ఎం. ఎస్. విశ్వనాథన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==సినీ జీవితం==
అది 1941వ సంవత్సరం. ఆ రోజు విజయదశమి, మద్రాసులో తొలిసారి పాదం మోపాడు విశ్వనాధన్. మేనమామ సహాయంతో, జూపిటర్ పిక్చర్స్ అధినేతలు ఎమ్.సుందరం చెట్టియార్, మొహిద్దీన్ లను కలిశాడు. న్యూటోన్ స్టూడియాలో మెకప్ టెస్ట్ చేశారు. ఆపాత్రకుఆ పాత్రకు నీవు పనికిరావు , మళ్ళీ తర్వాత చూద్దంచూద్దాం అని చెప్పి వారు వెళ్లిపోయారు. అదే నిర్మాతలను కలిసి, అక్కడే ఆఫీస్ బాయ్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. ఓ పక్క ఆఫీస్ బాయ్ గా చేస్తూనే మరో పక్క జూపిటర్ సంస్థ తీసిన "కుబేర కుచేల" సినిమాలో సేవకునిగా చిన్న వేషం వేశాడు. నటుడు కావడానికి తన ఆకారము, పర్సనాలిటి సరిపోదని తనకే అర్ధమైపోయింది. అందుకే సంగీత విభాగంలొనే కృషి చేసి పైకి రావాలని నిర్ణయించుకున్నాడు. సేలంలో మోడ్రన్ థియేటర్స్ అనే సంస్థ ఉంది. అక్కడ సంగీత దర్శకుడు [[కె.వి.మహదేవన్]] ఉన్నారని తెలుసుకొని వెళ్లి కలిశాడు. విశ్వనాధన్ తో ఓ పాట పాడించుకున్నారు మహదేవన్ గారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్లుగా, ఆ ఒక్క పాట తోనే విశ్వనాధన్ లోని ప్రతిభని గుర్తించారు మహదేవన్. నువ్వు సరాసరి సెంట్రల్ స్టూడియోకి వెళ్లు అక్కడ పని దొరుకుతుంది అని చెప్పారు. సెంట్రల్ స్టూడియోలో ఎస్.ఎమ్.సుబ్బయ్య నాయుడు సంగీత దర్శకునిగా ఉన్నారు. ఆ ట్రూపులో హార్మోనిస్ట్ గా చేరాడు. అక్కడే "రామమూర్తి" (తిరుచారాపల్లి కృష్ణస్వామి రామమూర్తి) తో స్నేహం ఏర్పడింది. అలా చాలా రోజులు సుబ్బరామన్ దగ్గర సహాయకునిగా పనిచేశారు ఇద్దరూ.. సుబ్బరామన్ దగ్గర ఉన్నప్పుడే ఘంటసాల, సుసర్ల దక్షిణామూర్తి, టి.జి.లింగప్ప, గోవర్ధనం పరిచయమయ్యారు.
 
ఇలా కొద్ది రోజులు గడిచాక ఎమ్జీఅర్ హీరోగా "జనోవా" అనే సినిమాకి సంగీత దర్శకత్వం చేసే అవకాశం విశ్వనాధన్ కు వచ్చింది. ఒకే రోజు నాలుగు పాటలు చేశాడు. అవి సాయంత్రం సుబ్బరామన్ కు వినిపిద్దామని అనుకున్నాడు. కాని ఈలోపే వినకూడదని అనుకున్న వార్త వినాల్సి వచ్చింది, సుబ్బరామన్ చనిపోయారు అని. అప్పటికే సుబ్బరామన్ చేతిలో ఏడు సినిమాల దాకా ఉన్నాయి. వాటిని విశ్వనాధన్ - రామమూర్తి లు కలిసి పూర్తిచేసారు. అప్పటికే సుబ్బరామన్ [[దేవదాసు]] సినిమాకి 7 పాటలకు బాణీలు చేశారు. మిగిలిన రెండు పాటలు "జగమే మాయ బ్రతుకే మాయ", బాలసరస్వతి పాడిన "ఇంత తెలిసియుండి" అను పాటలను కూడా స్వరపరిచారు. ఇలా సుబ్బరామన్ ఒప్పుకున్న తెలుగు, తమిళం చిత్రాలను ఎంతో చిత్తశుద్ధితో సకాలంలో పూర్తి చేశారు. ఇక ఆ తరువాత వీరిద్దరు కలిసి ఎన్నో చిత్రాలకు కలిసి సంగీత దర్శకత్వం చేశారు. 1965 లో కొన్ని కారణాల రీత్యా ఇద్దరూ విడివిడిగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 30 ఏళ్లు ఇద్దరూ కలుసుకోలేదు. ఆ తర్వాత విశ్వనాధన్ సోలోగా 700 సినిమాలకు (తమిళం 510, మలయాళం -76, కన్నడం - 3, తెలుగులో 70) పైగా స్వర సారధ్యం వహించారు. ..చేస్తున్నారు కూడా.
 
==సంగీతాన్నందించిన తెలుగు సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/ఎం._ఎస్._విశ్వనాథన్" నుండి వెలికితీశారు