ఓగిరాల రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==సంగీతం==
సంగీత దర్శకునిగా ఓగిరాల దాదాపు ఇరవై చిత్రాలకు పని చేశారు, ఆ చిత్రాలలో దాదాపు అన్నీ సంగీతపరంగా విజయం సాధించినవే. [[వాహిని ప్రొడక్షన్స్|వాహిని]] వారి చాలా చిత్రాలకు ఈయన పని చేశారు. అందులో [[వి.నాగయ్య|నాగయ్య]]గారికి సహాయకునిగా [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] (1945) మరియు [[యోగివేమన (1947 సినిమా)|యోగి వేమన]] (1947) వంటి చిత్రాలకు పని చేశారు. ఆ చిత్రాల పాటలలో ఓగిరాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. [[గుణసుందరి కథ]] (1949) మరియు [[పెద్దమనుషులు (1954 సినిమా)|పెద్దమనుషులు]] (1955) స్వతంత్రంగా ఆయన వాహిని వారికి
 
===వాహిని చిత్రాలు===
[[వాహిని ప్రొడక్షన్స్|వాహిని]] వారి చాలా చిత్రాలకు ఈయన పని చేశారు. అందులో [[వి.నాగయ్య|నాగయ్య]]గారికి సహాయకునిగా [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] (1945) మరియు [[యోగివేమన (1947 సినిమా)|యోగి వేమన]] (1947) వంటి చిత్రాలకు పని చేశారు. ఆ చిత్రాల పాటలలో ఓగిరాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. [[గుణసుందరి కథ]] (1949) మరియు [[పెద్దమనుషులు (1954 సినిమా)|పెద్దమనుషులు]] (1955) స్వతంత్రంగా ఆయన వాహిని వారికి పని చేసిన చిత్రాలు, ఈ రెండు చిత్రాలకు ఆయనకు సహాయకునిగా, వాద్యనిర్వాహకునిగా [[అద్దేపల్లి రామారావు]] పని చేయడం విశేషం.
 
===ఇతర చిత్రాలు===
సంగీతదర్శకునిగా ఓగిరాలకు మొదటి చిత్రం [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్ళీ పెళ్ళి]] (1939). నటి [[చిత్తజల్లు కాంచనమాల|కాంచనమాల]]తో కలిసి ఆయన ''నా సుందర సురుచిర రూపా'' అనే పాట పాడారు. ఈ పాటను కాంచనమాల, [[వై.వి.రావు]] పైన చిత్రీకరించారు. చలనచిత్రరంగంలో [[బెజవాడ రాజారత్నం]] గాయనిగా స్థిరపడటానికి ఓగిరాల సంగీతం ముఖ్య కారణం. [[మళ్ళీ పెళ్ళి (1939 సినిమా)|మళ్ళీ పెళ్ళి]] చిత్రంలో రాజారత్నంతో పాడించిన ''గోపాలుడే మన గోపాలుడే'', ''చెలి కుంకుమమే పావనమే'' తదితర గీతాలు పాడించారు. ఆ పాటలన్నీ ఆ రోజులలో జనం నాలుకలపై నిత్యం నాట్యం చేస్తూ ఉండేవి. [[విశ్వమోహిని]] (1940) చిత్రంలో ఆయన రాజారత్నంతో పాడించిన ''ఈ పూపొదరింటా'', ''భలే ఫేస్'', ''మేళవింపగదే చెలియా వీణ'' వంటి పాటలు ఆయన సంగీతానికి ఒక గొప్ప ఉదాహరణ. 1940లో అటువంటి ఆహ్లాదకరమైన సంగీతంతో కూడిన పాటలు అందించిన ఘనత ఓగిరాలకే దక్కింది. [[1941]] నుండి ఓగిరాల, [[ఘంటసాల బలరామయ్య]] నిర్వహిస్తున్న [[ప్రతిభ పిక్చర్స్]] చిత్రాలకు సంగీతం అందించడం మొదలు పెట్టారు. ఆయన సంగీతం అందించిన [[ప్రతిభ పిక్చర్స్]] చిత్రాలు [[పార్వతీ కళ్యాణం (1941 సినిమా)|పార్వతీ కళ్యాణం]] (1941), [[సీతారామ జననం]] (1944) మరియు [[ముగ్గురు మరాటీలు]] (1946). [[అక్కినేని నాగేశ్వరరావు]] రెండవ చిత్రం [[సీతారామ జననం]] (1944)లో , నాగేశ్వరరావుతో ''గురుబ్రహ్మ గురువిష్ణు'' శ్లోకం పాడించారు ఓగిరాల. [[ఘంటసాల బలరామయ్య]] తీసిన [[ముగ్గురు మరాటీలు]] (1946) చిత్రంలో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[టి.జి.కమలాదేవి]] చేత ''ఛల్ ఛలో వయ్యారిరి షికారి'' అనే యుగళగీతం పాడించారు. అదే చిత్రంలో [[కన్నాంబ]] చేత ''సతీ భాగ్యమే భాగ్యము'' మరియు ''తీరుగదా ఆశ'' అనే రేండు పాటలు పాడించారు. ఈ చిత్రంలో బెజవాడ రాజారత్నం ''జీవనము యమునా జీవనము'' మరియు ''రాటము భారతనారి కవచము'' అనే రెండు పాటలు పాడింది. ఈ చిత్రంలో ''జీవనము యమునా జీవనము'' పాట ప్రేక్షకాదరణ పొందింది, అది రాజారత్నం పాడిన పాట కావడం విశేషం. [[1949]]లో [[హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి]]తో కలిసి [[రక్షరేఖ]] చిత్రానికి సంగీతం అందించారు. అదే సంవత్సరం విడుదలైన వాహిని వారి [[గుణసుందరి కథ]] పెద్ద విజయం సాధించింది. [[1950]]లో విడుదలైన [[పరమానందయ్య శిష్యులు]] చిత్రానికి [[సుసర్ల దక్షిణామూర్తి]]తో కలిసి సంగీతం అందించారు, కానీ ఆ చిత్రం పరాజయం పొందింది. ఆ తర్వాత ఓగిరాల [[మాయా రంభ]] (1950), [[సతీ సక్కుబాయి (1954 సినిమా)|సతీ సక్కుబాయి]] (1954) చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత విడుదలైన [[పెద్దమనుషులు (1954 సినిమా)|పెద్ద మనుషులు]] (1954) చిత్రం గుణసుందరి కథ అంత విజయాన్ని సాధించింది. ఆ తర్వాత [[టి.వి.రాజు]]తో కలిసి [[శ్రీ గౌరీ మహత్యం]] (1956) చిత్రానికి సంగీతం అందించారు. [[భక్త రామదాసు (సినిమా)|భక్త రామదాసు]] (1964) చిత్రానికి ఓగిరాల, [[వి.నాగయ్య|నాగయ్య]], [[అశ్వత్థామ]] మరియు [[హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి]]తో కలిసి సంగీత శాఖలో పని చేశారు. 1957లో ఆ చిత్ర నిర్మాణం ప్రారంభమైన కొన్ని రోజులకే ఓగిరాల అనారోగ్యంతో మరణించారు.
 
===ముఖ్య చిత్రాలు===
 
==మరణం==