ఏకవీర (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
తొలి తెలుగు [[జ్ఞానపీఠ అవార్డు|జ్ఞానపీఠ]] బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రాసిన ఏకవీర నవల ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత [[సి.నారాయణరెడ్డి]]. నారాయణరెడ్డి తన సినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది కాగా రెండవది [[అక్బర్ సలీం అనార్కలి]]. విశ్వనాథ సత్యనారాయణ కు చిత్ర రూపం సంతృప్తి కలిగించలేదు. తొలిసారి విడుదలైనప్పుడు వ్యాపారపరంగా చిత్రం విజయవంతం కాలేదు. మలిదశ లో తెలుగు ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించారు. కె.వి.మహదేవన్ సంగీతం, దేవులపల్లి, నారాయణ రెడ్డి ల సాహిత్యం చిత్రాన్ని అజరామరం చేసాయి.
== చిత్రకథ==
తమిళనాడు లోని మదురై నేపధ్యంగా కథ సాగుతుంది. సేతుపతి (ఎన్.టి.ఆర్),, వీరభూపతి (కాంతారావు) ప్రాణస్నేహితులు. పరిస్థితుల కారణంగా సేతుపతి ఏకవీర (కె.ఆర్.విజయ) ను, వీరభూపతి మీనాక్షి(జమున)ను పెళ్ళి చేసుకుంటారు. నిజానికి సేతుపతి మీనాక్షిని, వీరభూపతి ఏకవీర ను ప్రేమించిఉంటారు. ఈ నలుగురి మధ్య ,అంతరంగ సంఘర్షణ చిత్రంలో ఆవిష్కరింపబడింది.
 
== పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఏకవీర_(సినిమా)" నుండి వెలికితీశారు