తలిశెట్టి రామారావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''తలిశెట్టి రామారావు''' (1906 - 1960) తొలి తెలుగు కార్టూనిస్ట్ (వ్యంగ్య ...
 
పంక్తి 4:
1906లో [[జయపురం]]లో జన్మించాడు. [[గిడుగు రామమూర్తి పంతులు]] కుమారుడు సీతాపతి వద్ద శిష్యరికం చేశాడు. బాల్యంలోనే తండ్రి మరణించాడు. జీవనం కోసం తల్లితో కలిసి దర్జీపని చేశాడు. ఆ తరువాత కార్టూన్లు గీయటంలో ఈ వృత్తి లోని అనుభవం కూడా దోహదం చేసింది. ఉన్నత విద్య జయపురంలోనూ, ఆ తరువాత పర్లాకిమిడి, ఆ తరువాత విజయనగరంలో బి.యే చదివారడు. ఆర్థిక కారణాల వల్ల చదువు ఆగిపోయి, ఆ తరువాత జయంపురం రాజా వారి సహాయంతో [[మద్రాసు]]లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం [[పార్వతీపురం]]లో న్యాయవాద వృత్తి చేపట్టారు. మద్రాసులో ఉన్నప్పుడే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుతో పరిచయం కలిగి వీరు గీచిన కార్టూన్లు ఆంధ్రపత్రిక మరియు భారతి పత్రికల్లో ప్రచురించటానికి దోహదమయింది. తొలుత బొమ్మలు మాత్రమే వేసేవాడు, అయితే ఆ తరువాత గిడుగు సలహాపై మాటలు కూడా కలిపి కూర్టూన్ శకానికి నాంది పలికాడు.
== రచనలు ==
#భారతీ పత్రికలో, ఆంధ్ర పత్రికల్లో కార్టూన్లు
#1930వ సంవత్సరంలో భారతీయ చిత్రకళ అనే పుస్తకం. వావిళ్లవారి ప్రచురణ.
 
== మూలాలు==
#తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలు - పుస్తకం. సేకరణ ముల్లంగి వెంకట రమణారెడ్డి.
"https://te.wikipedia.org/wiki/తలిశెట్టి_రామారావు" నుండి వెలికితీశారు