ఎల్. ఆర్. ఈశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| Years_active = 1950s-1980s
}}
'''ఎల్. ఆర్. ఈశ్వరి''' ('''L. R. Eswari''') ప్రముఖ నేపధ్య గాయని. ఈమె [[మద్రాసు]]లో ఒక రోమన్ [[కాథలిక్]] కుటుంబంలో జన్మించింది. ఈమె పూర్తి పేరు "లూర్డ్ మేరీ". ఆమె బామ్మ హిందూ కావడంతో "రాజేశ్వరి" అని పిలిచేవారు. తమిళ చిత్ర నిర్మాత [[ఎ.పి.నటరాజన్]] ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్. ఆర్. ఈశ్వరి గా మార్చారు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, తుళు మరియు ఆంగ్ల భాషలలో కొన్ని వేల పాటల్ని పాడారు.
 
ఈమెను మొదటగా [[కె.వి.మహదేవన్]] గుర్తించి "నల్ల ఇడత్తు సంబందం" (1958) అనే తమిళ సినిమాలో మొదటిసారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చారు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. అయితే "పాశమలార్" (1961) సినిమాతో ఆమె మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా [[చెళ్ళపిళ్ళ సత్యం]] దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్ మరియు ఐటమ్ నంబర్లకు పాడారు. ఈమె ఎక్కువగా [[జ్యోతిలక్ష్మి]], [[జయమాలిని]], [[సిల్క్ స్మిత]] మొదలైన నాట్యకత్తెలకు పాడేవారు. వీరే కాకుండా [[విజయలలిత]], [[లక్ష్మి]], [[సరిత]] వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసారు.
"https://te.wikipedia.org/wiki/ఎల్._ఆర్._ఈశ్వరి" నుండి వెలికితీశారు