అపబడిందని చెప్తారు. దీనినే ఒక గొప్ప నిష్క్రమణ(మహాభినిష్క్రమణ) (ది గ్రేట్ డిపార్చర్) అని అంటారు.
 
సిద్ధార్దుడు తన సన్యాసి జీవితాన్ని రాజగహ(మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం)లో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కానీ బింబిసార మహారాజ సేవకులు, సిద్దార్డుని గుర్తించడంతో, బింబిసారుడు, సిద్ధార్దుని అన్వేషణకు కారణం తెలుసుకుని, అతనికి తన సింహాసనాన్ని (మహారాజ పదవిని) బహుకరించాడు. కాని సిద్ధర్డుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ, తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే విచ్చేస్తానని మాటిచ్చాడు.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/588701" నుండి వెలికితీశారు