మూత్రపిండము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
== గలన యంత్రాంగం ==
 
చిక్కుడు గింజ ఆకారంలో ఉన్న మూత్రపిండాలు ఒక పక్క కుంభాకారంగానూ, మరొక పక్క పుటాకారం (concave) గానూ ఉంటాయి. ఈ పుటాకారపు ఒంపు ద్వారా [[వృక్క ధమని]] (renal artery), వృక్క సిర (renal vein), యూరెటర్‌ గొట్టం (ureter tube), వార్తలను మోసే నరాల జడకట్ట (neural plexus) లోపలికి వెళతాయి. ప్రతి మూత్రపిండం లోపల దరిదాపు మిలియన్‌ (1,000, 000) ప్రత్యేకమయిన గలన కణాలు (nephrons) ఉంటాయి. మూత్రపిండాలకి ఈ గలన కణాలు ఆయువు పట్టు. ఒకసారి పాడయితే వీటిని మరమ్మత్తు చెయ్యలేము. పేరుకి గలన కణాలని అన్నా ఇవి ఉత్త గలన ప్రక్రియ (లేదా వడపోత) ఒక్కటీ చేసి ఊరుకోవు. రక్తంలోని మలినాలని వడపొయ్యటం, తరువాత ఆరోగ్యంగా ఉండే రక్తానికి ఉండవలసిన లక్షణాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరి చూడటం - ఇవి ఈ గలన కణాల ముఖ్య బాధ్యతలు. ఈ గురుతర బాధ్యలు నెరవేర్చటానికి ప్రతీ గలన కణం లోపల రెండు కర్మాగారాలలాంటి ఉపభాగాలు ఉంటాయి. వీటిలో ఒక భాగం పేరు గ్లోమెరూల్సు (glomerulus). రెండవదాని పేరు చిట్టిగొట్టం (tubule). ఇది సన్నటి చుట్టబెట్టిన చిన్న గొట్టం మాదిరి ఉంటుంది. ఈ సంక్లిష్ట వాతావరణంలో [[కేశనాళికలు|కేశనాళికలలో]] (capillaries) రక్తం ఒక పక్క ప్రవహిస్తూ ఉంటే - రకరకాల రసాయన ప్రక్రియల ప్రభావం వల్ల - రక్తం నుండి మూత్రం వేరవుతుంది. అంతే కాకుండా రక్తంలో రసాయన తుల్యతలు అన్నీ ఉండవలసిన విధంగా అమర్చబడతాయి.
 
== రక్తం లోకి మలినాలు ఎక్కడ నుండి వస్తాయి? ==
"https://te.wikipedia.org/wiki/మూత్రపిండము" నుండి వెలికితీశారు