లలితా సహస్రనామ స్తోత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ru:Лалита-сахасранама
చి యంత్రము కలుపుతున్నది: ml:ലളിതാ സഹസ്രനാമം; పైపై మార్పులు
పంక్తి 7:
 
 
== స్తోత్ర పరిచయం ==
బ్రహ్మాండపురాణం 36వ అధ్యాయం "లలితోపాఖ్యానం"లో లలితా సహస్రనామ స్తోత్రం ఉంది. ఇందులో లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను వర్ణించారు. [[శ్రీమహావిష్ణువు]] అవతారమైన హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించాడు. [[లలితా పురాణం]]లో భండాసురుని సంహరించడానికి దేవి అవతరించినట్లుగా వర్ణించారు. ఈ గ్రంధాలలో శ్రీపురమును సూచించే [[శ్రీచక్రం]] నిర్మాణం వర్ణించబడింది. ఆదిశంకరులు, భాస్కరాచార్యుడు త్రిశతి, సహస్రనామములకు వ్యాఖ్యానాలు అందించారు.
 
పంక్తి 14:
 
 
== స్తోత్రం ముఖ్య విభాగాలు ==
అన్ని పెద్ద స్తోత్రాలలాగానే లలితా సహస్రనామస్తోత్రంలో కొన్ని విభాగాలున్నాయి. పూజ, అర్చన లేదా పారాయణ చేసే సందర్భాన్ని బట్టి కొన్ని విధి విధానాలను పాటిస్తారు. సాధారణంగా భక్తులు ముందు శుచిగా స్నానాది కార్యములు ముగించుకొని నిత్య పూజా కార్యక్రమం చేసుకొని లలితా సహస్రనామస్తోత్రమును చదవడం జరుగుతుంటుంది.
 
=== పూర్వ పీఠిక ===
పూర్వ పీఠికలో స్తోత్ర ఆవిర్భావాన్ని గురించి, ఆస్తోత్రం గోప్యనీయత గురించి హయగ్రీవుడు అగస్త్యునికి చెప్పిన వివరణ ఉంది. స్తోత్ర పారాయణ మహత్మ్యము, అది చదవడంలో పాటించవలసిన నియమాలు వివరింపబడ్డాయి. పూర్వ పీఠికలో తెలుపబడిన కొన్ని ముఖ్యాంశాలు -
 
పంక్తి 24:
లలితాదేవి సహస్రనామాలు రహస్యమయాలనీ, శ్రీదేవియందు శ్రద్ధాభక్తులు కలిగి గురుముఖతః పఞ్చదశాక్షరీ మంత్రోపదేశాన్ని పొందిన శిష్యునకు మాత్రమే గురువు ఈ రహస్యనామాలను ఉపదేశించాలనీ హయగ్రీవుడు తెలిపాడు. లలితా తంత్రాలలో ఈ సహస్రనామాలే సర్వశ్రేష్టం. వీనివలన శ్రీలలితాదేవి సులభంగా ప్రసన్న అవుతుంది. ముందుగా శ్రీచక్రార్చన, పంచదశాక్షరీ జపం చేసి, అనంతరం సహస్రనామ పారాయణ చేయాలి. జపపూజాదులకు అసమర్ధులైనవారు నామసహస్రపారాయణం మాత్రం చేయవచ్చును. దేవి ఆజ్ఞానుసారం వశిన్యాది దేవతలు రచించిన ఈ స్తోత్రం పారాయణం చేసేవారికి లలితాదేవి అనుగ్రహం, సకలాభీష్ఠ సిద్ధి కలుగుతాయి. శ్రీదేవి ఆజ్ఞానుసారం బ్రహ్మవిష్ణుమహేశ్వరాది దేవతలు, మంత్రిణి శ్యామలాంబవంటి శక్తులు కూడా ఈ లలితాసహస్రనామస్తోత్రాన్ని భక్తితో పఠిస్తున్నారు.
 
=== పారాయణ భాగం ===
పూర్వ పీఠిక, ఉత్తర పీఠికలను కొందరు పారాయణంలో భాగంగా చదువవచ్చును కాని సాధారణంగా వాటిని మినహాయించి "న్యాసం" నుండి "సహస్రనామము" వరకు పారాయణలో చదువుతారు.
;న్యాసం
పంక్తి 42:
 
;ధ్యానము, పూజ
[[ఫైలుదస్త్రం:Lalita sm.JPG|right|thumb|200px|శ్రీ లలిత, బాలా త్రిపురసుందరి, కామేశ్వరి, రాజరాజేశ్వరి ఇత్యాది నామములతో అర్చింపబడే శక్తి స్వరూపిణి శ్రీమాత స్తుతియే శ్రీలలితాసహస్రనామస్తోత్రము.]]
న్యాసం తరువాత ధ్యానం పఠిస్తారు. ఏ దేవతనుద్దేశించి ఈ స్తోత్రం పారాయణం చేయబడుతున్నదో ఆ దేవతను ముందుగా ధ్యానించడం సంప్రదాయం - ఈ స్తోత్ర ధ్యానంలో మూడు శ్లోకాలున్నాయి. "అరుణాం కరుణాంతరంగీమ్ ... ", "ధ్యాయేత్ పద్మాసనస్థాం...", "సకుంకుమ విలేపనామ్..." అనేవి ఆ మూడు ధ్యాన శ్లోకాలు. వాటిలో మొదటిది క్రింద వ్రాయబడింది.
<poem>
పంక్తి 98:
</poem>
 
=== ఉత్తర పీఠిక (ఫలశృతి) ===
మూడవ అధ్యాయం అయిన "ఉత్తర పీఠిక"లో ఫలశృతి చెప్పబడింది. అందులో హయగ్రీవుడు అగస్త్యునికి తెలిపిన కొన్ని విషయాలు:
 
శ్రీలలితాసహస్రనామములు రహస్యమయములు. అపమృత్యువులను, కాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి. సకల సంపదలనూ కలిగిస్తాయి. ఈ స్తోత్రాన్ని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం పఠించాలి. అన్ని పాపాలను హరించడానికి లలితాదేవియొక్క ఒక్కనామం చాలును. భక్తుడైనవాడు నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ నామపారాయణ చేయాలి. విద్యలలో శ్రీవిద్య, దేవతలలో శ్రీలలితాదేవి, స్తోత్రాలలో శ్రీలలితా సహస్రనామ స్తోత్రము అసమానములు. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన, రహస్యనామపారాయణ అనే భాగ్యాలు అల్పతపస్వులకు లభించవు. భక్తిహీనులకు దీనిని ఉపదేశింపరాదు. ఈ లలితాసహస్రనామస్తోత్రమును తప్పక పఠిస్తే శ్రీదేవి సంతసించి సర్వభోగములను ప్రసాదించును.
 
== అర్ధాలు, రహస్యార్ధాలు ==
 
ఉత్తరపీఠికలోను, పూర్వపీఠికలోను చెప్పబడిన విధంగా లలితాసహస్రనామస్తోత్రంలోని వివిధనామాలు రహస్యమయాలు, అనేక నిగూఢార్ధ సంహితములు అని అనేకులు భావిస్తారు. నామాలలో అనేక మంత్రాలు, బీజాక్షరాలు నిక్షిప్తమై యున్నాయని కూడా వారి విశ్వాసం. ముఖ్యంగా శాక్తేయులకు ఇవి చాలా విశిష్ఠమైనవి. ఈ శ్లోకంలోని నామాల అర్ధాలను, భావాలను అనేకులు వ్యాఖ్యానించారు. అంతేగాక వాటిని విషయపరంగా కొన్ని విభాగాలుగా చేసి, ఒక్కొక్క విభాగం ఒక్కొక్క తాత్విక లేదా తాంత్రిక ఆంశానికి చెందినట్లుగా భావిస్తున్నారు.
పంక్తి 133:
# నాదరూపిణీ
 
== శ్రీవిద్య, లలితాసహస్రనామము ==
 
లలితాసహస్రనామ పారాయణ (మంత్రము), శ్రీచక్ర పూజ (యంత్రము), కుండలినీయోగ సాధన (తంత్రము), - అనేవి శ్రీవిద్యోపాసనలో ముఖ్యమైన అంశాలు. సగుణ బ్రహ్మోపాసన, నిర్గుణ బ్రహ్మోపాసన అనే రెండు విధానాలు ఈ విద్యాసాధనలో నిక్షిప్తమై ఉన్నాయి. యోగసాధనలో చెప్పబడే [[షట్చక్రాలు]] (మూలాధార చక్రము, స్వాధిష్ఠాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము) లలితాసహస్రనామంలో చెప్పబడినాయి. ఈ చక్రాలను అధిగమించి సహస్రారంలో కొలువైయున్న జగన్మాతృకా స్వరూపాన్ని చేరుకోవడమే కుండలినీయోగసాధనలోని లక్ష్యం.
 
== వ్యాఖ్యానాలు ==
 
లలితా సహస్ర నామానికి అనేకులు వ్యాఖ్యలు వ్రాశారు. వీటిలో భాస్కరాచార్యుడు వ్రాసిన "సౌభాగ్య భాస్కరము" మనకు తెలిసినవాటిలో మొదటిది, మరియు అనేక ఇతర వ్యాఖ్యానాలకు మాతృక వంటిది. భాస్కరాచార్యుడు కృష్ణాతీరవాసి, ఆంధ్రుడు. [[కర్ణాటక]]లో [[బీజాపూర్]] నవాబుకు మంత్రి గంభీరరాయ దీక్షితులు మహాపండితుడు. [[మహాభారతం|మహాభారతాన్ని]] [[పార్శీ]] భాషలోనికి అనువదించి "భారతి" అనే బిరుదు పొందాడు. ఇతని భార్య కోనమాంబ. రాచ కార్యంపై ఈ దంపతులు హైదరాబాదుకు వచ్చినపుడు వారికి జన్మించిన బిడ్డ భాస్కరరాయలు. ఇతడు నారయణపేట వద్ద లోకాపల్లిలో నృసింహయాజి వద్ద విద్యాభ్యాసం చేశాడు. సూరత్‌లోని ప్రకాశానంది శివదత్తశుక్ల వద్ద దీక్షోపదేశం పొందాడు. దేశాటనం చేస్తూ 1750 ప్రాంతంలో [[కాశీ]] నగరాన్ని సందర్శించాడు. అక్కడ "సౌభాగ్య భాస్కరము" అనబడే లలితాసహస్రనామస్తోత్ర వ్యాఖ్యానం రచించాడు. ఇంకా సేతుబంధము, చండాభాస్కరము, తృచ భాస్కరము, పరివస్యా రహస్యము మొదలైన 43 గ్రంధాలను రచించాడు. ఇతని సిద్ధి శక్తులను గూర్చి, పాండిత్యాన్ని గూర్చి అనేక గాధలు ప్రచారంలో ఉన్నాయి.<ref>శ్రీవిద్యాసారధి - డా. క్రోవి పార్ధసారధి</ref>
పంక్తి 148:
* శివానందనాధుని శిష్యుడైన భట్టనారాయణుని వ్యాఖ్యం - 2500 శ్లోకాలలో
 
== రచనలు ==
 
== అభిప్రాయాలు ==
 
 
== విశేషాలు ==
* కొన్ని సహస్రనామ స్తోత్రాలలో కొన్ని నామాల పునరుక్తి కనిపిస్తుంది. అలాంటి చోట్ల వ్యాఖ్యాతలు ఆ నామాలకు వేరు వేరు అర్ధాలను తెలిపి పునరుక్తి దోషం లేదని నిరూపించారు. కాని లలితా సహస్రనామ స్తోత్రంలో ఏ నామము పునరుక్తింపబడలేదు.
 
పంక్తి 161:
 
 
== ఇవి కూడా చూడండి ==
* [[సౌందర్య లహరి]]
* [[శివ సహస్రనామ స్తోత్రము]]
పంక్తి 167:
 
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వనరులు ==
 
* [http://www.archive.org/details/SrimataSrividyaSrichakramu శ్రీమాతా, శ్రీవిద్య, శ్రీచక్రము] - రచన: ఎ.జి. ప్రసూన - ఇంటర్నెట్ ఆర్చీవులో లభిస్తున్నది.
 
* శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము - రచన: బ్రహ్మశ్రీ పురాణపండ రాధాకృష్ణమూర్తి - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి
 
* శ్రీవిద్యా సారధి (లలితా రహస్యనామ భాష్యము) - రచన: డా. క్రోవి పార్ధసారధి - ప్రచురణ: శివకామేశ్వరి గ్రంధమాల, విజయవాడ (2002)
 
== బయటి లింకులు ==
* [http://www.sreevidya.co.in/sahasranama.pdf సంస్కృతంలో లలితా సహస్రనామ స్తోత్రం పాఠం]
* [http://archives.chennaionline.com/festivalsnreligion/slogams/Sep07/09slokam81.asp లలితా సహస్రనామ స్తోత్రం లోని వేయి నామములకు అర్ధం]
 
 
 
[[వర్గం:స్తోత్రములు]]
 
[[en:Lalita sahasranama]]
[[ml:ലളിതാ സഹസ്രനാമം]]
[[ru:Лалита-сахасранама]]