బుట్ట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
బ్లాక్‌యాష్‌ (Black ash), మరియు స్వాంప్‌యాష్‌ (swamp ash) చెట్ల దుంగల నుండి (Wood log) బుట్టలను చెయ్యుటకై, మొదట లావుగా వున్న చెట్టుకాండం నుండి దుంగలను పచ్చిగా వున్నప్పుడే కత్తరించి వేరు చెయ్యుదురు. చెట్టు పెరుగుచున్నప్పుడు, చెట్టు వయసును బట్టి, చెట్టు కాండంలో వలయాకారపు పెరుగుగల రింగులు (growth rings) ఏర్పడును.బుట్టల అల్లికకై ఎక్కువ పెరుగుదల రింగులున్న దుంగలను ఎంచుకొనెదరు. యిలా కత్తరించిన దుంగలకున్న కొమ్మలను, బెరడును మొదట తొలగించెదరు. యిప్పుడు గొడ్డలి వెనుకభాగంతో గుంగలపై చుట్టు కొట్ట్టటం (Pounding) వలన పెరుగుదల వలయాకారపు రింగులు పలుచని పొరలుగా వేరుపడును. ఈ పొరలను వేరుచేసి, శుభ్రపరచి, కావలసిన సైజుకు సన్నని, పొడవైన బద్దిలుగా కత్తరించి సిద్దమ్ చెయ్యుదురు. ఈ సన్నని బద్దిలను (strips) నీటిలో నానబెట్టి (soaking), వంచుటకు అనుకూలంగా తయారుచేసి, బుట్టలను అల్లెదరు. రంగురంగుల బుట్టలను అల్లుటకై బద్దిలకు రంగులను అద్ది ,ఆరబెట్తి, బుట్టలను అల్లెదరు. ఆహార ధాన్యమును నిలువ వుంచు బుట్టలు (గాదెలు) వలయాకారంగా, పెద్దవిగా వుండును.
చిన్నచిన్న ఫ్యాక్టరిలో ఉపయోగించు బుట్టలు వెడల్పుగా వుండును. యురొప్‌, తూర్పు ఆసియా దేశాలలో బుట్టలల్లికను నేర్పించు ట్రైనింగ్‌ సంస్దలు కలవు. ఆసియా దేశాలలో మిలియను మంది ప్రజానీకం బుట్టల అల్లిక మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ప్లాస్టిక్‌తో చేసిన బుట్టల వినియోగం పెరిగినది. కాని ప్లాస్టిక్‌ బుట్టలను ఎక్కువగా వినియోగించడం వలన పర్యావరణానికి మిక్కిలి హనికరం. అందుచే ప్లాస్టిక్‌ బుట్టల వాడకం తగ్గించడం అందరి ప్రాధమిక కర్తవ్యము.
 
[[వర్గం:గృహోపకరణాలు]]
 
[[en:Basket]]
"https://te.wikipedia.org/wiki/బుట్ట" నుండి వెలికితీశారు