ఓగిరాల రామచంద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
===ముఖ్య చిత్రాలు===
ఓగిరాల సంగీతం అందించిన చిత్రాలలో ముఖ్యంగా పేర్కొనవలసినవి [[గుణసుందరి కథ]] (1949) మరియు [[పెద్దమనుషులు (1954 సినిమా)|పెద్ద మనుషులు]] (1954). ఆ రెండూ వాహిని వారి చిత్రాలు కావడం, ఆ రెండిట్లో [[అద్దేపల్లి రామారావు]] ఓగిరాలకు సహాయకునిగా, వాద్యనిర్వాహకునిగా పనిచేయడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఆ రెండూ చిత్రాలకు నిర్మాత మరియు దర్శకుడు [[కె.వి.రెడ్డి]] గారే మరియు రెండిట్లో నాయిక [[శ్రీరంజని జూనియర్|శ్రీరంజని జూనియరే]].
 
గుణసుందరి కథ చిత్రం విజయం సాధించడానికి ముఖ్య కారణాలలో ఓగిరాల సంగీతం ఒకటి. [[పి.లీల]], [[టి.జి.కమలాదేవి]], [[కస్తూరి శివరావు]], [[శాంతకుమారి]], [[కె.మాలతి|మాలతి]], [[ఘంటసాల]] తదితరులతో ఓగిరాల పాడించిన పాటలు విశేష జనాదరణ పొందాయి. ఈ చిత్రంలో పాటలన్నీ [[పింగళి నాగేంద్రరావు]] రాశారు. ఓగిరాల పి.లీల చేత పాడించినవన్నీ భక్తి పాటలే, వాటిలో ''శ్రీ తులసి ప్రియ తులసి'' పాట చాలా కాలం అందరి ఇళ్ళల్లో వినిపించేది, ఆ పాట పాడుతూ ప్రతీ స్త్రీ తులసి మాతను ఆరాధించేది. శాంతకుమారి, మాలతి కలిసి పాడిన ''కలకలా ఆ కోకిలేమో'' మరియు ''చల్లని దొరవేలె చందమామ'' పాటలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. ఘంటసాల ఈ చిత్రంలో ''అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా'' అనే నేపథ్యగీతం పాడారు. అలాగే కస్తూరి శివరావు, టి.జి.కమలాదేవి, వి.శివరాం పాడిన పాటలు కూడా పేరు పొందాయి.
 
పెద్ద మనుషుల చిత్రంలో [[ఘంటసాల]], [[రేలంగి]]కి పాడిన ''నందామయా గురుడ నందామయా'' మరియు ''శివశివ మూర్తివి గణనాథా'' బాగా జనాదరణ పొందాయి. ఆ రెండూ పాటలను [[కొసరాజు]] రాశారు. పి.లీల ఈ చిత్రంలో మూడు పాటలు పాడింది, ఆమె పాడిన ''నీ మీద ప్రాణాలు నిలిపింది రాధ'' పాట ఒక హిందీ చిత్రంలోని పాటకు అనుకరణగా సంగీతం అందించారు మరియు లీలనే పాడిన ''అంతభారమైతినా అంధురాలనే దేవ'' పాట మనస్స్సుకు హత్తుకునే విధంగా సంగీతం అందించారు. ఈ చిత్రం జాతీయ బహుమతి పొందిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ విధంగా జాతీయ బహుమతి పొందిన మొదటి తెలుగు చిత్రానికి సంగీతమందించిన వ్యక్తిగా ఓగిరాల కీర్తి పొందారు.
 
==మరణం==