ఎస్.పి.కోదండపాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==జీవిత విశేషాలు==
ఇతను 1932 వ సంవత్సరంలో గుంటూరులో జన్మించారు.అతని బాల్యం [[గుంటూరు]]లో గడిచింది. ఇతను 9 వ తరగతి వరకు ఆ ఊరులోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు పద్యాలు, పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. [[అద్దేపల్లి రామారావు]] గారి [[నా ఇల్లు]] చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. [[సుసర్ల దక్షిణాముర్తిదక్షిణామూర్తి]] గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. [[1955]]లో [[సంతానం]] చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది. ఆ తరువాత [[కె.వి. మహదేవన్]] వద్ద ఐదేళ్ళు బాధ్యతలు నిర్వహించి ఎన్నో మెళకువలు తెలుసుకోగలిగారు.
 
హాస్యనటులు [[పద్మనాభం]] రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ సంస్థ పేరుతో నాటకాలు ప్రదర్శించేవారు. వారికి సంగీత దర్శకులుగా సేవలందించారు. అక్కడ సంపాదించిన కీర్తి ప్రతిష్టల వల్ల 1961లో [[కన్నకొడుకు]] (1961) చిత్రానికి సంగీత దర్శకులయ్యారు. తరువాత [[పదండి ముందుకు]] (1962), [[మంచి రోజులొచ్చాయి]], [[బంగారు తిమ్మరాజు]], [[తోటలో పిల్ల కోటలో రాణి]], [[లోగుట్టు పెరుమాళ్ళకెరుక]] మొదలైన చిత్రాలకు పనిచేశారు. తాను సంగీతం చేకూర్చే ప్రతి పాట శ్రావ్యంగా ఉండాలని, సాహిత్య విలువ దెబ్బతినకూడదని భావించేవారు. ఈయన మొత్తం 101 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఇతను చిన్న వయసులోనే 42 సంవత్సరాలకే (5 ఏప్రిల్ 1974) న చనిపోయారు.
 
[[పద్మనాభం]] గారి [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రం ద్వారా వీరు 1967లో ఈనాటి ఉత్తమ గాయకులు [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] ను తెలుగు తెరకు పరిచయం చేశారు.
"https://te.wikipedia.org/wiki/ఎస్.పి.కోదండపాణి" నుండి వెలికితీశారు