కనుమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
==పసువుల పండుగ==
 
సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండగను కనుమ పండగ అంటారు దీన్నె పశువులు పండగ అని కూడ అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు వెట్టి చాకిరి చేసిన మూగజేవాలైన పశువులకు ఈ రోజు పండుగే. తమిల్నాడు చిత్తూరు జిల్లా లలో ఈ రోజున "[[జల్లికట్టు]]" అని పశువులతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తారు. ఇది అటు పశువులకు ఇటు మనుషులకు ప్రమాధ కరంప్రమాదకరం అయి నందున ప్రభుత్యం దీన్ని నిషేదించింది. వివిద ప్రాంతాల్లో ఈ పండగను వివిద పద్దతులతో జరుపు కుంటుండొచ్చు . ముక్యంగా ఛిత్తూరు జిల్లా , అందులో పాకాల మండలం లోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లొ ఈ పండగ జరుపుకొనుటలో ఒక ప్రత్యేకత వున్నది. అందుకే ఈ వ్యాసం. ఇంకొన్ని ప్రదేసాలలో కూ ఈ విధానం అమల్లొ వుండొచ్చు. ఆ ప్రత్యేకత ఏమిటంటే?
 
ఆ రోజు ఇంటి కొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషద మొక్కలు, సేకరిస్తారు .కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరుడులు , కొన్ని, చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకారిస్తారు. కొన్ని నిర్ధుస్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి, అనగా, మద్ది మాను , నేరేడి మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచు తారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధుర మైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులొ ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆపశువు దాన్ని మీంగు తుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ల ఉప్పు చెక్కను తిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతటే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిస్తారు. ఏడాది కొకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. అది నిజమే కావచ్చు, ఎంచేతంటే అందులో వున్నవన్ని, ఔషదాలు, వన మూలికలే గదా.
"https://te.wikipedia.org/wiki/కనుమ" నుండి వెలికితీశారు