తిమ్మరుసు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: సాళువ తిమ్మరుసు (తిమ్మరాజు కన్నడ భాషలో అరుసు రాజు పదానికి పర్...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
సాళువ తిమ్మరుసు (తిమ్మరాజు కన్నడ భాషలో అరుసు రాజు పదానికి పర్యాయ పదం.) అసమాన ప్రజ్ఞావంతుడు, గొప్ప రాజకీయ దురంధరుడు. ఆయన స్వస్ధలంస్వస్థలం చంద్రగిరి.చిన్న తనమున దుర్భర దారిద్ర్యమును అనుభవించినాడు. మంత్రాగమున చిట్టి గంగన శిష్యుడు. చిట్టిగంగన్న చంద్రగిరిని పరిపాలించిన సాళువ నరసింహరాయల వారి మంత్రి. తిమ్మరుసు మేధస్సును గుర్తించి చేరదీసినాడు. సమస్త దక్షిణావనిని ఒక పాలన క్రింది తేవలెనన్నది అతని ఆశయం. అతని ఆశయాన్ని తీర్చగలిగిన వాడు తిమ్మరుసు అని నమ్మకము చిట్టిగంగన్నకు గలిగినది. గంగనామాత్యుని మరణం తరువాత తిమ్మరుసు సాళువ నరసింహ రాయల మంత్రి గా నియమితుడైనాడు. విజయనగరమును పాలిస్తున్న సంగమ వంశమునకు చెందిన ఫ్రౌడ రాయలు అసమర్ధుడగున వలన, అతని పాలనలో ప్రజల పాట్లు తిమ్మరుసుకు తెలియరాగా, సాళువ నరసింహరాయల చేత విజయనగరముపై దండయాత్ర చేయింటినాడు. పిరికివాడైన ఫ్రౌడ దేవరాయలు పలాయనము చిత్తగించుటతో రాజ్యము సాళువ నరసింహరాయల వశమైనది. సాళువ నరసింహరాయల పిమ్మట అతని పెద్దకుమారుడు తిమ్మభూపాలుడు రాజైనాడు. అతని అనారోగ్య కారణమున అతని సేనాని తుళువ నరసరాయలే తిమ్మరుసు సహాయముతో వ్యవహారములను నిర్వర్తించెడి వాడు. తిమ్మభూపాలుని మరణానంతరము సాళువ నరసింహరాయుని రెండవ కుమారుడు, తిమ్మభూపాలుని సోదరుడైన రెండవ నరసింహ రాయలు సింహాసనమునధిష్టించెను.అతడు సమర్ధుడు కాకపోవుటచే తుళువనరసరాయలు అతనిని బంధించి పెనుగొండ దుర్గమున బంధించి విజయనగర రాజైనాడు. అతని మరణానంతరము తుళువనరసరాయల పెద్ద కుమారుడు వీరనరసింహరాయలు రాజైనాడు. వీరనరసింహరాయలు సవతి సోదరుడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్దదేవరాయలి సామర్ధ్యము పై తిమ్మరుసుకు అచంచల విశ్వాసము. శ్రీకృష్ణదేవరాయలనిన తిమ్మరుసుకు వాత్సల్యం. అతనిని విజయనగర సింహాసనము పై అధిష్టింప చేయవలెనని తిమ్మరుసు సంకల్పం. తిమ్మరుసును శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ అని పిలిచి పితృసమానునిగా గౌరవించుచుండెడి వాడు. వీరనరసింహరాయలు అస్వస్తుడైనాడు.మరణశయ్యపై నున్న అతడు బాలకుడైన తన కుమారుని పట్టాభిషిక్తుని చేయవలసినదిగా తిమ్మరుసును కోరినాడు.తిమ్మరుసుకు శ్రీకృష్ధదేవరాయలపై గల మక్కువను తెలిసిన వీరనరసింహుడు తన మరణానంతరము తన కుమారుని రాజు చేయడని తలచి శ్రీకృష్ణదేవరాయలను వధించి అతని కనుగుడ్డు చూపుమని ఆదేశించినాడు. శ్రీకృష్ణదేవరాయలను అజ్ఞాతములో ఉంచి మేకకళ్లను చూపి అవియే శ్రీకృష్ణదేవరాయల కనుగుడ్లని నమ్మబలిగినాడు. వీరనరసింహరాయల మరణానంతరము శ్రీకృష్ణదేవరాయలు అజ్ఞాతము వీడి తిమ్మరుసు సహాయముతో సింహాసనము నధిష్టించినాడు. తిమ్మరుసు మంత్రాగముతో శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యమును విస్తరింప చేసి నలుబది సంవత్సరములు సమర్ధవంతముగా పరిపాలన గావించినాడు. రాజ్యవిస్తరణే కాక సుపరింపాలన గావించుటవలన శ్రీకృష్ణదేవరాయల పాలన దక్షిణభారత చరిత్రలో సువర్ణాధ్యాయముగా నిలిచిపోయినది.
 
కళింగాధీశుడు వీరభద్రగజపతి, శ్రీకృష్ణదేవరాయల చేతిలో పరాజయమును తట్టుకోలేక ప్రతీకరేఛ్చతో అతని మనుమని (శ్రీకృష్ణదేవరాయనికి వీరభద్రగజపతి కుమార్తె ద్వారా కలిగిన కుమారుని) హత మార్చి ఆ నేరమును తిమ్మరుసుపై మోపినాడని, శ్రీకృష్ణదేవరాయలు సరియైన విచారణ సలపక, శ్రీకృష్ణదేవరాయలు, తిమ్మరుసు కనుగుడ్లు పీకించినాడను కథ వాడుకలో కలదు. దీనికి చారిత్రక ఆధారాలు లేవుకాని నాటకీయత కలిగి ఉండడంతోనాలుగైదు నాటకాలు ఈ కథాంశం తో రచించబడి ప్రాముఖ్యత పొందేయి.
"https://te.wikipedia.org/wiki/తిమ్మరుసు" నుండి వెలికితీశారు