రిషికేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: es:Rishikesh
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ta:ரிசிகேசு; పైపై మార్పులు
పంక్తి 1:
'''రిషికేశ్''' [[ఉత్తరాఖండ్]] రాష్ట్రంలో [[డెహరాడూన్]] జిల్లాలోని ఒక మునిసిపాలిటీ.
 
== స్థల పురాణం ==
[[బొమ్మదస్త్రం:Histarikal lashan jhula.JPG|thumb|left|చారిత్రక ప్రసిద్ధి కలిగిన లక్ష్మణ ఝులా]]
రిషికేశ్ స్థితి కారకుడు విష్ణుమూర్తి నామాలలో ఒకటి.ఇది హిందువుల పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఇది హిమాలయాల దిగువ భాగంలో ఉంది. శ్రీరాముడు రావణ సంహారం తరవాత బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ పరిహార కర్మలాచరించినట్లు పురాణ కధనం. రిషికేశ్ హరిద్వార్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిమాలయ చార్‌దామ్‌లుగా ప్రసిద్ధి చెందిన [[బద్రీనాథ్]], [[కేదార్‌నాథ్]], [[గంగోత్రి]] మరియు [[యమునోత్రి]].
 
పవిత్ర [[గంగానది]]రిషికేశ్ గుండా ప్రవహిస్తుంది. [[గంగా నది]] హిమాలయాలలోని శివాలిక్ కొండలను దాటి ఉత్తర భారత మైదానాలలో ప్రవేశించే ప్రదేశమే రిషికేశ్. రిషికేశ్ లోని గంగాతీరంలో అనేక పురాతన దేవాలయాలు ఉన్నాయి. అలాగే నూతనంగా నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. ఈ నగరం అనేకమంది భారత దేశంలోని వేలకొలది భక్తులను ఆకర్షిస్తుంది. వీదేశీ పర్యాటకులు కూడా ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతుంటారు. రిషికేశ్‌లో ఉన్న యోగా శిక్షణాలయాలూ భక్తులను ఆకర్షించడానికి ప్రధాన కారణం. యోగా నగరం అని రిషికేశ్ కూ మారుపేరు విదేశీయులలో ప్రసిద్ధం. పవిత్ర గంగా స్నానం, రిషికేశ్‌లో ధ్యానం భక్తులకు మోక్షం కలిగిస్తుందని భక్తుల విశ్వాసం.
 
రిషికేశ్ పరిసర ప్రాంతంలో గంగా నదీ తీరంలో ఉన్న ఋషి వాటికలు కారణంగా ఈ ఊరికి ఈ పేరు వచ్చినట్లు విశ్వసిస్తున్నారు. ఇది వ్యాపార మరియు సమాచార కూడలిగా కూడా ప్రాముఖ్యత కలిగిన నగరం. రిషికేశ్ పరిసరాలలోని ఆకర్షణీయమైన పల్లె ఋషికీ రేటీ. శివానందనగలో స్వామి శివానందచే స్థాపించబడిన ' శివానంద ఆశ్రమం' మరియు 'డివైన్ లైఫ్ ఆఫ్ సొసైటీ' ఉన్నాయి. ఉత్తర రిషికేశ్, లక్ష్మణ్ ఝులా ఉత్తర భాగంలో కొంచందూరంగా ఉన్న స్వర్గ్ ఆశ్రమం దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆశ్రమాలు నీలఖంఠ మహాదేవ్ గుడి గంగానది తూర్పు తీరంలో ఉన్నాయి. నీలఖంఠ మహాదేవ్ గుడి రిషికేశ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రివేణీ ఘాట్‌లో ఇచ్చే హారతి దర్శించడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు.
 
రిషికేశ్‌లో 120 సంవత్సరాల క్రితం స్థాపించబడిన కైలాష్ ఆశ్రమ బ్రహ్మవిద్యాపీఠం ఉంది.ఇక్కడ విద్యార్ధులకు ప్రాచీన వేదవిద్యలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణాలయంలో ప్రసిద్ధులైన స్వామి వివేకానంద, స్వామి రామతీర్ధ మరియు స్వామి శివానంద శిక్షణ తీసుకున్నారు.
 
ప్రస్తుతం మూసివేసిన మహేష్‌యోగి ఆశ్రమంకు 1960లలో బీటిల్స్ విదేశీ సంగీతకారుల బృందం వచ్చింది. మైక్ లవ్, ది బీచ్ బాయ్స్, డోనోవన్ మరియు జిప్ మిల్స్ లాంటి కళాకారులు ఈ నగరానికి ధ్యానం అభ్యసించటానికి వచ్చారు.సరికొత్తగా ఇక్కడకు విచ్చేసిన ప్రముఖ కాళాకారిణి హాలీవుడ్ నటి కాటే విన్స్‌లెట్.
 
== జనాభా ==
2001 జనాభా లెక్కలననుసరించి రిషికేశ్ 59,671.పురుషులు 56% స్త్రీలు 44%.అక్షరాశ్యత 75%.ఇది జాతీయ అక్షరాశ్యత(59.1%) కంటే అధికం.పురుషుల అక్షరాశ్యత 80%,స్త్రీల అక్షరాశ్యత 68%.6 సంవత్సరాల లోపు పిల్లలు 12%.
 
{{భారత దేశంలోని హిందువుల పవిత్రనగరాలు}}
పంక్తి 23:
[[hi:ऋषिकेश]]
[[kn:ರಿಷಿಕೇಶ]]
[[ta:ரிஷிகேஷ்ரிசிகேசு]]
[[ml:ഋഷികേശ്]]
[[als:Rishikesh]]
"https://te.wikipedia.org/wiki/రిషికేశ్" నుండి వెలికితీశారు