కనుమ: కూర్పుల మధ్య తేడాలు

చి paSuvula paMDaga
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''కనుమ''' ను పశువుల [[పండుగ]] గా వ్యవహరిస్తారు. [[పంటలు]] చేతికి అందడం లో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరం లో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పని చేసిన [[ఆవు]]లను, [[ఎద్దు]]లను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. [[పక్షులు]] కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.
 
{{హిందువుల పండుగలు}}
 
[[వర్గం:హిందువుల పండుగలు]]
పసువుల పండుగ.
 
సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండగను కనుమ పండగ అంటారు దీన్నె పశువులు పండగ అని కూడ అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు వెట్టి చాకిరి చేసిన మూగజేవాలైన పశువులకు ఈ రోజు పండుగే. తమిల్నాడు చిత్తూరు జిల్లా లలో ఈ రోజున "జల్లికట్టు" అని పశువులతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తారు. ఇది అటు పశువులకు ఇటు మనుషులకు ప్రమాధ కరం అయి నందున ప్రభుత్యం దీన్ని నిషేదించింది. వివిద ప్రాంతాల్లో ఈ పండగను వివిద పద్దతులతో జరుపు కుంటుండొచ్చు . ముక్యంగా ఛిత్తూరు జిల్లా , అందులో పాకాల మండలం లోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లొ ఈ పండగ జరుపుకొనుటలో ఒక ప్రత్యేకత వున్నది. అందుకే ఈ వ్యాసం. ఇంకొన్ని ప్రదేసాలలో కూ ఈ విధానం అమల్లొ వుండొచ్చు. ఆ ప్రత్యేకత ఏమిటంటే?
 
Line 13 ⟶ 11:
 
సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునప్రతిస్టించి వూరులో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడ్తారు. పొంగిలి అంటే కొత్త కుండలో, కొత్తా బియ్యం,కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చి పోయే ఊరి వారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. ఈ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని "చిట్లా కుప్ప" అంటారు. చీకటి పడే సమయానికి పొంగిళ్లు తయారయి వూంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అనగా ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు, పూజానంతరం మొక్కున్న వారు, చాకిలి చేత కోళ్లను కోయించు కుంటారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశు కాపరు లందరూ ఊరి పశువు లన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్ద గా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి.. చెదర గొట్టతాడు. అవి బెదిరి చేలెంబడి పరుగులు తీస్తాయి, ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలొ వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు .ఆ తర్వాత అందరు అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్లను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ల కెళతారు. ఈ సందార్బంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడ బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని" పొలి" అంటారు. ఆ "పొలి" ని తోటోడు గాని, నీరు గట్టోడు గాని తీసుకొని పోయి అందరి పొలాల్లో ,చెరువుల్లో, బావుల్లో "పొలో.... పొలి" అని అరువ్తు చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడ మొక్కు కుంటారు. అంటే, తమ పశు మందలు అభివృద్ది చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు .అప్పటికప్పుడే ఒక పొట్టేలి పిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.§[[వాడుకరి:Bhaskaranaidu|Bhaskaranaidu]] 07:55, 29 ఏప్రిల్ 2011 (UTC)(ఎ.భాస్కర నాయుడు)
 
{{హిందువుల పండుగలు}}
 
[[వర్గం:హిందువుల పండుగలు]]
"https://te.wikipedia.org/wiki/కనుమ" నుండి వెలికితీశారు