శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]],
[[జయప్రద]],
[[బి.పద్మనాభం|పద్మనాభం]],
[[జగ్గయ్య]],
[[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]],
[[జి.వరలక్ష్మి]],
[[అల్లు రామలింగయ్య]],
[[రమాప్రభ]]|

అలనాటి మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకథ నుండి విచిత్రమైన కథలతో వినోదాత్మక చిత్రాలను నిర్మించడం విజయా వారి ప్రత్యేకత. కథ కంటే కథనం మిన్న. ఇంటిల్లపాదీ చక్కగా నవ్వుకునే చిత్రాలకి ట్రేడ్ మార్క్ విజయా. ఆ కోవలో వ్రయత్నమేశ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. పొట్ట కోసం పడే పాట్లు ఈ చిత్ర కధాంశం.

==కధాంశం==
నిరుధ్యోగి అయిన కృష్ణ ఒక క్రైస్తవ ఇంట్లో ఉధ్యోగం కోసం క్రైస్తవునిగా నాటకం అడుతూంటాడు. ఇంటి వారి కూతురు అతడిని ప్రేమిస్తుంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్ళి చేయాలని అనుకుంటున్నపుడు అతడు హిందువు అని తెలుస్తుంది. ఇది తెలిసిన ఇంటి యజమాని తన పూర్వాశ్రమంలో తను కూడా ఇదే విధంగా చేసానని, అలానే ఆ ఇంటికి అల్లుడిగా మారానని, తన మామగారికి కూడా తన గురించి తెలుసునని చెప్పి అతడిని తన కూతిరి భర్తగా చేస్తాడు.

== చిత్రకథ ==
బి.ఎ. పేసైన మాధ్యూస్ అనే ఒక యువకుడు పొట్ట పట్టుకొని పట్నం వస్తాడు. తన స్నేహితుడు సాయంతో ఒక బ్రాహ్మణ హొటల్ లో ముత్తయ్య అనే పేరుతో సర్వర్ గా పనికుదుర్చుకుంటాడు. హొటల్ యజమాని శేషాద్రి భార్య చని పోయింది. యుక్తవయస్సుకు వచ్చిన కుమార్తె ఉంది. నాయనమ్మ మనవరాలిని మరీ సాంప్రదాయపధ్ధతిలో పెంచుతుంది. సర్వర్ గా సరిగా పని చేయలేకపోడంతో పని నుంచి తొలగిస్తాడు యజమాని. యజమాని కూతురు మాటని కాదనడని తెలిసి ఆమె దగ్గర హృదయ విదారకమైన కథ చెబుతాడు. దానికి కరిగి పోతుంది ఆమె. వేరే పని ఇయ్య లేక కూతురు కు ఇంగ్లీష్ చెప్పే పనికి కుదురుస్తాడు యజమాని. నాయనమ్మ వరస కలిపి ఇద్దరికీ పెళ్లి చేయాలని యోచిస్తుంది. ఈ తమషా సంఘటనల మధ్య శేషాద్రి కూడా హిందువు కాదని, క్రిస్టియన్ అని బ్రతుకు తెరువుకోసం ఇరవై సంవత్సరాల క్రితం మతం దాచి బ్రాహ్మణ కాఫీ హొటల్ ప్రారంభించేడని తెలుస్తుంది. నాయక,నాయికల వివాహం తో కథ సుఖాంతమవుతుంది.
కథలో తొంగి చూసే హాస్యం కథనం లో లోపించింది. దానితో ప్రేక్షకుల ఆశించిన రీతికి సినిమా చేర లేక పోయింది. దానితో చిత్రం పెద్దగా విజయవంతం కాలేదు. చాలా గొప్ప చిత్రం కాక పోవచ్చు కానీ కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచిచిత్రం.

==పాటలు==